Udyamanni, udyama kaarulani.. Chalanachithram.com | Topics | Search
Hide Clipart | Log Out | Register | Edit Profile

Last 30 mins | 1 | 2 | 4 hours     Last 1 | 7 Days

Chalanachithram.com DB » TF Industry related » Archive through October 21, 2011 » Udyamanni, udyama kaarulani.. « Previous Next »

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Vulavacharu
Junior Artist
Username: Vulavacharu

Post Number: 17
Registered: 04-2011
Posted From: 98.174.228.58

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Wednesday, October 19, 2011 - 11:58 am:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనకోసం తెలంగాణ రాజకీయ జెఎసి నెలరోజులకు పైగా నిర్వహిస్తున్న సకలజనుల సమ్మె విజయవంతం అయినట్లా? విఫలమైనట్లా? ఈ ప్రశ్నకు ఎవరికి కావాల్సిన సమాధానం వారు చెప్పుకోవచ్చు. సమ్మె విజయవంతం అయిందని తెలంగాణ ఉద్యమ నేతలు ప్రకటిస్తున్నారు. ఒకరకంగా చూస్తే సమ్మె విజయవంతం అయినట్లు తెలంగాణ ఎన్.జీ.ఓలంతా సమ్మెలోకి వచ్చారు. సింగరేణి కార్మికులు, టీచర్లు, విద్యాసంస్థలు ఆయా రంగాలకు చెందిన ఉద్యోగులు, చివరికి ఎక్సైజ్ ఉద్యోగులు సైతం సమ్మెలో పాల్గొన్నారు. అంతవరకు కచ్చితంగా విజయం కిందే తీసుకోవాలి. అంతేకాదు. అసలే నష్టాలలో ఉన్న ఆర్టీసిని మరింత కష్టాలలోకి నెట్టడంలో విజయవంతం అయినట్లే లెక్క. అదే సమయంలో ప్రైవేటు వాహనాల పంట పండింది.విజయవాడ హైవే మినహాయించి మిగిలిన ప్రాంతాలకు అవి ఇబ్బంది లేకుండా నడిచాయి. ఇష్టారాజ్యంగా ఛార్జీలు వసూలు చేశారు. హైదరాబాద్ నగరంలో సిటీ బస్ లు లేకుండా చేశారు. తద్వారా ఆటోలు, క్యాబ్ లు వంటివి రేట్లు పెంచి వాహనాలు నడిపారు.సింగరేణి బొగ్గు సరఫరా లేక వేలాది రైతులు తమ పంటలు ఎండబెట్టుకోవలసి వచ్చింది. ఇక విద్యార్ధులు చదువులు లేకుండా ఇళ్లకే పరిమితం అయ్యారు.సమ్మెను స్వచ్చందంగా చేసినవారు ఉన్నారు. భయపడి చేసినవారూ ఉన్నారు. ఏది ఏమైనా సమ్మె జరిగింది. కాని ఎవరికి ప్రయోజనం కలిగింది.సకల జనుల సమ్మెలో అందరూ పాల్గొనడం వల్ల, రైల్ రకోను నిర్వహించడం ద్వారా తెలంగాణ సమస్య తీవ్రతను ,ఆకాంక్షను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లగలిగామని ఉద్యమ నేతలు వాదిస్తున్నారు. ఇందులో కొంత వాస్తవం ఉంది. అయితే ఉద్యోగ సంఘాలు ఒక రాజకీయ అంశంపై సమ్మెలకు దిగితే అవి పరిష్కారం అవుతాయన్న నమ్మకం లేదని గత అనుభవాలు చెబుతున్నా ,తెలంగాణ నేతలు ఈ బ్రహ్మాస్త్రాన్ని వదిలారు. లక్షల సంఖ్యలో ఉన్న వీరు సమ్మె చేశారు కాని, ఆ తర్వాత నెల పూర్తి అయ్యేసరికి ఒక్కక్కరుగా సమ్మెను ఏదో కారణంగా విరమించుకోక తప్పని స్థితి ఏర్పడింది. తెలంగాణ వచ్చేవరకు సమ్మె చేస్తామని ప్రకటించిన కార్మిక నేతలు , ప్రభుత్వంతో చర్చలకు వెళ్లి, తక్షణం తమ ఉద్యోగులకు అడ్వాన్సులు ఇప్పించుకోవడానికి, ఇతర ఇబ్బందులు లేకుండా చూసుకోవడానికి తంటాలు పడ్డారు. ఆర్గనైజ్ డ్ సెక్టార్ లో ఉన్న వీరు సమ్మె చేసినా ఏదో రూపంగా ప్రభుత్వం నుంచి
తమకు కావలసిన డబ్బు సంపాదించుకున్నారు.బాఠ—ానే ఉంది. మరి అసంఘటిత రంగంలో ఉన్న లక్షలాది మంది రైతులకుకాని, ఉపాధి దొరకకుండా పోయిన కార్మికులకు కాని అడ్వాన్స్ లు ఎవరు ఇస్తున్నారు?ఇక్కడ విషాదం ఏమిటంటే ఇలా జరుగుతుందని తెలిసి కూడా ఉద్యమ నేతలు కె.చంద్రశేఖరరావు, కోదండరామ్ గాని ఎందుకు తెలంగాణ సమాజాన్ని ఇంతగా యాతన పెట్టారని ప్రశ్నిస్తే సమాధానం దొరకడం కష్టం. తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని చేయడం తప్పు కాదు.అలాగే సమ్మెలను ప్రకటించడం ఆక్షేపణ కాదు.కాని ఇక్కడ మానవీయ కోణం లోపించడం వల్లనే ఉద్యమం దెబ్బతిందనిపిస్తుంది .ఉద్యమాలలో మానవీయ కోణాలు ఉండవని ఎవరైనా వాదించవచ్చు. కాని మానవత్వంతో నడపని ఉద్యమాలేవీ ఎక్కువ సందర్భాలలో విజయవంతం కాలేదన్నది చరిత్ర చెబుతున్న సత్యం. అదెలాగో చూద్దాం. విద్యుత్ కోత కారణంగా పంటలు దెబ్బతింటున్నాయని, కొన్ని రోజులు సింగరేణి కార్మికుల సమ్మె ను సడలించాలని చాలామంది కోరారు. కాని పట్టించుకోలేదు. చివరికి ఏమైంది. సింగరేణి కార్మిక సంఘాలు నామమాత్రంగా జెఎసికి చెప్పి సమ్మె విరమణపై వైపు మొగ్గు చూపాల్సి వచ్చింది. అదే కనుక ముందుగానే ఉద్యమ నేతలు కనుక రైతులకు, కార్మికులకు నష్టం వచ్చిందని చెప్పి, మనవాళ్లకు నష్టం వచ్చేలా చేసుకుంటే మనకు ఏమి లాభం? అని భావించి ఉంటే ఎంత బాగుండేది. ఒక వారం రోజుల సమ్మె తర్వాత ఈ ప్రభుత్వానికి మానవత్వం లేదని విమర్శించి, తాము మానవత్వంతో ఆలోచించి రైతులకోసం సమ్మెను సడలిస్తున్నామని చెప్పి ఉంటే కోదండరామ్ కు గాని, కెసిఆర్ కు గాని ఎనలేని గౌరవం వచ్చి ఉండేది.అలా ఎందుకు చేయలేకపోయారో తెలియదు.ఇక విజయవాడ హైవే మీద బస్ లపై రాళ్లు విసిరి ప్రయాణికులను గాయపరిచితే , గంటల తరబడి బస్ లను ఆపి మహిళలను, వృద్దులను , పిల్లలను కూడా నరకయాతనలకు గురి చేస్తే పౌర హక్కుల కోసం వాదించిన వ్యక్తిగా కూడా ఉన్న కోదండరామ్ ఒక్కసారి అన్నా విచారం వ్యక్తం చేయలేదు. బస్ లపై రాళ్లు వేసేవారికే మానవహక్కులు ఉంటాయన్నట్లుగా, బస్ లలో ప్రయాణించేవారికి హక్కులు ఉండవన్నట్లుగా ఉద్యమ కారులు అమానుషంగా వ్యవహరించారు. ఇది కూడా లోపంగానే కనిపిస్తుంది. ఉద్యమకారులు బస్ లను ఆపదలిస్తే ఆపమనండి . కాని వారికి అవసరమైన కనీస సదుపాయాలు ఉండేలా చూడగలిగితే ఉద్యమం పట్ల ఎనలేని గౌరవం పెరిగేది. వారు ఒక ఆకాంక్ష కోసం చేస్తున్నదానికి మనం కూడా సహకరించాలన్న భావన అందరిలో మరింత కలిగేది. విద్యాసంస్థల విషయాన్ని చూడండి. విద్యాసంస్థలు మూత పడడం వల్ల వేలాది మంది తెలంగాణ పిల్లలు కోస్తా ప్రాంతాలకు వెళ్లి చదువుకోవాల్సి వచ్చింది. ఉద్యమాన్ని దృష్టిలో ఉంచుకుని చాలామంది ముందుగానే అటువైపు వెళ్లి విద్యాసంస్థలలో చేరారు.సమ్మె ఆరంభంకాగానే రెసిడెన్షియల్ సంస్థలు యధాతధంగా వారి పిల్లలను విజయవాడ, గుంటూరు వంటి పట్టణాలకు తరలించి అక్కడ పాఠాలు చెప్పాయి. అంతేకాదు. అనేక సంస్థలు చాటుమాటుగా తెల్లవారు జామున, సాయంత్రం వేళ క్లాసులు నిర్వహించాయి. కాని ప్రభుత్వ పాఠశాలలన్నీ మూతపడడంతో ఎవరు నష్టపోయారు? బడుగు,బలహీన వర్గాల, దళితుల పిల్లలు అధికంగా దెబ్బతినే పరిస్థితి వచ్చింది. రాజధాని నగరంలో పిల్లల తల్లిదండ్రులు ముఖ్యమంత్రిని కలిసినా, ఎమ్.ఆర్.పిఎస్. నేత మంద కృష్ణ మాదిగా ఏకంగా ధర్నా నిర్వహించినా ఎందుకు ఆదరణ లభించిందో ఉద్యమ నేతలు ఆలోచించాలి. కొందరు మహిళలతో పోటీగా తెలంగాణ వచ్చేవరకు బడులు పనిచేయక్కర్లేదని కొందరు మేధావుల సమక్షంలో చెప్పించి ఉండవచ్చు. కాని అందులో వాస్తవిక లేదని ఆ తర్వాత రెండు రోజులలోనే తేలిపోయింది. అదే కొన్ని రోజులు సమ్మె చేసిన తర్వాత మా పిల్లల భవిష్యత్తును మేమే చెడగొట్టుకుంటామా? ఉద్యమం చేస్తాం, పిల్లల చదువులను కాపాడుకుంటాం అని ఉద్యమ నేతలు చెప్పి ఉంటే తెలంగాణ సమాజం మరింతగా సంతోషపడే సందర్భం అయి ఉండేది.ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం సాధించడం కోసం తెలంగాణ సమాజాన్నే హింసించుకోనవసరం లేదు. ఎందుకంటే తెలంగాణలో ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష బలంగా ఎన్నోసార్లు వినపడింది. కనపడింది.ఆ సంగతి కేంద్ర నేతలకు తెలుసు. రాష్ట్ర నేతలకు తెలుసు. ఆ విషయంలో ముందంజలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితికి అంతకన్నా బాగా తెలుసు. కాని ఉద్యమం ద్వారా రాజకీయంగా బలపడాలన్న లక్ష్యంతో ఆ పార్టీ వ్యూహరచన చేసింది. దానివల్లనే ఇన్ని సమస్యలు వచ్చాయని కొందరు నేతలు వ్యాఖ్యానిస్తుంటారు. నేతలు చాలామంది పైకి సకల జనుల సమ్మెకు మద్దతు ఇస్తున్నామని చెబుతూనే , ప్రజల కష్ట నష్టాలను ఏకరువు పెడుతూ వచ్చారు. ఎందుకంటే సమ్మె వద్దని చెబితే ఓట్లు రాకుండా పోతాయేమోనన్న భయం వారిది.నిజానికి సకల జనుల సమ్మె అన్న కొత్త పేరును కనిపెట్టిన తీరు బాగానే ఉంది.కాని దాని అమలు చేసే విధానమే సరిగా లేదు. సకల జనులు అంటే ఎవరో ముందుగా నిర్వచించి ఉండాలి.తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు సమ్మె చేస్తారన్నంతగా ప్రచారం చేశారు. కాని అది సాధ్యం కాదు. చివరికి ఎన్జీఓ నేతలే ఇది సకల ఉద్యోగుల సమ్మెగా మారిందని చెప్పారు. రాజకీయ నేతలు ఉదయం వేళ గంట సేపు ధర్నా చేసి, సాయంత్రం తమ వ్యాపారాలు చేసుకున్నారని ఆరోపించారు. ఇది ఎవరిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలో కూడా వారు చెబితే బాగుండేది.ఇక్కడ ఉద్యోగుల సంఘాలు కూడా ఇలాంటి కీలకమైన నిర్ణయాలు తీసుకునే టప్పడు , ప్రతి ఉద్యోగి అభిప్రాయాన్ని ముందుగానే తీసుకుని నూటికి డెబ్బైశాతం లేదా అంతకన్నా ఎక్కువమంది కనుక సమ్మెకు అనుకూలంగా ఉంటేనే సమ్మెలోకి వెళ్లాలన్న నిబంధన పెట్టుకోకపోతే , నాయకుల ఇష్టాఇష్టాలకు ఉద్యోగులు బలి కావలసి వస్తున్నదన్నఅభిప్రాయ ం కలుగుతుంది.నెల రోజుల క్రితం కెసిఆర్, కోదండరామ్ లకు వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడాలంటే భయపడే పరిస్థితి నుంచి ఎమ్.ఆర్.పి.ఎస్.కార్యకరౠà°¤à°²à± కొందరు జెఎసి సమావేశం జరుగుతున్న చోటే వారికి వ్యతిరేకంగా దర్నా చేసి పరిస్థితి వచ్చిందంటేనే ఉద్యమం ఏ రూపంలోకి వెళుతున్నది అర్ధం చేసుకోవాలి.కేంద్రం రాష్ట్రం ఇస్తుందో లేదో తెలియదు. కోదండరామ్ చెప్పినట్లు కచ్చితంగా కాంగ్రెస్ పార్టీనే దీనికి బాధ్యత వహించాలి. వారిని టార్గెట్ చేసుకుంటామని కోదండరామ్ ప్రకటించడం కూడా సమంజసమే. కాని ఇంతకాలం తెలంగాణ సమాజం ఎదుర్కున్న కష్టనష్టాలకు కోదండరామ్, కెసిఆర్ లే బాధ్యులని ఎవరైనా విమర్శిస్తే దానికి కూడా వీరు జవాబు చెప్పుకోవలసిందే.కొంతఠ®à°‚ది నేతలు అరవై ఏళ్లుగా పడిన కష్టాలు, జీవితాలు నాశనమైపోయాయి.. అంటూ పడికట్టు నినాదాలు ఇస్తూ జనాన్ని ఆకట్టుకోవచ్చనుకుంటున ్నారు.అది ఎల్ల కాలం సాధ్యం కాదని,నినాదాలు ఇవ్వడంలో ఇంతకన్నా సిద్దహస్త పార్టీలుగా ఉన్న కమ్యూనిస్టు పార్టీల అనుభవం ఆ విషయాన్ని స్పష్టంగా చెబుతుంది. తెలంగాణ సకల జనుల సమ్మె తప్పు కాదు. కాని ఎప్పుడు వస్తుందో తెలియని తెలంగాణ ప్రకటన రేపో,మాపో వచ్చేస్తుందన్న చందంగా ప్రకటనలు చేసి ఉద్యోగులను సమ్మెలలోకి దించి, చివరికి వారు విరమించుకుంటుంటే చూస్తూ ఊరుకోవలసిన నిస్సహాయ స్థితిలో పడడం ఉద్యమ నేతల వైఫల్యం కాదని అనగలమా?
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Methhanithodugu
Hero
Username: Methhanithodugu

Post Number: 12780
Registered: 12-2008
Posted From: 59.93.72.71

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Wednesday, October 19, 2011 - 11:36 am:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)


Linkmaster:




Nee meeda Respect Perindi annai you are at very high level of understanding the situation ...nee kunna honestly chaala takkuva mandi lo undi ...
Ikkada Jai T ante anti Seemandhra kaadhu ... many have relatives ...
Some people have relatives in Raichur,Krishna giri,Bellary,Vellore,Madras attage ...
Overall andaru bnaagundaali no body has right to expel any person or holding a Person ..
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Jupiter
Side Hero
Username: Jupiter

Post Number: 2382
Registered: 05-2011
Posted From: 173.39.71.118

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Wednesday, October 19, 2011 - 11:34 am:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)


Linkmaster:

Thoti indian udyama kaarulni akaranaga thittatam nachadu.. after all, we got our independence through agitations..




udyamakarulu .. policulani nee yamma ani thodithe nachutunda ..
lungi kuda jaripotha unde thagu bothu ... bus meeda petrol posi tagilesthe nachutunda ..

penlam pilakai ni teeskuni car lo pothunte ... paisa ki panki rani daridrudu rayi visaratam .. nachutunda ..

aksharam mukka rani vollu ... student leaders ga ayi .. campus lo doorithe nachutunda ...

inka emem nachutayi
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Risingstar
Megastar
Username: Risingstar

Post Number: 26482
Registered: 08-2008
Posted From: 159.53.78.141

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Wednesday, October 19, 2011 - 11:31 am:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)

last 10 years nunchi okkokkasari okkokkari time..

CBN time, YSJ time, Rosh Thatha time, KCR time next evaridhoo..
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Oosaravelli
Junior Artist
Username: Oosaravelli

Post Number: 23
Registered: 09-2011
Posted From: 144.160.5.25

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Wednesday, October 19, 2011 - 11:29 am:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)

kcr, ktr, harish, kavitha,kodandaramreddy la nu

anti constitutional agenda ki bokka lo esi solitary cell lo padesi iraga kummali
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Chinnu
Side Hero
Username: Chinnu

Post Number: 6713
Registered: 05-2010
Posted From: 69.248.109.184

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Wednesday, October 19, 2011 - 11:28 am:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)

ok
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Idle_yzag
Legend
Username: Idle_yzag

Post Number: 33243
Registered: 02-2008
Posted From: 198.80.144.187

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Wednesday, October 19, 2011 - 11:28 am:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)

OK
RahulGandhi/JP/Chiru
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Emc2
Side Hero
Username: Emc2

Post Number: 4146
Registered: 03-2008
Posted From: 199.107.16.132

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Wednesday, October 19, 2011 - 11:27 am:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)

no worries ,KCR gadi time nadusthundi,vadiki time vachinappudu aadini kuda foot ball aadukuntaru ...

matter of time...just watch..
cherapakura chedevu.
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Linkmaster
Megastar
Username: Linkmaster

Post Number: 24447
Registered: 02-2008
Posted From: 129.33.49.252

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Wednesday, October 19, 2011 - 11:25 am:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)

Udyamanni, udyama kaarulani thittatam naaku konchem kastam ani pistadi...

udyamam lo jarige vikruthala kanna, daaani result meeda discussions/vimarsyalu nachuthaay.. Thoti indian udyama kaarulni akaranaga thittatam nachadu.. after all, we got our independence through agitations..

T-udyamam lo kontha nyayam undi.. kontha adharmam/anyayam undi..

agitation champion KCR rajakeeya chaturatha naaku nachiddi.. okka person atu congini, itu tdp ni foot ball adu kontunnaaadu..

nways, ee db lo endariko naa opinions nachaka povachu..

Add Your Message Here
Post:
Bold text Italics Underline Create a hyperlink Insert a clipart image HASH(0x8532648){Movie Clipart}
Show / Hide regular icons selection options

Click on following links to open cliparts by Alphabetical Order

 A   B   C   D   E   F   G   H   I   J   K   L   M  

 N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z  

Show / Hide Filmy icons selection options

Click on following links to open cliparts by Alphabetical Order

 A   B   C   D   E   F   G   H   I   J   K   L   M  

 N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z  


Username: Posting Information:
This is a public posting area. Enter your username and password if you have an account. Otherwise, enter your full name as your username and leave the password blank. Your e-mail address is optional.
Password:
E-mail:
Options: Enable HTML code in message
Automatically activate URLs in message
Action: