| Author |
Message |
![]() ![]() ![]() ![]()
Miniontada
Side Hero Username: Miniontada
Post Number: 6782 Registered: 08-2017 Posted From: 99.237.64.226
Rating:  Votes: 1 (Vote!) | | Posted on Tuesday, May 28, 2019 - 10:43 pm: |
![]() ![]() ![]() ![]() ![]() |
guess it ends with Number 5 40 ఎకరాలు కొట్టేసిన భూమిని....రాజధానికి ఇచ్చిన జర్నలిస్టు...! ఆయనో పేరున్న ఛానెల్‌లో పనిచేస్తున్న జర్నలిస్టు. మొన్నటి దాకా...టిడిపి ప్రభుత్వంతో కలసిమెలసి తిరిగిన వాడు. టిడిపి ప్రభుత్వంలోని ముఖ్యనాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర నాయకులతో సత్ససంబంధాలు నెరిపారు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదట్లో...రాజధానిగా 'అమరావతి'ని ప్రకటించడం, దానికి రైతులు స్వచ్చంధంగా భూములు ఇవ్వడం వెంట వెంటనే జరిగిపోయాయి. ఈ సమయంలో..సదరు జర్నలిస్టు కూడా తనకు ఉన్న 40ఎకరాల భూమిని రాజధాని కోసం ఇచ్చారట. ఈ విషయం ఇప్పటి దాకా ఎవరికీ తెలియలేదు. తాజాగా..ఈ విషయం బయటకు వచ్చింది. రాజధాని ప్రాంతంలో ఆ జర్నలిస్టుకు రెండు ఎకరాలు మాత్రమే ఉంది. కానీ...40ఎకరాలు ఎక్కడ నుంచి తెచ్చి ఇచ్చారు..? అంత భూమి రాజధానికి ఇస్తే..ఎందుకు బయటకు రాలేదు. ఒక జర్నలిస్టు 40 ఎకరాలను రాజధాని కోసం ఇస్తే...'చంద్రబాబునాయుడు' దాని గురించి ప్రచారం చేసుకోకుండా ఉండలేడు కదా..? కానీ..ఆ విషయం ఆయనకు కూడా తెలియదట. అయితే మరి ఇప్పుడు ఎలా బయటకు వచ్చిందంటారా..? మొన్న జరిగిన ఎన్నికల్లో టిడిపి ఓడిపోయి, వైకాపా అధికారంలోకి రావడంతో...రాజధానిని మారుస్తారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో..ఈ జర్నలిస్టు భూముల విషయం బయటకు వచ్చింది. అసైన్డ్ భూమి తనదిగా పేర్నొన్న జర్నలిస్టు...! రాజధాని భూ సమీకరణ సమయంలో జాయింట్ కలెక్టర్, ఇతర అధికారులు రైతులను ఒప్పించి భూములను సేకరించారు. అయితే అప్పట్లో..ఈ ప్రాంతంలో ఉన్న అసైన్డ్‌భూమిపై సదరు జర్నలిస్టు కన్నుపడింది.అసైన్డ్‌భూమిని తన పేరుతో, తన బంధువులతో పేరుతో, బినామీ పేర్లతో పట్టాలు సృష్టించారు. ఈ వ్యవహారంలో అధికారులు అతనికి సహకరించారనే విమర్శ ఉంది. అసైన్డ్ భూములకు పట్టాలు తెచ్చుకున్న సదరు జర్నలిస్టు...భూముల సేకరణలో ప్రభుత్వానికి ఇచ్చేశారు. దీంతో..మిగతా రైతులకు వచ్చినట్లే...40 ఎకరాలకు సంబంధించి వాణిజ్య స్థలాలు, ప్రతి సంవత్సరం ఎకరాకు ఇచ్చే రూ.25వేల నగదు, ఇతర సౌకర్యాలను యధేచ్చగా నాలుగేళ్లనుంచి సదరు జర్నలిస్టు పొందుతున్నారట. ఈ వ్యవహారంలో టిడిపికి చెందిన మ,త్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనాయకుల పాత్ర ఉందని తెలుస్తోంది. అసైన్డ్ భూమికి పట్టాలు తెచ్చుకోవడం...దాన్ని ప్రభుత్వానికి ఇచ్చివేసి..ప్రభుత్వం నుంచి ప్రతిఫలం పొందడం వెనుక..టిడిపికి చెందిన సీనియర్ మంత్రి హస్తం కూడా ఉంది. అసైన్డ్ భూములకు పట్టాలు సృష్టించడంలో జాయింట్ కలెక్టర్, ఇతర అధికారులు ఈ జర్నలిస్టుకు సహకరించారట. మొత్తం మీద...ప్రభుత్వ భూమిని మళ్లీ ప్రభుత్వానికే ఇచ్చి...దాన్ని నుంచి కోట్లాది రూపాయల ఆస్తిని కూడబెట్టిన 'జర్నలిస్టు' వైనం గురించి జర్నలిస్టులు కథలు..కథలుగా చెప్పుకుంటున్నారు. అధికార పార్టీకి అండగా ఉండే సదరు ఛానెల్‌లో పనిచేసే ఈ జర్నలిస్టు అహంకారి అని..నమస్కారానికి ప్రతి నమస్కారం చేయలేని సంస్కారహీనుడనే పేరుంది. పైకి చూస్తే..ఏమీ తెలియనట్లు ఉండే...సదరు జర్నలిస్టు...టిడిపి ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని వందల కోట్లు సంపాదించారని, దీనిపై నూతన ప్రభుత్వం విచారణ చేయాలని...వైకాపా నాయకులు కోరుతున్నారు. ఇప్పటికే రాజధాని భూముల వ్యవహారంలో టిడిపి పీకలలోతు కూరుకుపోయిందని, తాజాగా...అసైన్డ్‌భూములను అడ్డుపెట్టుకుని..ఆడిన నాటకం..బద్దలు అయితే..ఇంకెంత మంది..బడానాయకులు బయటకు వస్తారో..త్వరలోనే తేలుతుందని వారు అంటున్నారు. Happy Ending Gujju Mentality |
![]() ![]() ![]() ![]()
Polavaram
Side Hero Username: Polavaram
Post Number: 5390 Registered: 08-2016 Posted From: 99.203.29.215
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Tuesday, May 28, 2019 - 10:06 pm: |
![]() ![]() ![]() ![]() ![]() |
Nagarjuna Reddy gaaru tdp gurinchi anta nijamE chepthar Aayana ki abaddalu aadtam raadu |
![]() ![]() ![]() ![]()
Emc2
Legend Username: Emc2
Post Number: 75210 Registered: 03-2008 Posted From: 74.96.198.94
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Tuesday, May 28, 2019 - 08:47 pm: |
![]() ![]() ![]() ![]() ![]() |
https://m.youtube.com/watch?v=AA_Du9tOIVk It's ok
|
|