   
Dts
Junior Artist Username: Dts
Post Number: 663 Registered: 08-2009 Posted From: 188.40.51.71
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Saturday, April 10, 2010 - 11:22 pm: |
    |
సమైక్య రాష్ట్రానికి కెసిఆర్, తెరాస చాలు : లగడపాటి విజయవాడ ,కెఎన్ఎన్ బ్యూరో: కోటిమంది లగడపాటి లు వచ్చినా తెలంగాణా ఆగదని కేసిఆర్ వ్యాఖ్యానించారని, అయితే ఆంధ్రప్రదేశ్ను సమైక్యంగా ఉంచటానికి ఒక్క కేసిఆర్, టిఆర్ఎస్ చాలని విజయవాడ ఎంపి లగడపాటి రాజగోపాల్ అన్నారు. విజయవాడ లో శనివారం విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగుప్రజల చరిత్రను వివరిస్తూ శ్రీకృష్ణకమిటీకి తాను 9వ తేదీన సమగ్ర నివేదికను అందజేశామన్నారు. నాయకులు అబద్ధాలు చెప్పవచ్చు, గణాంకాలు అసత్యమాడవని నిరూపించే రీతిలో ఆడియో, వీడియో నివేదికను అందజేశామన్నారు. ఐతే కెసిఆర్, టిఆర్ఎస్ ఇచ్చిన నివేదిక ప్రకారం తెలంగాణా రాదన్నారు. 1956 నవంబర్కు ముందు ఉన్న తెలంగాణా తమకు ఇవ్వాలని కోరారన్నారు. అదే జరిగితే, అప్పట్లో హైదరాబాద్ ప్రిన్స్ నిజామ్ రాష్ట్రాన్ని కోరినట్టు అవుతుందన్నారు. హైదరాబాద్ రాష్ట్రంలోని 5 జిల్లాలు మహారాష్ట్రలోను, మూడు జిల్లాలు కర్ణాటక రాష్ట్రంలోను, ఆంధ్రప్రదేశ్లోని 8 జిల్లాలను తిరిగి తెలంగాణా కు ఇవ్వాలని కోరారన్నారు. అదే విధంగా భద్రాచలాన్ని తెలంగాణా లో కలపాలని కోరారని లగడపాటి తెలిపారు. ఈ ప్రక్రియ జరిగే అవకాశం లేదన్నారు. ఒకప్పుడు జగ్గయ్యపేట పరిధిలో ఉండే 32 గ్రామాలు నల్గొండ జిల్లాలో ఉన్నాయని, వాటిని తిరిగి ఇచ్చివేస్తారట, కృష్ణాజిల్లాలోని కొన్ని గ్రామాలను తీసుకొంటారట, ఇవ్వన్నీ సాధ్యమేనా అని ప్రశ్నించారు. కేసిఆర్ కోరింది దొరల తెలంగాణా అని, ఆ తెలంగాణా వస్తే మళ్ళీ పటేల్, పట్వారీల వ్యవస్థ వస్తుందన్నారు. వెట్టిచాకిరి వ్యవస్థకు ప్రాణం పోసినట్టే అన్నారు. అణగారినవారిని అణగతొక్కే పాలన కోరుతున్నారన్నారు. కేసిఆర్ తనపై చేసిన వ్యక్తిగత విమర్శలను లగడపాటి తిప్పికొట్టారు. తాను ల్యాంకో సంస్థల నుంచి బయటకు వచ్చి పూర్తి స్థాయిలో ప్రజాసేవ చేస్తున్నానన్నారు. ఒక మెగావాట్ను ఉత్పత్తి చేయలేని వాళ్ళు తనను విమర్శించటం తగదన్నారు. ఎన్టిపిఎస్ కూడా వివిధ రాష్ట్రాలకు విద్యుత్ను విక్రయిస్తున్న విషయం గుర్తించాలన్నారు. ఉత్పత్తులను నిషేదిస్తామని హెచ్చరించిన వీళ్ళు ఇప్పుడు ఈ విధంగా వ్యాఖ్యానించటం సిగ్గుచేటన్నారు. ఆయా కంపెనీలకు క్షమాపణ చెప్పాలన్నారు. విద్యార్ధులు, పల్లెల్లో జనం ఇళ్ళు, పుస్తెలు తాకట్టు పెట్టి ఉద్యమాన్ని నడుపుతుంటే, కేసిఆర్ కుటుంబ సభ్యులు హైదరాబాద్లో కూర్చోని వేలాది కోట్ల రూపాయల దండుకొంటున్నారని తెలంగాణా విద్యార్ధులే ఆరోపిస్తున్నారని లగడపాటి అన్నారు. తానూ డాక్టర్ వైఎస్ఆర్తో కలిసి తెలంగాణా లో మండుటెండలో పాదయాత్ర చేశానన్నారు. అక్కడి గ్రామాల్లో పరిస్థతి తనకు తెలుసన్నారు. 2009లో సమైక్య వాదానికే ఓటు వేశారని, 2014లో అసలు విషయం తేలిపోతుందన్నారు. ---------------------------------------- samaikya raashTraaniki KCR, teraasa chaalu : Lagadapati Vijayawada ,keen‌en‌ byoorO: kOTimandi Lagadapati lu vachchinaaTelangana aagadaniKCR vyaakhyaaninchaarani, ayitae Andhra Pradesh nu samaikyangaa unchaTaaniki okkaKCR, TRS chaalani Vijayawada MP Lagadapati Rajgopal annaaru. Vijayawada lO Sanivaaram vilaekharula samaavaeSanlO aayana maaTlaaDutoo teluguprajala charitranu vivaristoo SreekRushNakamiTeeki taanu 9va taedeena samagra nivaedikanu andajaeSaamannaaru. naayakulu abaddhaalu cheppavachchu, gaNaankaalu asatyamaaDavani niroopinchae reetilO audio, video nivaedikanu andajaeSaamannaaru. aitae KCR, TRS ichchina nivaedika prakaaranTelangana raadannaaru. 1956 November ku mundu unnaTelangana tamaku ivvaalani kOraarannaaru. adae jarigitae, appaTlO Hyderabad prince Nizam raashTraanni kOrinaTTu avutundannaaru. Hyderabad raashTranlOni 5 jillaalu Maharashtra lonu, mooDu jillaalu karnataka raashTranlOnu, Andhra Pradesh loni 8 jillaalanu tirigiTelangana ku ivvaalani kOraarannaaru. adae vidhangaa bhadraachalaanniTelangana lO kalapaalani kOraarani Lagadapati telipaaru. ee prakriya jarigae avakaaSam laedannaaru. okappuDu jaggayyapaeTa paridhilO uNDae 32 graamaalu nalgoNDa jillaalO unnaayani, vaaTini tirigi ichchivaestaaraTa, kRushNaajillaalOni konni graamaalanu teesukoNTaaraTa, ivvannee saadhyamaenaa ani praSninchaaru.KCR kOrindi doralaTelangana ani, aaTelangana vastae maLLee paTael‌, paTvaareela vyavastha vastundannaaru. veTTichaakiri vyavasthaku praaNam pOsinaTTae annaaru. aNagaarinavaarini aNagatokkae paalana kOrutunnaarannaaru. kaesiaar‌ tanapai chaesina vyaktigata vimarSalanu Lagadapati tippikoTTaaru. taanu lyaankO sansthala nunchi bayaTaku vachchi poorti sthaayilO prajaasaeva chaestunnaanannaaru. oka megaavaaT‌nu utpatti chaeyalaeni vaaLLu tananu vimarSinchaTam tagadannaaru. en‌Tipies‌ kooDaa vividha raashTraalaku vidyut‌nu vikrayistunna vishayam gurtinchaalannaaru. utpattulanu nishaedistaamani hechcharinchina veeLLu ippuDu ee vidhangaa vyaakhyaaninchaTam sigguchaeTannaaru. aayaa kampeneelaku kshamaapaNa cheppaalannaaru. vidyaardhulu, pallellO janam iLLu, pustelu taakaTTu peTTi udyamaanni naDuputuNTae,KCR kuTumba sabhyulu haidaraabaad‌lO koorchOni vaelaadi kOTla roopaayala daNDukoNTunnaaraniTelangana vidyaardhulae aarOpistunnaarani Lagadapati annaaru. taanoo DaakTar‌ vaies‌aar‌tO kalisiTelangana lO maNDuTeNDalO paadayaatra chaeSaanannaaru. akkaDi graamaallO paristhati tanaku telusannaaru. 2009lO samaikya vaadaanikae OTu vaeSaarani, 2014lO asalu vishayam taelipOtundannaaru. కోటిపల్లికి దారడిగి కొండపల్లికి వెళ్తున్నావేమిటి? ...మనసు మార్చుకున్నాను! DTS "The digital experience" |