వైయస్ జగన్ వెంట కెవిపి రామచందర్ రావు ... Chalanachithram.com | Topics | Search
Hide Clipart | Log Out | Register | Edit Profile

Last 30 mins | 1 | 2 | 4 hours     Last 1 | 7 Days

Chalanachithram.com DB » Archives » Archive through July 13, 2010 » వైయస్ జగన్ వెంట కెవిపి రామచందర్ రావు ఉంటారా? « Previous Next »

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Methhanithodugu
Side Hero
Username: Methhanithodugu

Post Number: 5152
Registered: 12-2008
Posted From: 59.96.97.75

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Monday, July 12, 2010 - 09:29 am:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)

వీరప్ప మొయిలీపై వేలాడుతున్న కత్తులు

హైదరాబాద్: కాంగ్రెసు రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి వీరప్ప మొయిలీ జగన్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని అనుమానిస్తున్న రోశయ్య వర్గీయులు హైకమాండ్ కు మొయిలీని తప్పించ వలసిందిగా ఆకాశరామన్న ఫ్యాక్స్ లు పంపిస్తున్నారు. వీరప్ప మొయిలీ వైయస్ ఎంతో సన్నిహితుడు. వైయస్ వల్ల ఆర్ధికంగా ఎంతో లాభం పొందినవాడు. మొయిలీ కుమారుడికీ జగన్ కు మధ్య వ్యాపార భాగస్వామ్యాలు ఉన్నాయన్న విమర్శలు ఉన్నాయి. ఈ నేపధ్యంలో మొయిలీకి నిర్ణయాలు తీసుకోవడం కత్తి మీద సామే. జగన్ విషయంలో మెతకగా వ్యవహరిస్తే రాష్ట్ర ఇంచార్జిగా అయనను తప్పించే అవకాశాలున్నాయి. మొయిలీ ఆసరా చూసుకుని జగన్ మరింత జగమొండిగా మారిపోతున్నారు.
శ్రీకాకుళం జిల్లాలో ఒక్క ఎమ్మెల్యే గాని, మంత్రులు గాని పాల్గొన లేదు. అయితే తూర్పులో మాత్రం ఎక్కువ మంది ఎమ్మె ల్యేలు ఓదార్పునకు సహకరిస్తారనే భావిస్తున్నారు. గత రెండు రోజులుగా పార్టీ అధిష్టానవర్గం ఓదా ర్పులో ఎమ్మెల్యేలు పాల్గొనకుండ కట్టడి చేసే ప్రయ త్నాలు ఫలించే అవకాశాలు లేవు. పాల్గొంటే అంతా పాల్గొందాం, లేకపోతే అంతా తప్పుకుందాం అనే దానిపై జరిగిన చర్చలు సైతం ఫలించలేదు.
కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌లు యాత్ర ప్రారం భం నుండి ముగింపు రోజు వరకు జగన్‌ వెన్నంటే ఉంటా మని స్పష్టం చేయడంతో ఎమ్మెల్యేలలో ఐకమత్యమనేది లోపించింది. అసలు జిల్లాలో ప్రజాప్రతినిధులంతా స్వర్గీ య వైయస్‌ గూటిలో పక్షులే. జగన్‌ ఓదార్పు యాత్రలో తాము పాల్గొంటామని, అది తమ బాధ్యతని మంత్రులు ఇప్పటికే స్పష్టం చేశారు. శాసనసభ సమావేశాలు పూర్తి కాగానే యాత్రలో పాల్గొంటానని మంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ సుస్పష్టం చేశారు. అన్నమాట మీద ఆయన కట్టుబడి 17న ఓదార్పులో పాల్గొంటానంటున్నారు.


Asatho Ma Sathgamaya,
Thamaso Ma Jyothirgamaya
Mruthyorma Amrthangamya


Lead me towards truth from untruth
Lead me towards light from darkness
Lead me towards immortality from Death
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Methhanithodugu
Side Hero
Username: Methhanithodugu

Post Number: 5151
Registered: 12-2008
Posted From: 59.96.97.75

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Monday, July 12, 2010 - 09:26 am:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)

వైయస్ జగన్ ను ఢీకొట్టిన మంత్రి బొత్స సత్యనారాయణ

హైదరాబాద్: ముఖ్యమంత్రి కె. రోశయ్యపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన తమ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ పై రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ ఢీకొట్టారు. జగన్ వ్యాఖ్యలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. జగన్ ఓదార్పు యాత్రను చూసి సిగ్గుపడాలో ఆనందపడాలో అర్థం కావడం లేదని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల వద్ద వ్యాఖ్యానించారు. కాంగ్రెసు రాజకీయాలకు తాము సిగ్గపడడం లేదని, పైగా గర్వపడుతున్నామని ఆయన అన్నారు. జగన్ అన్నట్లు తామేమీ నరకయాతన అనుభవించడం లేదని ఆయన స్పష్టం చేశారు.
వైయస్ జగన్ కుటుంబ వారసుడు మాత్రమేనని, తాము వైయస్ రాజశేఖర రెడ్డి [^] రాజకీయ వారసులమని ఆయన చెప్పారు. వైయస్ రాజశేఖర రెడ్డికి తామంతా వారసులమేనని ఆయన అన్నారు. జగన్ ఓదార్పు యాత్ర వల్ల కాస్తా ఇబ్బంది ఉన్న మాట వాస్తవమేనని, ఆ ఇబ్బంది త్వరలోనే సమసిపోతుందని ఆయన అన్నారు. కాంగ్రెసుకు గానీ, కాంగ్రెసు ప్రభుత్వానికి గానీ ఏ విధమైన ఢోకా లేదని ఆయన దీమా వ్యక్తం చేశారు. తాము జగన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నామని, అయితే అధిష్టానం రోశయ్యను ముఖ్యమంత్రిని చేయాలని నిర్ణయించిందని, జగనే స్వయంగా రోశయ్య పేరును ముఖ్యమంత్రి పదవికి ప్రతిపాదించారని, దాంతో తాము రోశయ్యకు మద్దతు తెలిపామని ఆయన అన్నారు.

Asatho Ma Sathgamaya,
Thamaso Ma Jyothirgamaya
Mruthyorma Amrthangamya


Lead me towards truth from untruth
Lead me towards light from darkness
Lead me towards immortality from Death
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Methhanithodugu
Side Hero
Username: Methhanithodugu

Post Number: 5150
Registered: 12-2008
Posted From: 59.96.97.75

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Monday, July 12, 2010 - 09:23 am:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)


హైదరాబాద్: కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ముఖ్యమంత్రి రోశయ్యపై ప్రత్యక్ష పోరుకు సిద్ధపడిన నేపథ్యంలో దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి ప్రియ మిత్రుడు, రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్ రావుపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. కెవిపి ఎటు ఉంటారనే ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నమవుతోంది. ముఖ్యమంత్రి కె. రోశయ్య మాత్రం కెవిపిపై పూర్తి విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. కెవిపి రామచందర్ రావు తమ కాంగ్రెసు పార్టీ అధిష్టానానికి భిన్నంగా నడిచే వ్యక్తి కాదని, జగన్ ను దారిలోకి తేవడానికి ఆయన ప్రయత్నిస్తున్నారని ముఖ్యమంత్రి అన్నారు. నిజానికి, జగన్ కు కెవిపి నచ్చజెప్పే ప్రయత్నం చేశారని, అధిష్టానం నిర్ణయానికి భిన్నంగా వెళ్లకూడదని సూచించారని అంటున్నారు. అయితే జగన్ ఆయన మాట వినడానికి సిద్ధంగా లేరని అంటున్నారు.
జగన్ తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లు అనే పద్ధతిలో వ్యవహరించడం పట్ల కెవిపి తీవ్ర మనస్తాపానికి గురవుతున్నట్లు చెబుతున్నారు. జగన్ వ్యవహారంలో ఆయన పూర్తిగా చేతులెత్తేసినట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీ అధిష్టానానికి వ్యతిరేకంగా వెళ్లడం పల్ల తలెత్తే పరిణామాల పట్ల ఆయన మొదటి నుంచీ ఆందోళన వ్యక్తం చేస్తూనే వస్తున్నారు. వైయస్ పై ఉన్న ప్రేమ కొద్దీ, వైయస్ వెళ్లగానే ఆయన కుటుంబాన్ని వదిలేశారనే అపవాదు రాకుండా చూసుకోవడానికి ఆయన ఇంత కాలం జగన్ కు ఒక కవచంగా ఉండే ప్రయత్నం చేశారని చెబుతున్నారు. ఇప్పుడు జగన్ కు ఆయన దూరంగా జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు


Asatho Ma Sathgamaya,
Thamaso Ma Jyothirgamaya
Mruthyorma Amrthangamya


Lead me towards truth from untruth
Lead me towards light from darkness
Lead me towards immortality from Death

Add Your Message Here
Post:
Bold text Italics Underline Create a hyperlink Insert a clipart image HASH(0x8818214){Movie Clipart}
Show / hide regular icons selection options

Click on following links to open cliparts by Alphabetical Order

 A   B   C   D   E   F   G   H   I   J   K   L   M  

 N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z  

Show / Hide Filmy icons selection options

Click on following links to open cliparts by Alphabetical Order

 A   B   C   D   E   F   G   H   I   J   K   L   M  

 N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z  

Username: Posting Information:
This is a private posting area. Only registered users and moderators may post messages here.
Password:
Options: Enable HTML code in message
Automatically activate URLs in message
Action: