Topics | Search Log Out | Register | Edit Profile
Hide Clipart | Banned/Unbanned User Log | Moderator Login History | Thread Delete/Move Log | Last 30 mins | 1 | 2
IF you see this thread, come inside a...

Chalanachithram.com DB » Misc Topics » IF you see this thread, come inside and say hi « Previous Next »
Author Message

Dhoomakethu
Hero
Username: Dhoomakethu

Post Number: 12845
Registered: 11-2018
Posted From: 86.7.45.227

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Thursday, April 23, 2020 - 10:20 am:

ఇప్పుడింక తెలుగు పుస్తకాల గురించి మాట్లాడుకుందాం. నాకు పుస్తక పఠనం నేర్పింది మధుబాబు గారు. (మా అత్తయ్య కి కజిన్ ఈయన). షాడో సిరీస్ ఎన్ని సార్లు చదివానో లెక్క లేదు.

కాబట్టి, మొదటి స్థానం షాడో కి సముచిత స్థానం.

షాడో పుస్తకాలు. ఒకటే పుస్తకం చెప్పాలంటే షాడో ఇన్ బోర్నియో

ఇంక తర్వాత నన్ను అంతలా కదిలించింది యండమూరి వీరేంద్రనాథ్ గారే. ఒకటా రెండా? అన్ని పుస్తకాలు అనేకసార్లు చదివినవే. ముఖ్యంగా చెప్పాల్సినవి - ప్రేమ, అంతర్ముఖం, ఆనందోబ్రహ్మ, తులసి (దళం), అతడు ఆమె ప్రియుడు, కాసనోవా 99. కానీ ఒకటే పుస్తకం చెప్పాలి కాబట్టి యండమూరి ఖాతాలో…

అంతర్ముఖం

చిన్నప్పటి నుండి మా ముత్తాత గారి నాటకం గురించి వింటూ వింటూ వచ్చాను. యుక్త వయస్సు వచ్చాక గాని చదవడానికి సాహసించలేదు. (గ్రాంధిక తెలుగు కాదు కానీ అప్పట్లో - 19 వ శతాబ్దపు వ్యావహారిక భాష. కొంచెం కష్టమే చదవడం. అందులో కొన్ని పాత్రలు తెలంగాణ భాష వాడుతాయి.) చదివినప్పుడు చాలా నచ్చింది. బహుశా నేను సదరు వ్యక్తి కి మునిమనవడిని కావడం వల్ల ఉండొచ్చు. వెరసి, నా పట్టిక కాబట్టి ఈ పుస్తకం ఉండాల్సిందే.

ప్రతాపరుద్రియ నాటరము

కొంచెం నవల/నాటకాల నుండి పక్కకి వచ్చి పాపులర్ సైన్స్ పుస్తకాల గురించి మాట్లాడుకుందాం. మహీధర నళిని మోహన్ అనే వ్యక్తి చాలా రాశారు ఇవి. కేలండర్ కథ, రాకెట్ కథ, సుబ్బారాయుడి స్వప్నలోకం (సాపేక్షతా సిద్ధాంతం గురించి) ఇత్యాది. నాకు సైన్స్ మీద ఆసక్తి కలుగజేసింది ఈ పుస్తకాలే. మహీధర నళిని మోహన్ గారు కొన్ని తెలుగు శ్లేష రచనలు కూడా చేశారు. లంబోదరా అని ఒక పుస్తకం - పడి పడీ నవ్విస్తుంది.

రాకెట్ కథ

మరో సైన్స్ పుస్తకం మనందరికీ తెలిసినదే - యాకొవ్ పెరెల్మాన్ రాసింది. విశాలాంధ్ర పబ్లికేషన్స్ వాళ్ళు మీర్ పబ్లిషర్స్ మాస్కో తో జత కట్టి తెలుగు లో తర్జూమా చేశారు. మొదటి తర్జుమా కొడవగంటి కుటుంబరావు గారు అనుకుంటా. ఈ జంట పుస్తకాలు ఎన్ని సార్లు చదివానో నాకే తెలియదు. నిరంతర చలన యంత్రం ఎందుకు సాధ్యం కాదో మొదట ఈయనే నాకు నేర్పించారు. తర్వాత ఎప్పుడో ఉష్ణగతిక సిధ్ధాంతాలు చదువుతున్నప్పుడు ఇదే విషయం మళ్ళీ నేర్చుకున్నా.

నిత్యజీవితంలో భౌతిక శాస్త్రం. (ఫిజిక్స్ కెన్ బీ ఫన్)

కొంచెం లేట్ గా అయినా లేటెస్ట్ గా నచ్చిన కవితా సంపుటి శ్రీ శ్రీ గారి మహాప్రస్థానం. ఆ పుస్తకం తీసుకొని గట్టిగా చదువుతూ ఇల్లంతా తిరిగే వాడిని. తర్వాత రుద్రవీణ లో చిరంజీవి (అదేలెండి బాలసుబ్రమణ్యం గారు) నేను సైతం అన్నప్పుడు ఒళ్ళంతా పులకరించిపోయింది.

మహాప్రస్థానం.

మళ్ళీ నవలల దగ్గరకి వద్దాం. యండమూరి తర్వాత నా ఫేవరెట్ రైటర్ అంటే యెర్రం శెట్టి సాయి. ఈయన రాసిన పలు పుస్తకాలు ఇంకా నా దగ్గర భద్రంగా ఉన్నాయి. హ్యూమరాలజి నాలుగు ఖండాలు భలే ఉంటాయి. రైల్వే జంక్షన్ లాంటి థ్రిల్లెర్స్ కూడా సూపర్.

హ్యూమరాలజి

ఇంక చెప్పాల్సినవి కొన్ని - వీటికి ప్రత్యేకించి వివరణ అవసరం లేదు.

చివరకు మిగిలేది - బుచ్చిబాబు (డీబీ లో మహర్షి తమ్ముడికి గిఫ్ట్ ఇచ్చాను ఇది. :))
అసమర్ధుని జీవయాత్ర - గోపీచంద్
పాకుడు రాళ్లు - రావూరి భరద్వాజ్

అసలు ఈ పట్టికలు సంబంధం లేకుండా అన్నింటికన్నా పైన ఎప్పటికి భద్రం గా ఉండే పుస్తకం అంటే మొక్కపాటి నరసింహ శాస్త్రి గారి బారిస్టర్ పార్వతీశం.

ఇవి కాకుండా మల్లాది, పానుగంటి, కొమ్మూరి సాంబశివరావు (డిటెక్టివ్ యుగంధర్), యద్దనపూడి, సూర్యదేవర రామ్మోహన్ రావు, మైనంపాటి భాస్కర్ (బుద్ధిజీవి)... ఇంకా చాలా మంది ఉన్నారు. ఇంట్లో తెలుగు మాట్లాడకపోయినా తెలుగు మీద కొంచెం పట్టు రావడానికి వీళ్లంతా దోహదపడ్డారు. వీళ్ళకి ఎప్పటికి రుణపడి ఉంటాను.
ధూమకేతుర్గణాధ్యక్షహ ఫాలచంద్రోగజాననహ

Dhoomakethu
Hero
Username: Dhoomakethu

Post Number: 12844
Registered: 11-2018
Posted From: 86.7.45.227

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Thursday, April 23, 2020 - 10:18 am:

Post Number: 12843
Registered: 11-2018
Posted From: 86.7.45.227

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Thursday, April 23, 2020 - 10:12 am:

ఇప్పుడింక తెలుగు పుస్తకాల గురించి మాట్లాడుకుందాం&period} నాక ు పుస్తక పఠనం నేర్పింది మధుబాబు గారు&period} &lpar}మా అత్తయ్ య కి కజిన్ ఈయన&rpar}&period} షాడో సిరీస్ ఎన్ని సార్లు చదివాన ో లెక్క లేదు&period}

కాబట్టి&comma} మొదటి స్థానం షాడో కి సముచిత స్థానం&period}

షాడో పుస్తకాలు&period} ఒకటే పుస్తకం చెప్పాలంటే షాడో ఇన్ బోర్ నియో

ఇంక తర్వాత నన్ను అంతలా కదిలించింది యండమూరి వీరేంద్రనాథ్ గారే &period} ఒకటా రెండా&quest} అన్ని పుస్తకాలు అనేకసార్లు చదివిన వే&period} ముఖ్యంగా చెప్పాల్సినవి - ప్రేమ&comma} అంతర్ముఖం&c omma} ఆనందోబ్రహ్మ&comma} తులసి &lpar}దళం&rpar}&comma} అతడు ఆ మె ప్రియుడు&comma} కాసనోవా 99&period} కానీ ఒకటే పుస్తకం చెప్ పాలి కాబట్టి యండమూరి ఖాతాలో&hellip}

అంతర్ముఖం

చిన్నప్పటి నుండి మా ముత్తాత గారి నాటకం గురించి వింటూ వింటూ వ చ్చాను&period} యుక్త వయస్సు వచ్చాక గాని చదవడానికి సాహసించలేద ు&period} &lpar}గ్రాంధిక తెలుగు కాదు కానీ అప్పట్లో - 19 వ శత ాబ్దపు వ్యావహారిక భాష&period} కొంచెం కష్టమే చదవడం&period} అం దులో కొన్ని పాత్రలు తెలంగాణ భాష వాడుతాయి&period}&rpar} చదివి నప్పుడు చాలా నచ్చింది&period} బహుశా నేను సదరు వ్యక్తి కి మున ిమనవడిని కావడం వల్ల ఉండొచ్చు&period} వెరసి&comma} నా పట్టిక కాబట్టి ఈ పుస్తకం ఉండాల్సిందే&period}

ప్రతాపరుద్రియ నాటరము

కొంచెం నవల&sol}నాటకాల నుండి పక్కకి వచ్చి పాపులర్ సైన్స్ పుస్ తకాల గురించి మాట్లాడుకుందాం&period} మహీధర నళిని మోహన్ అనే వ్ యక్తి చాలా రాశారు ఇవి&period} కేలండర్ కథ&comma} రాకెట్ కథ&co mma} సుబ్బారాయుడి స్వప్నలోకం &lpar}సాపేక్షతా సిద్ధాంతం గురిం చి&rpar} ఇత్యాది&period} నాకు సైన్స్ మీద ఆసక్తి కలుగజేసింది ఈ పుస్తకాలే&period} మహీధర నళిని మోహన్ గారు కొన్ని తెలుగు శ్ల ేష రచనలు కూడా చేశారు&period} లంబోదరా అని ఒక పుస్తకం - పడి పడ ీ నవ్విస్తుంది&period}

రాకెట్ కథ

మరో సైన్స్ పుస్తకం మనందరికీ తెలిసినదే - యాకొవ్ పెరెల్మాన్ రా సింది&period} విశాలాంధ్ర పబ్లికేషన్స్ వాళ్ళు మీర్ పబ్లిషర్స్ మాస్కో తో జత కట్టి తెలుగు లో తర్జూమా చేశారు&period} మొదటి త ర్జుమా కొడవగంటి కుటుంబరావు గారు అనుకుంటా&period} ఈ జంట పుస్త కాలు ఎన్ని సార్లు చదివానో నాకే తెలియదు&period} నిరంతర చలన యం త్రం ఎందుకు సాధ్యం కాదో మొదట ఈయనే నాకు నేర్పించారు&period} త ర్వాత ఎప్పుడో ఉష్ణగతిక సిధ్ధాంతాలు చదువుతున్నప్పుడు ఇదే విషయ ం మళ్ళీ నేర్చుకున్నా&period}

నిత్యజీవితంలో భౌతిక శాస్త్రం&period} &lpar}ఫిజిక్స్ కెన్ బీ ఫన్&rpar}

కొంచెం లేట్ గా అయినా లేటెస్ట్ గా నచ్చిన కవితా సంపుటి శ్రీ శ్ రీ గారి మహాప్రస్థానం&period} ఆ పుస్తకం తీసుకొని గట్టిగా చదువ ుతూ ఇల్లంతా తిరిగే వాడిని&period} తర్వాత రుద్రవీణ లో చిరంజీవ ి &lpar}అదేలెండి బాలసుబ్రమణ్యం గారు&rpar} నేను సైతం అన్నప్పు డు ఒళ్ళంతా పులకరించిపోయింది&period}

మహాప్రస్థానం&period}

మళ్ళీ నవలల దగ్గరకి వద్దాం&period} యండమూరి తర్వాత నా ఫేవరెట్ రైటర్ అంటే యెర్రం శెట్టి సాయి&period} ఈయన రాసిన పలు పుస్తకాల ు ఇంకా నా దగ్గర భద్రంగా ఉన్నాయి&period} హ్యూమరాలజి నాలుగు ఖం డాలు భలే ఉంటాయి&period} రైల్వే జంక్షన్ లాంటి థ్రిల్లెర్స్ కూ డా సూపర్&period}

హ్యూమరాలజి

ఇంక చెప్పాల్సినవి కొన్ని - వీటికి ప్రత్యేకించి వివరణ అవసరం ల ేదు&period}

చివరకు మిగిలేది - బుచ్చిబాబు &lpar}డీబీ లో మహర్షి తమ్ముడికి గిఫ్ట్ ఇచ్చాను ఇది&period} &colon}&rpar}&rpar}
అసమర్ధుని జీవయాత్ర - గోపీచంద్
పాకుడు రాళ్లు - రావూరి భరద్వాజ్

అసలు ఈ పట్టికలు సంబంధం లేకుండా అన్నింటికన్నా పైన ఎప్పటికి భద ్రం గా ఉండే పుస్తకం అంటే మొక్కపాటి నరసింహ శాస్త్రి గారి బారి స్టర్ పార్వతీశం&period}

ఇవి కాకుండా మల్లాది&comma} పానుగంటి&comma} కొమ్మూరి సాంబశివర ావు &lpar}డిటెక్టివ్ యుగంధర్&rpar}&comma} యద్దనపూడి&comma} స ూర్యదేవర రామ్మోహన్ రావు&comma} మైనంపాటి భాస్కర్ &lpar}బుద్ధి జీవి&rpar}&period}&period}&period} ఇంకా చాలా మంది ఉన్నారు&pe riod} ఇంట్లో తెలుగు మాట్లాడకపోయినా తెలుగు మీద కొంచెం పట్టు ర ావడానికి వీళ్లంతా దోహదపడ్డారు&period} వీళ్ళకి ఎప్పటికి రుణపడ ి ఉంటాను&period}
ధూమకేతుర్గణాధ్యక్షహ ఫాలచంద్రోగజాననహ

Platypus
Hero
Username: Platypus

Post Number: 11604
Registered: 01-2008
Posted From: 86.7.45.227

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Friday, December 06, 2019 - 03:17 pm:

Iddharu choosaaraa ee thread. Mahaa prasaaadam :D

To a truly secular India with no appeasements of any kind; true separation of religion and state; uniform civil code; a scientific bent of mind; rational thinking and a conducive atmosphere for different points of view to flourish.

Pullarao
Comedian
Username: Pullarao

Post Number: 1939
Registered: 03-2017
Posted From: 72.20.136.14

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Friday, December 06, 2019 - 12:25 pm:

kastam rao garu.

masala nahi .. nahi bathukusaktha.

Rebel
Hero
Username: Rebel

Post Number: 17246
Registered: 02-2008
Posted From: 76.184.231.151

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Friday, December 06, 2019 - 11:57 am:

Hi
Bye

Platypus
Hero
Username: Platypus

Post Number: 11601
Registered: 01-2008
Posted From: 167.220.196.179

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Friday, December 06, 2019 - 11:30 am:

Just wondering if anyone sees this thread. Can use this forum for non-politics, non-caste discussions.
To a truly secular India with no appeasements of any kind; true separation of religion and state; uniform civil code; a scientific bent of mind; rational thinking and a conducive atmosphere for different points of view to flourish.

Add Your Message Here
Post:
Bold text Italics Underline Create a hyperlink Insert a clipart image HASH(0xc011f8){Movie Clipart}
Show / hide regular icons selection options

Click on following links to open cliparts by Alphabetical Order

A   B   C   D   E   F   G   H   I   J   K   L   M

N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z

Show / Hide Filmy icons selection options

Click on following links to open cliparts by Alphabetical Order

A   B   C   D   E   F   G   H   I   J   K   L   M

N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z

Username: Posting Information:
This is a private posting area. Only registered users and moderators may post messages here.
Password:
Options: Enable HTML code in message
Automatically activate URLs in message
Action: