| Author |
Message |
   
Gotcha
Hero Username: Gotcha
Post Number: 11542 Registered: 02-2008 Posted From: 98.227.186.192
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Wednesday, July 10, 2013 - 08:47 am: |
    |
gas penchdamu matiki darunam. reliance guys are not drilling the gas till the price is hiked. they are controlling demand and supply This real estate is for sale. |
   
Methhanithodugu
Megastar Username: Methhanithodugu
Post Number: 26088 Registered: 12-2008 Posted From: 124.123.186.182
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Wednesday, July 10, 2013 - 02:01 am: |
    |
కేజీ గ్యాస్‌పై వామపక్షాల... సమరభేరి ఎన్నికల సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీలు ఏదో విధంగా లబ్ది పొందడా నికి ప్రయత్నం చేస్తున్నాయి. కాంగ్రెస్, భాజపాలు పారిశ్రామిక వేత్తలను మచ్చిక చేసుకుని అభివృద్ధి మంత్రంతో ఆకట్టుకునే ప్రయత్నంలో వున్నాయి. ఇందులో భాగంగా కేజీ బేసిన్ విషయంలో ఇస్తున్న గ్యాస్ యూనిట్ ధరను పెంచడం ద్వారా పరోక్షంగా ప్రయోజనాలు పొందడానికి ప్రధాన పార్టీలు వ్యూహ రచన చేస్తున్నాయి. వామపక్షాలేమో యూనిట్ ధరను పెంచితే సామాన్యమానవుడు నష్టపోతాడంతూ అందుకు వ్యతిరేకంగా ఉద్యమానికి సన్నద్ధమవుతు న్నాయి. కేజీ బేసిన్ గ్యాస్ అంశంపై యూనిట్ ధరను పెంచాలని ప్రైవేటు కంపెనీలు వత్తిడి పెంచుతున్న నేపధ్యంలో దాన్ని అడ్డుకునే పనిలో కమ్యూనిస్టుపార్టీలు నిమగ్నమై వున్నాయి. రాష్ర్టంలోనే కేజీ బేసిన్ ఉండటంతో ఇక్కడి 11 వామపక్ష పార్టీలు ఈ అంశాన్ని ఉద్యమరూపంలో వేడెక్కించే పనిలో పడ్డాయి. దేశ వ్యాప్తంగా ప్రముఖ కార్పొరేట్, వాణిజ్య సంస్థలతో, భాజపా, ఇతర ప్రధాన పార్టీలు సమావేశాలు నిర్వహి స్తూ మద్దతు కూడగట్టుకునే ప్రయత్నంలో వుండగా, ఎన్నికల ముంగిట ప్రజా ప్రాధాన్యత గల గ్యాస్ అంశాన్ని ముందుకు తీసుకువచ్చి ప్రభుత్వంపై ధర పెంచకుండా తద్వారా ప్రభుత్వ ఖజానాపై పరోక్షంగా ప్రజలపై భారం పడకుండా చేయడానికి కసరత్తు చేస్తున్నాయి. ఇంతకాలం ఈ అంశాన్ని అంతగా పట్టించుకోని కమ్యూనిస్టుపార్టీలు ఇప్పుడు పోరుబాటకు ఈ అంశాన్ని వేదికగాచేసుకుని సిద్ధంకావడంపై ఎన్నికల కోణంలోనే చేస్తున్నారనే అభిప్రాయం వినవస్తోంది. 2002 నుంచి కేజీ బేసిన్‌లో గ్యాస్ కాంట్రాక్టును రిలయన్స్ కంపెనీ తీసుకుని కార్యకలాపాలు చేస్తోంది. ప్రస్తుతం యూనిట్ ధర కింద 4.2 డాలర్లను చెల్లిస్తున్నా రు. ఈ ధరను పెంచాలని రిలయన్స్‌తో పాటు ఇతర సంస్థలు కొన్నేళ్ళుగా డిమాండ్ చేస్తున్నాయి. ఈ అంశంపై ఏర్పాటైన రంగరాజన్ కమిటి యూనిట్ ధరను .4 డాలర్లకు పెంచాలని సిఫారసు చేసింది. మార్కెట్ రేటు 6.3 వుంది కనుక .4కు పెంచాలని ప్రతిపాదించింది. రిలయన్స్ కంపెనీ మాత్రం 14 డాలర్లకు పెంచాలని పట్టుబడుతోంది. కేంద్ర ఇంధన శాఖ కార్యదర్శి వివేక్‌రాయ్ మాత్రం ఈ ప్రతిపాదనను తిరస్కరిస్తున్నారు. అయినా ఆర్థికశాఖ, ప్రణాళికా సంఘం ఏదో విధంగా చమురు సంస్థలకు మేలుచేయా లనే ప్రయత్నాలను కొనసాగిస్తున్నాయి. చమురు సంస్థలు, గ్యాస్ ఉత్పత్తి సంస్థలు మాత్రం యూనిట్ ధర పెంపునకు పట్టుబడుతూనే వున్నాయి. ధర పెంచితే 1.5 లక్షల కోట్ల రూపాయల మేర సబ్సిడీ భారం అదనంగా పడుతుందనేది అంచనా. ఇప్పటికే ఆహారభద్రత చట్టం ద్వారా సర్కారుపై యేటా లక్ష కోట్ల రూపాయల భారం పడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో యూనిట్ ధరను పెంచడాన్ని వామపక్షాలు ఆక్షేపిస్తున్నాయి. దేశీయంగా వున్న ఈ అంశానికి డాలర్‌తో ముడి పెట్టడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. దేశవ్యాప్తంగా గ్యాస్ అవసరాల్లో 65 శాతం మేర దేశీయంగా ఉత్పత్తి అవుతుండగా, అందులో 10 శాతం మేర రిలయన్స్ వాటా వుంటోంది. కేజీ బేసిన్‌లోనే కాంట్రాక్టు పొందిన మరో గుజరాత్ సంస్థ కూడా యూనిట్ ధర 14 డాలర్లు చెల్లించాలని డిమాండ్ చేస్తోంది. రిలయన్స్‌కు ధర పెంచితే ఇతర సంస్థలు కూడా యూనిట్ ధరను పెంచాలని ఒత్తిడి చేస్తాయని, ప్రభుత్వంపై పెద్దఎత్తున అదనపు భారం పడుతుందని వామక్షాలు వాదిస్తున్నాయి. ఇటీవల గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ పారిశ్రామిక దిగ్గజాలతో సమావేశాలు నిర్వహిస్తున్నా రు. వచ్చే ఎన్నికల్లో భాజపాకు మద్దతు ఇస్తే ఈ రకమైన పారిశ్రామిక ఊతమిచ్చే చర్యలు తీసు కుంటామని హామీ ఇస్తున్నారు. అదే విధంగా కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థి రాహుల్ కూడా ఢిల్లీలో ఇటీవలనే పారిశ్రామిక వేత్తల సమావేశంలో తన అంతరంగాన్ని ఆవిష్కరించారు. ఇలాంటి పరిస్థితిలో వామపక్ష పార్టీలు జాతీయ స్థాయిలో తాముకూడా ప్రజా ప్రాధాన్యత గల అంశాలపై ఉద్యమ కార్యాచరణ చేయాలని భావించి అందులో భాగంగా దేశంలోని వివిధ ప్రైవేటు చమురు, గ్యాస్ సంస్థలతో ముడిపడి వున్న కేజీ బేసిన్ గ్యాస్ అంశాన్ని అస్త్రంగా చేసుకుని ఉద్యమ కార్యాచరణకు రంగం సిద్ధం చేస్తున్నాయి. ఏది ఏమైనా యూనిట్ ధరను పెంచరాదనే డిమాండ్‌ను బుధవారం హైదరాబాద్‌లోని సుందరయ్య భవన్‌లో జరిగే రౌండ్‌టేబుల్ సమావేశంలో వామపక్షాలు గట్టిగా వినిపించనున్నాయి. DB is for leg pulling,info share,timepass dont take all posts to heart/dil pe ..DB is Pressure Release |
   
Methhanithodugu
Megastar Username: Methhanithodugu
Post Number: 26087 Registered: 12-2008 Posted From: 124.123.186.182
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Wednesday, July 10, 2013 - 01:52 am: |
    |
http://www.krishnapatrika.com/content_middle/content_middle_ 4.html DB is for leg pulling,info share,timepass dont take all posts to heart/dil pe ..DB is Pressure Release |
|