   
Methhanithodugu
Megastar Username: Methhanithodugu
Post Number: 25808 Registered: 12-2008 Posted From: 117.195.194.224
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Wednesday, June 26, 2013 - 11:31 pm: |
    |
humanity should be ashamed or india male chauvinist thug pigs shud be hanged bustaards http://www.sakshi.com/Main/Featuredetails.aspx?Newsid=64650& Categoryid=28&subcatid=0 ఆధునిక కాలంలోనూ అనాగరిక పోకడలతో మనిషి మృగం కంటే హీనంగా ప్రవరిస్తున్నాడు. విచక్షణ కో్ల్పోయి మానవత్వానికి మచ్చ తెస్తున్నాడు. కొంత మంది మృగాళ్ల మృత్యుకోరల నుంచి మహిళా జాతిని కాపాడుకోవడం ఇప్పడు అతిపెద్ద సవాల్ మారింది. ఒంటరిగా ఆడమనిషి కనబడితే చాలు కాటేసే కామాంధులు దేశమంతా పుచ్చుపోయారు. పశువాంఛతో పడతులను చెరబడుతూ వారి ఉసురు తీస్తున్న దారుణ ఘటనలు నానాటికీ ఎక్కువవుతున్నాయి. కాలమాన పరిస్థితులతో సంబంధం లేకుండా అపర కీచకులు చేస్తున్న దారుణాలకు అంతే లేకుండా పోతోంది. ఉత్తరాఖండ్ లో చోటుచేసుకున్న కిరాతకమే ఇందుకు సజీవ సాక్ష్యం. గుండెల్ని పిండేసే విషాదం కూడా మృగాళ్ల పాషాణ హృదయాన్ని కరిగించలేకపోయింది. జల విలయం బారిన పడి జీవచ్ఛాలుగా మిగిలిన దీనురాళ్లపై దారుణానికి తెగబడ్డారు. ముంచెత్తిన వరదల నుంచి ప్రాణాలతో బయటపడినా కామాంధుల చేతికి చిక్కి శవాలుగా మారారు. విపత్తు నుంచి తప్పించుకున్నా మానవ మృగాల బారిన పడి మాన ప్రాణాలు పోగొట్టుకున్నారు తల్లీకూతుళ్లు. ఉత్తరాఖండ్‌లోని పాండుకేశ్వర్ సమీపంలోని కొండలపై చిక్కుకున్న యాత్రికుల కోసం గాలింపు చేపడుతున్న ఆర్మీ బృందాలు మంగళవారం వీరి మృతదేహాలను గుర్తించడంతో ఈ దారుణోదంతం వెలుగుచూసింది. వరదల్లో చిక్కుకోవడంతో ఈ తల్లీకూతుళ్లు పదిరోజుల పాటు బద్రీనాథ్‌లోనే తలదాచుకున్నారు. హెలికాఫ్టర్ ద్వారా తరలింపు ఆలస్యం అవుతుండటంతో సోమవారం కాలినడక జోషిమఠ్‌కు బయలుదేరారు. పాండుకేశ్వర్ సమీపంలో వీరిని అటకాయించిన కామాంధులు రోడ్డు పక్కన ఉన్న పర్వతాల్లోకి తీసుకువెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆపై హత్య చేసి వారి వద్ద ఉన్న సొత్తు, నగదును దోచుకెళ్లారు. ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీసు, సైనిక దళాలు ఇకపై ఎవ్వరినీ ఒంటిరిగా పంపకూడదని నిర్ణయించాయి. మరుభూమిగా మారిపోయిన కేదార్‌నాథ్‌లో కొందరు దొంగలు శవాల వద్ద నుంచి కూడా దోపిడీ చేస్తుండగా... బద్రీనాథ్ సమీపంలో కామాంధులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. మృగాళ్ల ఆటవిక చర్యకు బలైన ఈ తల్లీకూతుళ్లు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారనేది ఇంకా తెలియలేదు. ఘాతుకానికి పాల్పడింది ఎవరన్న అంశాలపై స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరో దిగ్భ్రాంతకరమైన విషయం ఏమిటంటే వీరు సామూహిక అత్యాచారానికి గురైనట్టు ప్రాథమిక ఆధారాలను బట్టి పోలీసులు నిర్ధారణకు వచ్చారు. రెండు మృతదేహాలను గోవింద్‌కుండ్‌లోని తాత్కాలిక హెలిప్యాడ్ నుంచి డెహ్రాడూన్ తరలించారు. సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునేలా, ఆధునికత అవమానపడేలా జరిగిన ఈ ఘటన మనుషుల్లో మిగిలివున్న రాక్షస ప్రవృత్తికి అద్దం పడుతోంది. - Sఈ మొరె అట్: హ్ట్ట్ప్://www.సక్శి.cఒమ్/ంఐన్/Fఎఅటురెడెటైల్స్.అస్ప్x?ణెwసిడ ్=64650&Cఅటెగొర్యిడ్=28&సుబ్cఅటిడ్=0#స్తశ్.0ళాప్క్Xప్న్.డ్పు f  DB is for leg pulling,info share,timepass dont take all posts to heart/dil pe ..DB is Pressure Release |