Sabbam Hari- Double Agent 007 Chalanachithram.com | Topics | Search
Hide Clipart | Log Out | Register | Edit Profile

Last 30 mins | 1 | 2 | 4 hours     Last 1 | 7 Days

Chalanachithram.com DB » TF Industry related » Archive through June 23, 2013 » Sabbam Hari- Double Agent 007 « Previous Next »

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Methhanithodugu
Megastar
Username: Methhanithodugu

Post Number: 25673
Registered: 12-2008
Posted From: 117.213.224.100

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Sunday, June 23, 2013 - 03:18 am:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)

సబ్బంహరి. అనకాపల్లి ఎంపీ. కాంగ్రెస్ తరఫున లోక్‌సభకు ఎన్నికై జగన్ పార్టీ పెట్టాక రాబోయే రోజుల్లో అందులో చేరతానని బాహాటంగా ప్రకటించిన నేత. జగన్ పట్ల కాంగ్రెస్ అధిష్టాన వర్గం వ్యవహరించిన తీరును తీవ్రంగా ప్రజాక్షేత్రంలో ఎండగట్టారు. వైఎస్‌కు వీర విధేయుడిగా పేరుంది. మేకపాటి రాజమోహన్ రెడ్డి ఎంపీ పదవికి రాజీనామా చేసిన సమయంలోనే సబ్బంహరి కూడా రాజీనామా చేసి వైసీపీ తరఫున పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. అయితే సబ్బం అలా చేయలేదు. వైసీపీ నేతలతో సఖ్యతగా వుంటూ, గత కొన్ని నెలల కిందటి వరకు జగన్‌కు అనుకూలంగా మీడియా ముందు మాట్లాడుతూ వచ్చారు. అయితే ఇటీవలి కాలంలో ఆయన మౌనంగా వుండి పోతున్నారు. విజయమ్మ కానీ, ఇతర వైసీపీ నేతలు పాల్గొనే వేదికల్లో ఆయన పాలుపంచుకోవడం లేదు. పార్టీ చేపట్టే ఆందోళనలు, ఇతరత్రా కార్యక్రమాలకు దూరంగా వుంటున్నారు. ఇటీవలి కాలంలో సబ్బంహరి వ్యవహార శైలిపై వైసీపీలోనే కాకుండా ఇతర రాజకీయ వర్గాల్లోనూ పలు కోణాల్లో చర్చలు సాగుతున్నాయి. జగనే తనకు ముఖ్యం, ఎంపీ పదవి తృణప్రాయం, వచ్చే ఎన్నికల్లో వైసీపీతోనే పోటీ చేస్తా అంటూ బాహాటంగా ప్రకటించిన సబ్బం ఇటీవల కాలంలో ఎందుకు ఆ తరహా మాటల ఒరవడిని కొనసాగించడం లేదు. టంచన్‌గా లోక్‌సభ సమావేశాలకు హాజరుకావడం, ఆడపా దడపా వైకాపా పెద్దలను ఎవరికి తెలియకుండా కలిసి వెళ్ళడం తప్ప ఆయన బయట ఎక్కడా నోరు విప్పడం లేదు. పోనీ వైకాపాను వీడుతున్నారా అంటే ఆ తరహా సంకేతాలు ఇవ్వడం లేదు. అలాగని కాంగ్రెస్‌లో కొనసాగుతారనే నమ్మకాన్ని కూడా కల్పించడం లేదు. ఏ విషయం బయట పెట్టడం లేదు. చిక్కడుదొరకడులా రెండు శిబిరాల్లోనూ లౌక్యంగా వ్యవహరిస్తూ ఎటు గాలివుంటే అటు సర్దుకు పోదాం అనే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్టు సన్నిహిత వర్గాల కథనం. కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా క్రమశిక్షణా చర్యలు ఎదుర్కొనే పరిస్థితి లేకుండా వారితోనూ సఖ్యతగా మెలుగుతున్నారని తెలుస్తోంది. జగన్ పార్టీకి ప్రజల్లో ఆదరణ తగ్గిపోతుండటం కూడా హరిలో మారిన శైలికి కారణంగా చెప్పుకుం టున్నారు. ఇటీవలి కాలంలో కాంగ్రెస్ హైకమాండ్‌తో దగ్గరగా వుంటూ, వైకాపాలోని లోగట్టువిషయాలను, వ్యూహాలను వారికి చేరేవేసే కార్యక్రమాన్ని భుజానవేసు కున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల దాడి వీరభద్రరావు చేరికతో మనస్థాపం చెందిన కొణతాల రామకృష్ణ కాంగ్రెస్ వైపు అడుగులువేయాలనే ఆలోచనతో ఢిల్లీ పెద్దలకు సంకేతాలు పంపినట్టు సమాచారం. ఆయన అనకాపల్లి లోక్‌సభ స్థానం టికెట్ కోరితే ఢిల్లీ పెద్దలు అందుకు బదులుగా అసెంబ్లీ స్థానాన్ని ఆఫర్ ఇచ్చినట్టు తెలిసింది. దీనికి కారణం కూడా సబ్బం హరినేనని ప్రచారం జరుగుతోంది. మొన్నటి వరకు వచ్చే ఎన్నికలకు అనకాపల్లిలో లోక్‌సభ అభ్యర్థి సబ్బంహరి అవుతారని అందరూ భావించగా, మారిన పరిస్థితిలో సబ్బంహరి కాంగ్రెస్‌లోనే కొనసాగవ చ్చుననే సంకేతాలు కొణతాలకు లోక్‌సభ స్థానం బదులుగా అసెంబ్లీ స్థానం ఇవ్వజూపిన విషయాన్ని పరిశీలిస్తే అర్దమవుతుంది. సబ్బంహరి విలువైన సమాచారాన్ని అందిస్తున్నందునే కాంగ్రెస్ నాయకత్వం ఆయనపై ఎలాంటి చర్య తీసుకోవడం లేదని, అదే సందర్భంలో అక్కడి టికెట్‌ను మరొకరికి ఇవ్వకుండా ఆఫ్షన్‌ను ఆయన కోసం పెండింగ్‌లో పెట్టుకుందని భావిస్తున్నారు. పిసిసి అధ్యక్షుడు బొత్స, విశాఖ జిల్లా మంత్రి గంట శ్రీనివాసరావులు కూడా కొణతాలకు మద్దతుగా అధిష్టానం చెవిలో వేసినట్టు తెలుస్తోంది. దాడిని వైసీపీలోకి పంపడంలోనూ సబ్బంహరి పాత్ర కీలకమని చెబుతున్నారు. అయితే హరిమాత్రం వైసీపీలోకి ఎన్నికలు దగ్గరపడే సమయానికి చేరే విషయంలో చాలా జాగ్రత్తగానే ఆలోచిస్తున్నారు. జగన్ ఎన్నికల లోపు బయటకు వచ్చి వైసీపీ అవకాశాలు మెరుగుపడితే అందులోకి వెళ్ళాలని, ఆయన విడుదల కాకపోతే కాంగ్రెస్ నుంచే పోటీ చేయాలనే రెండురకాల ఆఫ్షన్స్‌ను ఎంచుకుని వున్నట్టు ఆయన సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తున్నది. వైసీపీ కూడా సబ్బంహరిని అనుమానించ కుండా జాగ్రతపడుతోంది.ఆయన కాంగ్రెస్ ఎంపీగనుక ఆయన మన పార్టీ అధాకారిక కార్యక్రమాల్లో పాల్గొంటే ఇబ్బంది అవుతుందికదా అంటూ కవరింగ్ ఇచ్చుకుంటోంది. ఇటువైసీపీ నాయక త్వం పట్ల, అటు కాంగ్రెస్ అధినాయకత్వంతో విలువైన సమాచారం ఇస్తూ రెండు పార్టీల పట్ల విధేయతను చాటుకుంటున్నారని విశాఖ జిల్లా రాజకీయ వర్గాలలో ప్రచారం జరుగుతోంది. కొణతాల రామకృష్ణను కాంగ్రెస్ పార్టీలోకి ఎంపీ అభ్యర్థిగా అవకాశం రానివ్వకుండా అడ్డుకునే ప్రయత్నాలను చేస్తున్నారు. ఇటీవల విశాఖ జిల్లా పార్టీ కార్యాలయ ప్రారంభానికి విజయమ్మ వెళ్ళిన సందర్భంలో సబ్బంహరి అక్కడ కనబడలేదు. పార్టీ కార్యక్రమానికి వెళ్ళడానికి, విజయమ్మకు ఆహ్వానం పలకడానికి సాంకేతికంగా కొన్ని ఇబ్బందులున్నా, ఇంతకు ముందు ప్రైవేటుగా అంటే అతిధి గృహాల్లో విడిది చేసినప్పుడు, పార్టీ ఆఫీసులో కలిసి వచ్చిన విధంగా ఈసారి చేయక పోవడంపై పార్టీలో అనుమానాలు తలెత్తుతున్నాయి. వైఎస్‌కు అంత విశ్వసనీయుడిగా వున్న అనకాపల్లి ఎంపీ సబ్బంహరి శైలి గత మూడునాలుగు నెలలుగా అందరి నోళ్ళల్లో నానుతున్న అంశంగా మారిపోయింది. పార్టీకి గ్రాఫ్ తగ్గిపోయిందని ఇతర జిల్లాల్లో నేతలు యూ టర్న్ తీసుకున్నట్టుగా ఈయన చేయకపోయినా, జగన్‌కు ఎన్నికల ముందు బెయిల్ వస్తే అటు, లేకుంటే ఇటు అనే కోణంలో ఎవరికీ చెడ్డకాకుండా, పరిస్థితులను జాగ్రత్తగా బేరీజు వేసుకుంటూ ముందుకు వెళ్తున్నట్టు అర్థమవుతోంది.

DB is for leg pulling,info share,timepass dont take all posts to heart/dil pe ..DB is Pressure Release

Add Your Message Here
Post:
Bold text Italics Underline Create a hyperlink Insert a clipart image HASH(0x82edd54){Movie Clipart}
Show / hide regular icons selection options

Click on following links to open cliparts by Alphabetical Order

 A   B   C   D   E   F   G   H   I   J   K   L   M  

 N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z  

Show / Hide Filmy icons selection options

Click on following links to open cliparts by Alphabetical Order

 A   B   C   D   E   F   G   H   I   J   K   L   M  

 N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z  

Username: Posting Information:
This is a public posting area. Enter your username and password if you have an account. Otherwise, enter your full name as your username and leave the password blank. Your e-mail address is optional.
Password:
E-mail:
Options: Enable HTML code in message
Automatically activate URLs in message
Action: