   
Methhanithodugu
Megastar Username: Methhanithodugu
Post Number: 24521 Registered: 12-2008 Posted From: 117.213.224.29
Rating:  Votes: 5 (Vote!) | | Posted on Thursday, May 16, 2013 - 08:37 am: |
    |
చంచల్‌గూడ జైల్లో జ్యూడీషియల్ రిమాండ్‌లో ఉన్న జగన్ కూడా ఈడీ అధికారులు కొన్ని గంటల పాటు ముందే సిద్ధం చేసుకున్న ప్రశ్నావళిని సంధించి సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేశారు. అయితే వాస్తవాలను జగన్ వివరించలేదని ఈడీ అభిప్రాయపడింది. విదేశీ లావాదేవీలపై నిజానిజాలు నిగ్గు తేలినందున దర్యాప్తు దాదాపుగా ఒక్క కొలిక్కి వచ్చినట్టేనని, ఇక ప్రధాన నిందితుడైన జగన్‌ను విచారించాల్సి ఉందని అధికారులు అభిప్రాయపడుతు న్నారు. జగన్‌ను విచారించాల్సిన అవశ్యకతను ఉన్నతాధికారుల దృష్టికి దర్యాప్తు బృందం తీసుకెళ్ళింది. పి.టి. కింద ఆయన్ను తీహార్ జైలుకు తీసుకువచ్చి విచారించాలని ప్రతిపాదించింది. అయితే ఏప్రిల్‌లో ఈడీ చేసిన ఈ ప్రతిపాదనకు ఇంకా అనుమతి రాలేదు. అనుమతి కోసం ఈడీ వేచి చూస్తోంది. గ్రీన్ సిగ్నల్ లభించిన వెంటనే పి.టి. కింద సీబీఐ కోర్టులో పిటిషన్ వేసి తీహార్‌కు తరలించేందుకు ఈడీ రంగంలోకి దిగనుంది. బహుశా జూన్‌లో ఈ ప్రక్రియ చేపట్టవచ్చని చెబుతున్నారు. ఈడీ కేసుల కనుక విచారణ అనంతరం అరెస్టు అయితే విడుదల కావడానికి కనీసం 3 ఏళ్ళు పడుతుందని న్యాయవాదులు చెబుతున్నారు. ఇప్పటికే దాదాపు ఏడాది పాటు సీబీఐ కేసులో జైలు జీవితాన్ని అనుభవిస్తున్న జగన్‌కు త్వరలోనే ఈడీ మరో షాకు ఇచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. DB is for leg pulling,info shr,timepass dont take all posts to dil pe /heart.. |