Pay loyals -HC / Pay Coverts - CM --... Chalanachithram.com | Topics | Search
Hide Clipart | Log Out | Register | Edit Profile

Last 30 mins | 1 | 2 | 4 hours     Last 1 | 7 Days

Chalanachithram.com DB » TF Industry related » Archive through October 31, 2012 » Pay loyals -HC / Pay Coverts - CM -- INC lol « Previous Next »

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Methhanithodugu
Megastar
Username: Methhanithodugu

Post Number: 21576
Registered: 12-2008
Posted From: 117.195.194.180

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Tuesday, October 30, 2012 - 11:35 pm:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)

http://suryaa.com/gallery/2012/Oct/31//reddyb.jpg

(సూర్య ప్రధాన ప్రతినిధి, హైదరాబాద్‌):అయిన వారికి ఆకుల్లో కానివారికి కంచాల్లో అన్న సామెత తమ విషయంలో నిజమవుతోందని కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రగిలిపోతున్నారు. జగన్‌ పార్టీలోకి వెళ తామని బెదిరించే వారికే పనులు చేస్తూ, పార్టీని నమ్ముకున్న వారిని నిర్లక్ష్యం చేస్తున్నారన్న ఆగ్రహం కాంగ్రెస్‌ పార్టీ శాసనసభ్యుల్లో పెల్లుబుకుతోంది. దీనిపెై ఇద్దరు సీనియర్లు సోమవారం సాయంత్రమే అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి వర్గీయులే పార్టీని వీడుతున్నారని, దీనివెనుక ఉన్న రహస్యాన్ని గ్రహించాలంటూ ఆ ఇద్దరూ అధిష్ఠానానికి తమ లేఖలో ఫిర్యాదు చేశారు. తాజాగా పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి ఎమ్మెల్యే రాజేష్‌ వెైకాపాలో చేరడం ముఖ్యమంత్రితో పాటు అందరినీ షాక్‌కు గురిచేసింది. నిజానికి ఏడాది క్రితమే రాజేష్‌ వెైకాపాలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఆయనను కిరణ్‌ బుజ్జగిస్తూ కోరిన పనులు చేస్తూ వస్తున్నారు. ఇప్పటివరకూ దాదాపు 100 కోట్ల రూపాయల పనులు రాజేష్‌ కోసం చేసిపెట్టినట్లు పార్టీ నేతలే చెబుతున్నారు.

అదీకాకుంగా రాజేష్‌ మామ, ఐఏఎస్‌ అధికారి అయిన రామాంజనేయులుకు కోరిన చోట పోస్టింగులు ఇప్పించుకున్నారు.గుంటూరు జిల్లా కలెక్టర్‌, విశాఖ కమిషనర్‌, లేబర్‌ కమిషనర్‌ వంటి కీలక పోస్టింగులు సాధించుకున్నారు. ఆయన వద్దని గుంటూరు జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు ఎంత ఒత్తిడి చేసినా కిరణ్‌ లెక్కచేయలేదని గుర్తు చేస్తున్నారు. రాజేష్‌ పార్టీలో ఉండరని పశ్చిమ గోదావరి, గుంటూరు మంత్రులు, ఎమ్మెల్యేలు సీఎంకు చెప్పినా ఆయన ఖాతరు చేయకుండా అడిగనన్ని నిధులు మంజూరు చేశారు. ముఖ్యమంత్రి పేషీలో ఎవరినీ సరిగా ఆదరించరన్న వ్యాఖ్యలు ఎమ్మెల్యేల్లో బాహాటంగానే వినిపిస్తుంటుంది. అలాంటిది రాజేష్‌కు ఎనలేని స్వేచ్ఛ ఇచ్చారు. ఇప్పుడు అదే రాజేష్‌ సీఎం పెట్టుకున్న ఆశలను వమ్ము చేసి, బయటకు వెళ్లిపోవడం ముఖ్యమంత్రి అంచనా లోపమేనని, వ్యక్తుల పట్ల సరెైన అంచనా లేకపోవడంవల్లే ఇలా జరిగిందని సీనియర్లు విమర్శిస్తున్నారు.

ఇక మరొక ఎమ్మెల్యే ఆళ్ల నాని విషయంలోనూ ముఖ్యమంత్రి అంచనా దారుణంగా తప్పిందని పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు. నాని పార్టీ నుంచి వెళ్లిపోతారని తెలిసినప్పటికీ ఆయన కోరినన్ని పనులు చేసిపెట్టారని, ఇప్పుడు ఆయన కూడా వెక్కిరించి వెళ్లారని పార్టీ నేతలు చెబుతున్నారు. ఏలూరు బహిరంగసభకు వెళ్లిన సీఎం.. మునిసిపాలిటీ అభివృద్ధికి నాని కోరినట్లు 17 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ ఆ జీఓను కిరణ్‌ స్వయంగా హైదరాబాద్‌ నుంచి తీసుకునివెళ్లి ప్రజల సమక్షంలో నానికి ఇచ్చారని గుర్తు చేస్తున్నారు. అయినప్పటికీ నాని కూడా కాంగ్రెస్‌ను వీడారంటున్నారు. సుజయ కృష్ణ రంగారావు విషయంలో కూడా సీఎం అంచనా దారుణంగా తప్పిందని చెబుతున్నారు. గతంలో కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డికి జగన్‌ అత్యంత సన్నిహితుడని తెలిసినా, సాక్షి భవన నిర్మాణంలో కీలకపాత్ర పోషించారన్న విషయం తెలిసినా ఆయనకూ ప్రాధాన్యం ఇచ్చారని, ఆయన కూడా పార్టీకి ఝలక్‌ ఇచ్చారని చెబుతున్నారు.

పార్టీ-ప్రభుత్వంలో ఈరకంగా అయిన వారికి ఆకులు-కానివారికి కంచాల్లో అన్నట్లుగా గౌరవం దక్కుతోందని సీనియర్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బహిరంగంగానే తమ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జీవించి ఉన్నంతవరకూ వెైఎస్‌ను వ్యతిరేకించిన దివంగత ఎమ్మెల్యే పి.జనార్దన్‌రెడ్డి తనయుడయిన ఎమ్మెల్యే విష్ణువర్దన్‌రెడ్డి ఇటీవల తన నియోజకవర్గంలో నిర్వహించిన రచ్చబండను బహిష్కరించారు. పనులు కావడం లేదని, అధికారులు డబ్బు లేదంటున్నారని, అందువల్ల తాను రచ్చబండను బహిష్కరిస్తున్నానని ప్రకటించారు. ఆయన నియోజకవర్గంలో అధికారిని కార్యకర్తలు గృహనిర్బంధం కూడా చేశారు. జగన్‌ సీఎం కావాలని అప్పట్లో కేవీపీ నేతృత్వంలో సంతకాల సేకరణ జరిగినప్పుడు విష్ణు దానిని వ్యతిరేకించి పార్టీకి కట్టుబడి ఉంటే, ఆయన నియోజకవర్గానికి నిధులు ఇవ్వడం లేదని పీసీసీ ప్రధాన కార్యదర్శి ఒకరు వ్యాఖ్యానించారు.

డీడీఆర్‌సీ సమావేశాల్లో తమ నియోజకవర్గాలకు నిధులు ఇవ్వాలని గళమెత్తుతున్న ఎమ్మెల్యేలలో కాంగ్రెస్‌ పార్టీ వారే ఎక్కువని పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. దానికి సంబంధించి దాదాపు 90 మంది ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి నిధులు కేటాయించాలని, పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తి చే యాలని కోరుతూ సీఎంఓకు నివేదికలు పంపారు. అయితే ఇప్పటివరకూ వాటికి మోక్షం లేకపోగా, పార్టీ నుంచి వెళ్లిపోయే వారికి రాచమర్యాదలు చేయడం ఎమ్మెల్యేలకు పుండుమీద కారం చల్లినట్టయింది. దాదాపు 13 మంది మంత్రులు తమ నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇవ్వాలని చాలాకాలం క్రితమే కోరినప్పటికీ వారికి నిధులు ఇవ్వలేదని ఓ మంత్రి వాపోయారు.

ఈ విధంగా పార్టీ కోసం పనిచేస్తూ, పార్టీలోనే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకునే తమను పట్టించుకోకుండా, జగన్‌ పార్టీలోకి వెళ్లేవారిని బుజ్జగించేందుకు అడిగినన్ని పనులు చేస్తుండటంపెై అసంతృప్తి పెరుగుతోంది. అయినా వారంతా ప్రభుత్వంలో పనులు చేయించుకుని, బంధువర్గాలకు పోస్టింగులు ఇప్పించుకుని, రాజకీయంగా-ఆర్ధికంగా లబ్థిపొందిన తర్వాత కూడా పార్టీని వీడుతున్నారంటే అలాంటి వారిపెై సీఎంకు సరెైన అంచనా, నియంత్రణ లేకపోవడమే కారణమని సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు.ఆది నుంచీ పార్టీని అంటిపెట్టుకుని, ఎన్ని ఆటుపోట్లు ఎదురయినా లెక్కచేయకుండా, అధికారం లేకపోయినా పార్టీని వీడని వారిని నిర్లక్ష్యం చేస్తున్నారన్న ఆవేదన పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.సీనియర్‌ నేత పాలడుగు వెంకట్రావు, ఆమోస్‌, యాదవరెడ్డి, తిప్పేస్వామి, బూదాటి రాధాకృష్ణయ్య వంటి ప్రముఖులు పార్టీని అంటిపెట్టుకుని ఉన్నప్పటికీ ఇప్పటివరకూ వారికి కనీసం మంత్రి పదవులు కూడా ఇవ్వలేదంటున్నారు.

ప్రధానంగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన పాలడుగు వెంకట్రావు మొదటి నుంచి కనీసం రెడ్డి కాంగ్రెస్‌ వంటి పార్టీల్లో కూడా చేరకుండా కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్నప్పటికీ, విధేయత, విషయ పరిజ్ఞానం దండిగా ఉన్నప్పటికీ అలాంటి వారిని విస్మరిస్తూ, అవకాశవాదులను అందలం ఎక్కిస్తున్న తీరు ఆగ్రహానికి గురిచేస్తోంది. పార్టీలో సామాజిక సమతుల్యం లేకుండా పోయిందని, ఎంతసేపటికీ రెడ్డి-కమ్మ-బీసీ సమీకరణలే తప్ప, పార్టీ విధేయతను పట్టించుకోకపోవడంపెై అసంతృప్తి పెరుగుతోంది. ఐదుసార్లు గెలిచిన కావూరి లాంటి సీనియర్లకే దిక్కులేని పరిస్థితి ఉంటే ఇక తమ సంగతి ఏమిటని సీనియర్లు ప్రశ్నిస్తున్నారు. మొదటిసారి గెలిచిన వారికే ఇంత ఆత్రుత ఉంటే దశాబ్దాల నుంచి పనిచేస్తున్న తమ సంగతేమిటని వాపోతున్నారు.

cinima c ni ma la soodandi
Jai Chandra Madiga garu

Add Your Message Here
Post:
Bold text Italics Underline Create a hyperlink Insert a clipart image HASH(0x9e5c0d0){Movie Clipart}
Show / Hide regular icons selection options

Click on following links to open cliparts by Alphabetical Order

 A   B   C   D   E   F   G   H   I   J   K   L   M  

 N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z  

Show / Hide Filmy icons selection options

Click on following links to open cliparts by Alphabetical Order

 A   B   C   D   E   F   G   H   I   J   K   L   M  

 N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z  


Username: Posting Information:
This is a public posting area. Enter your username and password if you have an account. Otherwise, enter your full name as your username and leave the password blank. Your e-mail address is optional.
Password:
E-mail:
Options: Enable HTML code in message
Automatically activate URLs in message
Action: