| Author |
Message |
   
Methhanithodugu
Megastar Username: Methhanithodugu
Post Number: 20913 Registered: 12-2008 Posted From: 117.213.225.11
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Tuesday, September 25, 2012 - 08:02 am: |
    |
Muddamandaram:Manam ohappudu esina threads enti. Eee kotta poragaallu vassi ninnu baaga discouraging of india sessaarau annnaaai.
mareti seyyala 1. Jagan in Jail oka aganthakudu lopalki dooradu ... its was neither of uS 2. Babu Yatra spesal live illio ....... 3. KCR Deli lo drakoni Paper Namaste lo first page full2 idigo produnna meeting CWC about Telangana declaration ....scene cut Vayalar Ravi abbe KCR chaala uhinchukuntad mem nothing doing upto 2014 ........ 4. K Ram says bring jonne rottel , 1ka ulllipaya ,1 mirchi to Jubilee Checkpost .......... 5. Famous fights of Elcamino Vs pplsuk , Derschuler Vs Saanman , Coconada Vs Jprocks , OT vs KNF vs gurio vs ravino vs tt vs bunty , Mudda Vs Beckam, tilak vs IR , idly Vs Divi , Gagu Ravino Guri j4f anji kish ST Sasibob Linkmasta Bitter Coolmac farmer raman/ek paapi rising kkd Darkar pavala twitter mrhyd moviefan jupiter Rowdy, bathaer vs KB vs Rajesh vs OT all are LOW 6 . Krotha yuagam Kurrol lkg lo hp to Pg lo Tiffins ..... ..pawan this thatto .... verasi ....
 Hello world "corruption",Narco Nakko Jagan Intl Asato ma sad gamaya
|
   
Muddamandaram
Hero Username: Muddamandaram
Post Number: 11338 Registered: 05-2011 Posted From: 123.201.229.39
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Tuesday, September 25, 2012 - 07:49 am: |
    |
ettantodivi etta ayyipoyyav annai. Manam ohappudu esina threads enti. Eee kotta poragaallu vassi ninnu baaga discouraging of india sessaarau annnaaai. "They are always proxy congress. It is like maintaining extra marital relationship after divorce " |
   
Methhanithodugu
Megastar Username: Methhanithodugu
Post Number: 20912 Registered: 12-2008 Posted From: 117.213.225.11
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Tuesday, September 25, 2012 - 07:48 am: |
    |
మినహాయింపులు సమాచారహక్కుచట్టం -2005 చట్ట పరిధి నుంచి 18 సంస్థలు, 26 రకాల సమాచారాలు మినహాయించబడ్డాయి. ఈ సంస్థలు తమ సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇవి ప్రధానంగా నిఘా సంస్థలు, రక్షణ శాఖ, పరిశోధన, అర్థ సైనిక సంస్థలు, ఈ వ్యవస్థలు, జాతీయ భద్రత, ప్రజాభద్రత దృష్ట్యా సమాచారాన్ని మినహాయించ వచ్చు. అయితే ఈ సంస్థలు గనుక మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడితే సమాచారాన్ని అందజేయాలి.అయితే ప్రభుత్వ సంస్థలు కూడా కొన్ని అంశాలకు సంబంధించిన సమాచారాన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు. అవి 1. దేశ సార్వభౌమాధికారం, భద్రత సమాచారం. 2. మేథో సంపత్తి హక్కులకు సంబంధించిన సమాచారం 3. టెర్రరిస్టులను నిర్బంధించడం 4. విదేశీ ప్రభుత్వాలనుంచి పొందిన సమాచారం. 5. క్యాబినెట్ చర్చలకు సంబం ధించిన సమాచారం సమచార హక్కుకు సంబం ధించిన సమాచారం కోసం అప్పీలు చేసుకునే పౌరుడు, హింది, ఇంగ్లీష్, లేదా స్థానిక భాషలో సమాచారాన్ని కోరవ చ్చు. ఆ అప్పీలు ఎలక్ట్రానిక్ రూపంలోకూడా పొందవచ్చు. నిరక్ష్యరాస్యులు అప్పీలు రాయడానికి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ సహాయపడతాడు. అప్పీలు చేసుకున్న 30 రోజుల్లోగా సమాచారం అందించాలి. జీవించే హక్కు వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించిన సమాచారం 48 గంటల్లో ఇవ్వాల్సి ఉంటుంది. పై నియమాలు ఉల్లంఘిస్తే తగిన పరిహారాలు కూడా సమాచార హక్కు చట్టంలో పొందుపర్చ బడ్డాయి. వివాదాస్పదంగామారుతున్న నియామకాలు అయితే సమాచార హక్కు అమలుకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర స్థాయిలో ముఖ్య సమాచార కమిషనర్, ఇతర సమాచార కమిషనర్లు ఉంటారు. వారి నియమాకాలు ఇటీవల వివాదాస్పదం అయ్యాయి. దానికి కారణం వారి అర్హతల విషయంలో సమాచార హక్కు చట్టంలో నిర్దుష్టంగా సమాచారాన్ని పేర్కొనకపోవడమే. కమిషనర్, చీఫ్ కమిషనర్లుగా నియమింపబడేవారు ప్రజా జీవితంలో ప్రముఖ వ్యక్తులై ఉండాలి అని పేర్కొన్నారు. ప్రజా జీవితం అన్న పదానికి స్పష్టమైన నిర్వచనం లేదు కాబట్టి నిబద్ధత లేని వ్యక్తులు కమిషనర్లుగా నియమించబడవచ్చు. అలాగే కమిషనర్లను నియమించే హైపర్ కమిటీల్లో ఉండే వ్యక్తులు రాజకీయ ప్రయోజనాలు ఆశిస్తే సమాచార హక్కు కమిషనర్లుగా నియమించబడే వారు ప్రజాస్వామ్య విలువలను భంగపరిచే అవకాశం ఉంది. సమాచార హక్కు చట్టం అమలు చేయడం వలన అనేక ప్రయోజనాలున్నాయి. భారతీ య సమాజంలోని అనేక మౌలిక విలువలకు సమాచార హక్కు రక్షణ కల్పిస్తుంది. ప్రపంచీకరణ నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థ క్రియాశీలంగా మారింది. ఇటువంటి పరిస్థితుల్లో అవినీతి పరమైన పాలనను ఎవరూ అంగీకరించరు. పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన పరిస్థితులు లేకపోతే ఏ బహుళ జాతి సంస్థ కూడా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రాదు. కాబట్టి సమాచార హక్కు చట్టాన్ని సమర్ధవంతంగా అమలు చేయాలి. అలాగే ఈ చట్టంలోని లోపాలను గుర్తించి వాటిని సవరించాలి. లోపాలు 1. ఈ చట్టంలో అనేక మినహాయింపులు ఉన్నాయి. (ఉదాః 18 సంస్థలు, 26 రకాల సమాచారం సమాచార హక్కుచట్టం నుంచి మినహాయించారు.) 2. దక్షిణాఫ్రికాలో ఉన్నట్లుగా ప్రైవేటు, ఎన్జీవోల సమాచారం కూడా తెలుసుకునే అవకాశం ఉండాలి. 3. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఈ చట్టం రూపొందించబడలేదు. ప్రపంచంలోని ఏ దేశంలోనూ సమాచారం ఇవ్వడానికి రుసుము వసూలు చేయడం లేదు. 4. ఈ చట్టంలో ఫైల్ నోటింగ్స్ మినహాయించడానికి అవకాశం ఉంది. దీని వలన వాస్తవ సమాచారం ప్రజలకు అందదు. పై లోపాలు సవరించి రెండవ పాలనా సంస్కరణ సంఘం సూచనలు అమలు చేయడంతో పాటు ప్రజా చైతన్యం, రాజకీయ నిబద్ధత, క్రియాశీలత గలిగిన న్యాయ వ్యవస్థ, బాధ్యతాయుతమైన ఎన్జీవోలు సామాజిక బాధ్యత గలిగిన మీడియా ద్వారా అమూల్యమైన సమాచార హక్కు చట్టం మరింత క్రియాశీలమై అవినీతికి అడ్డుకట్ట వేయడానికి, ప్రజాసంక్షేమానికి ఒక ఆయుధంగా తోడ్పడుతుంది. పాలనా సంస్కరణల సంఘం సూచనలు సమాచారహక్కుచట్టంలోని లోపాలను అధిగమించ డానికి 2వ పరిపాలనా సంస్కరణల సంఘం అ కెయ్ టొ ఙూడ్ ఙొవెర్నన్cఎ అనే నివేదికలో ఈ కింది సూచనలు చేసింది. 1. 1923 అధికార రహస్యాల చట్టాన్ని పునః సమీక్షించాలి. సవరించాలి. 2. రాజ్యాంగంలోని 2వ షెడ్యూల్లో రాజ్యాంగాధినేతల ఆస్తులు వివరాల సమాచారం కూడా ఇవ్వాలి అనే అంశం చేర్చాలి. 3. సివిల్ సర్వీస్ రూల్స్‌లోని కొన్ని నియమాల ప్రకారం సివిల్ సర్వెంట్స్ సమాచారాన్ని దాచి ఉంచవచ్చు. అన్న అంశం ఉంది. దాన్ని హేతుబద్దంగా పరిశీలించాలి. 4. 3వ షెడ్యూల్‌లో మంత్రుల ప్రమాణ స్వీకారంలో ఉన్న అధికార రహస్యాలు కాపాడటం అన్న విషయాన్ని తొలగించాలి. End Hello world "corruption",Narco Nakko Jagan Intl Asato ma sad gamaya
|
   
Methhanithodugu
Megastar Username: Methhanithodugu
Post Number: 20911 Registered: 12-2008 Posted From: 117.213.225.11
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Tuesday, September 25, 2012 - 07:47 am: |
    |
సమాచారహక్కుచట్టానికి మరింత పదును సమాచారహక్కును కల్పించిన మొట్టమొదటి దేశం స్వీడన్(1766). అప్పటి నుంచి ప్రపంచంలోని వివిధ దేశాలు సమాచార హక్కును కల్పిస్తూ వస్తున్నాయి. 1951లో ఫిన్లాండ్, 1970లో డెన్మార్క్, నార్వే దేశాలు, 1966లో అమెరికా, 2000 సం॥ బల్గేరియా, దక్షిణాఫ్రికా దేశాలు సమాచార హక్కును కల్పించాయి. దక్షిణాఫ్రికాలో సమాచార హక్కు ప్రభుత్వ సంస్థలకు మాత్రమే కాకుండా ప్రైవేటు సంస్థలకు కూడా వర్తిస్తుంది.భారతదేశంలో సమాచార హక్కుకు సంబంధించిన కృషి మొట్టమొదట 1977లో ప్రారంభమైందని చెప్పవచ్చు. 1975-77 మధ్య కాలంలో అత్యవసర పరిస్థితి కొనసాగినప్పుడు ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని విమర్శించకుండా చేయడం, పత్రికలపై తీవ్రమైన సెన్సార్‌షిప్ విధించడం వంటి పరిస్థితులలో 1977లో అధికారంలోకి వచ్చిన జనతా ప్రభుత్వం సమాచార హక్కు కల్పించే విషయంపై ఒక వర్కింగ్ గ్రూప్‌ను ఏర్పాటు చేసింది. ఆ గ్రూప్ అప్పటికే అమలులో ఉన్న అధికార రహస్యాల చట్టాన్ని కొనసాగించాలని ప్రతిపాదించింది. దాంతో సమాచారహక్కుకి ఆదిలోనే హంసపాదు ఎదురైంది. ఆ తరువాత 2002వ సంవత్సరంలో బిజెపి ప్రభుత్వం సమాచార స్వేచ్ఛా చట్టం రూపొందించింది. దాన్ని ప్రభుత్వ గెజిట్‌లో ప్రకటించకపోవడం వలన అది అమలులోకి రాలేదు. 1990వ సంవత్సరంలో రాజస్థాన్ రాష్ట్రంలో జరిగిన పరిణామాలు ప్రస్తుత సమాచార హక్కు చట్ట రూపం దాల్చడానికి దారి తీశాయి. రాజస్థాన్‌లో బీజం రాజస్థాన్ రాష్ట్రంలోని రాజ్‌సముంద్ జిల్లాలో భీమ్ అనే పంచాయతీలో ఒక గృహనిర్మాణ పథకంలో తప్పుడు లెక్కలు చూపి 39 లక్షల రూపాయల ప్రజాధనాన్ని ఒక స్వచ్ఛంద సంస్థ కైంకర్యం చేసి ప్రజలను వంచించింది. ఆ విషయం గమనించిన ప్రజలు అసలు పేదలకు ఎన్ని ఇళ్లు మంజూరు చేశారు? ఇళ్ల నిర్మాణం కోసం ఎంత డబ్బు చెల్లించారు? మంజూరు చేసిన ఇళ్లు పేద ప్రజలలో ఎవరికి దక్కాయి? వారి పేర్లేమిటి? మొదలైన ప్రశ్నలతో పంచాయతీ అధికారులను నిలదీశారు. పంచాయతీ అధికారుల నుంచి సమాధానం రాక పోవడంతో సామాజిక సృ్పహ కలిగిన మోహన్‌జీ, లాల్‌సింగ్, చున్నిబాయి, శంకర్ మొదలైన వారంతా గ్రామ ప్రజలందరినీ ఏకతాటిపైకి తెచ్చి ‘మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన్’ అనే సంస్థను స్థాపించి గృహ నిర్మాణ పథకంలో పేదలకు చెందవలసిన డబ్బుకు సంబంధించిన సమాచారం ఇవ్వమని అధికారులకు దరఖాస్తు చేశారు. అయినా సమాచారం రాకపోవడంతో అరుణారాయ్ (మాజీ ఐ.ఎ.ఎస్ అధికారి, సామాజిక కార్యకర్త) ఆధ్వర్యంలో ధర్నా ప్రారంభించారు. దాంతో మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన్ అవినీతిపై సమరశంఖం పూరించినట్లయింది. 1950 నుంచి సుప్రీంకోర్టు వెలువరించిన వివిధ తీర్పుల ఆధారంగా సమాచార హక్కు రాజ్యాంగంలో భాగమని ఉద్యమాలు కొనసాగాయి. సమాచారహక్కు చట్టరూపం దాల్చడానికి అనేక స్వచ్ఛంద సంస్థలు, అరుణారాయ్, జయప్రకాశ్‌నారాయణ్, అరవింద్ క్రేజీవాల్ వంటి సామాజిక కార్యకర్తలు విస్తృతంగా కృషి చేశారు. 2004 సంవత్సరంలో అధికారంలోకి వచ్చిన యు.పి.ఎ-1 ప్రభుత్వం కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ ఆధారంగా 2005సం॥ నుంచి సమాచారహక్కు చట్టం అమలులోకి వచ్చింది. సమాచారహక్కు చట్టం-2005 ప్రకారం ఏ ప్రభుత్వ సంస్థ నుంచైనా సమాచారాన్ని పొందవచ్చు. ప్రభుత్వ సంస్థ అంటే రాజ్యాంగ నిబంధనల ద్వారా గాని, పార్లమెంటు చట్టాల ద్వారా గానీ, రాష్ట్ర శాసన సభ చట్టాలు, ఆర్డినెన్సులు, జీవోల ద్వారా ఏర్పాటైనటువంటి, ప్రభుత్వ నియంత్రణలో గాని లేదా ప్రభుత్వం ద్వారా నిధులు పొందుతున్న సంస్థ గాని అయి ఉండాలి. Part 1 Hello world "corruption",Narco Nakko Jagan Intl Asato ma sad gamaya
|
|