| Author |
Message |
   
Conquas
Side Hero Username: Conquas
Post Number: 4492 Registered: 11-2011 Posted From: 99.82.251.78
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Sunday, August 05, 2012 - 09:58 pm: |
    |
2008 nunchi emi chesthunnarra... chetta na sons.... all opinions expressed here are mine.. |
   
Conquas
Side Hero Username: Conquas
Post Number: 4491 Registered: 11-2011 Posted From: 99.82.251.78
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Sunday, August 05, 2012 - 09:56 pm: |
    |
I know its a big article.... idhi day light robbery.... chi... disgusting govt..... okka project fight chesi tecchukundhi ledhu.... evado okadu... lobbying tho... manaki share ni vaadu egaresuku pothunnadu.... all opinions expressed here are mine.. |
   
Conquas
Side Hero Username: Conquas
Post Number: 4490 Registered: 11-2011 Posted From: 99.82.251.78
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Sunday, August 05, 2012 - 09:54 pm: |
    |
కానీ.. ఈ రెండూ లేకపోవడంతో పరిస్థితి జటిలంగా మారింది. గతంలో కేంద్రం ఇచ్చిన భరోసా ప్రకారం గ్యాస్ కేటాయింపులు చేసి ఉంటే రాష్ట్రం విద్యుదుత్పత్తిలో మిగులు సాధించి ఉండేది. రాష్ట్ర అవసరాలు పోను మిగిలిన విద్యుత్‌ను అమ్ముకుని సబ్సిడీ భారాన్ని కూడా కొంత తగ్గించుకునే వెసులుబాటు లభించేది. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం విద్యుదుత్పత్తి స్థాపిత సామర్థ్యం 13,923 మెగావాట్లు. అయితే... ప్రస్తుతం కేంద్రం నుంచి వచ్చే విద్యుత్తుతోపాటు రాష్ట్రంలో మొత్తం ఉత్పత్తి 9,251 మెగావాట్లే. డిమాండ్ మాత్రం 11,141 మెగావాట్లు. అంటే డిమాండ్‌కు సరఫరాకు లోటు 1900 మెగావాట్లు. ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు అడుగంటడంతో జల విద్యుదుత్పత్తి అసలు ఏ మాత్రం లేకపోగా.. థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుల్లోనూ బొగ్గు కొరతతో ఉత్పత్తి క్షీణించింది. వీటికితోడు ఇచ్చే అరకొర గ్యాస్‌లోనూ కోతలు పెడుతుండడంతో రాష్ట్రం దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటోంది. ప్రధాని జోక్యం చేసుకుంటేనే..? కేబినెట్‌తో సమానమైన సాధికారిక కమిటీ తీసుకున్న నిర్ణయాలను సమీక్షించే అధికారం పెట్రోలియం శాఖ మంత్రికి ఉండదు. తిరిగి ఎనిమిది మంత్రులతో కూడిన సా«ధికారిక కమిటీలోనే దీనిపై చర్చ జరగాలి. అప్పట్లో ప్రణబ్ చైర్మన్‌గా ఉండగా.. ప్రస్తుతం ఈ కమిటీకి రక్షణ శాఖ మంత్రి ఏకే ఆంటోని నేతృత్వం వహిస్తున్నారు. పెట్రోలియం మంత్రిగా రాష్ట్రానికి చెందిన జైపాల్ రెడ్డి ఉండడంతో ఆయనపై విమర్శనాస్త్రాలు మొదలయ్యాయి. ప్రస్తుత విపత్కర పరిస్థితి నుంచి గట్టెక్కే అంశంపై సీఎం కిరణ్ ఆయనతో సంప్రదింపులు జరిపారు. ఆయన సూచనల మేరకు ప్రధాన మంత్రిని కలిసి తాజా సమస్యను వివరించి రాష్ట్రానికి ఎంతో కొంత ఊరట కలిగేలా చర్యలు చేపట్టాలని సీఎం నిర్ణయించుకున్నారు. ప్రధాని మన్మోహన్‌సింగ్ జోక్యం చేసుకుంటే తప్ప ఈ సమస్య పరిష్కారమయ్యే అవకాశం లేదని చెబుతున్నారు. ముందుంది మొసళ్ల పండగ గ్యాస్ కేటాయింపుల్లో 2 ఎంఎంఎస్‌సీఎండీ తగ్గితేనే ఇంతలా అల్లాడిపోతున్నాం. కానీ.. భవిష్యత్‌ను ఒక్కసారి ఊహించుకుంటే ఎవరికైనా కళ్లు బైర్లు కమ్మాల్సిందే! గ్యాస్ అపారంగా ఉందని భారీగా విద్యుత్ ప్లాంట్లు పెట్టారు. ఆ ప్లాంట్లకు సరిపడా గ్యాస్ ఇప్పట్లో వస్తుందన్న గ్యారెంటీ లేదు. దీనికితోడు మరో భారీ ప్రమాదం పొంచి ఉంది. అదే గ్యాస్ ధర. ఇప్పుడున్న గ్యాస్ ధరను పెంచాలని రిలయన్స్ గత కొంత కాలంగా కేంద్రంపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తోంది. సమీప భవిష్యత్‌లో గ్యాస్ ధర పెంచక తప్పదని నిపుణులు చెబుతున్నారు. అదే జరిగితే విద్యుదుత్పత్తి వ్యయం భారీగా పెరుగుతుంది. ఫలితంగా యూనిట్ వ్యయం కూడా పెరిగి వినియోగదారులపై పెను భారం పడడం ఖాయం. పొంచి ఉన్న ఈ సమస్యను ముందే పరిష్కరించుకోకపోతే ఇప్పుడున్న కరెంట్ బిల్లులు రెట్టింపైనా ఆశ్చర్యం లేదు. మన ముందూ ఉంది ఓ మార్గం! మన గ్యాస్‌ను మహారాష్ట్ర తన్నుకుపోయినా.. మనకు ద్వారాలు మాత్రం మూసుకుపోలేదు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకునేందుకు ఓ మార్గం ఉంది. అదే.. గ్యాస్ బదులుగా విద్యుత్తు ఇవ్వాలని డిమాండ్ చేయడం. రత్నగిరి పవర్ ప్లాంటుకు 2 ఎంఎంఎస్‌సీఎండీ గ్యాస్‌ను మన రాష్ట్ర కోటా నుంచి తరలించినందున, అందుకు బదులుగా రత్నగిరిలో ఉత్పత్తయ్యే విద్యుత్తును ఆంధ్రప్రదేశ్‌కు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తేవచ్చు. ఈ మేరకు ప్రధానిని విజ్ఞప్తి చేసి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకోవచ్చు. ఇందుకు రాష్ట్ర నాయకులు నడుం బిగించాల్సి ఉంది. all opinions expressed here are mine.. |
   
Conquas
Side Hero Username: Conquas
Post Number: 4489 Registered: 11-2011 Posted From: 99.82.251.78
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Sunday, August 05, 2012 - 09:53 pm: |
    |
తద్వారా, కేంద్రం తాను నిర్దేశించుకున్న నిబంధనలకు తానే పాతరేసింది. రత్నగిరి కావడానికి విద్యుత్ ప్రాజెక్టు అయినా ఎరువుల ప్రాజెక్టు హోదా ఇవ్వడంపై అప్పట్లో ఎవరూ అంత సీరియస్‌గా తీసుకోలేదు. అప్పటి కమిటీ చైర్మన్ ప్రణబ్ ముఖర్జీ, పెట్రోలియం శాఖ మంత్రి మురళీ దేవ్‌రా దీనిపై సుదీర్ఘంగానే చర్చించారు. మూడో ప్రాధాన్యంలో అయితే రత్నగిరికి గ్యాస్ కేటాయింపులు గణనీయంగా తగ్గుతాయి. కానీ, ఈ ప్రాజెక్టు అంతర్జాతీయ ఒప్పందాల్లో భాగంగా ఉండటం.. మహారాష్ట్ర ఒప్పందం కుదుర్చుకోవడం.. కేంద్రం దాన్ని ధ్రువీకరించడంతో గ్యాస్ సరఫరా తప్పనిసరి అయింది. దీంతో, ఎరువుల ప్లాంట్‌తో సమానంగా ప్రాధాన్యం ఇచ్చి గ్యాస్ సరఫరా చేయాలని ఆ సమావేశంలో నిర్ణయించారు. నాలుగేళ్లుగా నాయకుల మౌనవ్రతం సుమారు నాలుగేళ్ల కిందట తీసుకున్న నిర్ణయాన్ని అప్పుడెవరూ తప్పుబట్టలేదు. కానీ, ఇప్పుడది పెద్ద అంతర్రాష్ట్ర సమస్యగా మారింది. అప్పుడు సమస్య కానిది, ఇప్పుడు సమస్య కావడం వెనక ఇతర కారణాలూ ఉన్నాయి. ఇది కేజీ బేసిన్లో గ్యాస్ ఉత్పత్తికి సంబంధించినది. కేజీ బే సిన్‌లో గ్యాస్ నిక్షేపాలు అపారంగా ఉన్నాయని అప్పట్లో అంచనా వేశారు. ట్యాప్ తిప్పితే వంటింట్లోకే గ్యాస్ వచ్చేస్తుందని ఊదరగొట్టారు. మన రాష్ట్రంలో నిక్షేపాలు ఉన్నాయి కాబట్టి నిక్షేపంగా మనకు కావాల్సినంత వాడుకుని.. మిగిలిన దానినే ఇతర రాష్ట్రాలకు ఇవ్వొచ్చు అన్నంతలా ప్రచారం సాగింది. గ్యాస్ పొంగి పొర్లుతుంది కాబట్టి గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్లు కట్టుకోవాలని అప్పట్లోనే కేంద్ర పాలకులు సూచించారు. గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్రాజెక్టులు నిర్మించిన వారికే కేటాయింపుల్లో ప్రాధాన్యం ఇస్తామని ప్రకటించడంతో పలు ప్రైవేట్ సంస్థలు వేల కోట్ల రూపాయల పెట్టుబడితో ప్రాజెక్టులు ఏర్పాటు చేశాయి. కానీ, ఇప్పుడు లెక్క తప్పింది. కారణాలు ఏమైనా.. కేజీ బేసిన్‌లో అనుకున్న మేర గ్యాస్ ఉత్పత్తి జరగడం లేదు. అసలు నిక్షేపాలు లేవా? లేక ధరల పెంపు జరిగాక ఉత్పత్తి పెంచుకోవటం కోసమే రిలయన్స్ సంస్థ వ్యూహాత్మకంగా ఉత్పత్తిని తగ్గించిందా? దీనిపై రకరకాల వాదనలున్నాయి. ఏదైతేనేం, గ్యాస్ ఉత్పత్తి తగ్గింది. మన వాటా కూడా పడిపోయింది. మరోవైపు, తన వాటాగా రావాల్సిన 8.5 ఎంఎంఎస్‌సీఎండీ గ్యాస్‌ను పూర్తిగా ఇవ్వాల్సిందేనని కేంద్రంపై రత్నగిరి ఒత్తిడి పెంచింది. అయినా, కేంద్ర ప్రభుత్వం గత 11 నెలలుగా దానిని పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్‌కు 3.48 ఎంఎంఎస్‌సీఎండీ గ్యాస్‌ను సరఫరా చేస్తూ వచ్చింది. అయితే, అటు మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి, వాటా ప్రకారం కేటాయింపుపై కంపెనీ నుంచి ఒత్తిడి పెరగడంతో పాత ఒప్పందాలకు లోబడి మరో 2 ఎంఎంఎస్‌సీఎండీ గ్యాస్‌ను కేటాయిస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు గత 11 నెలలుగా మన రాష్ట్ర విద్యుత్ ప్లాంట్లకు వస్తున్న గ్యాస్‌లో కోత పడింది. కేజీ బేసిన్లో గ్యాస్ ఉత్పత్తి తొలుత వేసిన అంచనా ప్రకారం ఉన్నా.. ఈ సీజన్‌లో అంచనాల మేరకు జరగాల్సినంత జల విద్యుత్ ఉత్పత్తి జరిగినా ఈ సమస్య వచ్చి ఉండేది కాదు. all opinions expressed here are mine.. |
   
Gandhiguevara
Legend Username: Gandhiguevara
Post Number: 32512 Registered: 10-2009 Posted From: 98.197.251.182
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Sunday, August 05, 2012 - 09:53 pm: |
    |
Dongala rajyam...thu |
   
Conquas
Side Hero Username: Conquas
Post Number: 4488 Registered: 11-2011 Posted From: 99.82.251.78
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Sunday, August 05, 2012 - 09:53 pm: |
    |
తద్వారా, కేంద్రం తాను నిర్దేశించుకున్న నిబంధనలకు తానే పాతరేసింది. రత్నగిరి కావడానికి విద్యుత్ ప్రాజెక్టు అయినా ఎరువుల ప్రాజెక్టు హోదా ఇవ్వడంపై అప్పట్లో ఎవరూ అంత సీరియస్‌గా తీసుకోలేదు. అప్పటి కమిటీ చైర్మన్ ప్రణబ్ ముఖర్జీ, పెట్రోలియం శాఖ మంత్రి మురళీ దేవ్‌రా దీనిపై సుదీర్ఘంగానే చర్చించారు. మూడో ప్రాధాన్యంలో అయితే రత్నగిరికి గ్యాస్ కేటాయింపులు గణనీయంగా తగ్గుతాయి. కానీ, ఈ ప్రాజెక్టు అంతర్జాతీయ ఒప్పందాల్లో భాగంగా ఉండటం.. మహారాష్ట్ర ఒప్పందం కుదుర్చుకోవడం.. కేంద్రం దాన్ని ధ్రువీకరించడంతో గ్యాస్ సరఫరా తప్పనిసరి అయింది. దీంతో, ఎరువుల ప్లాంట్‌తో సమానంగా ప్రాధాన్యం ఇచ్చి గ్యాస్ సరఫరా చేయాలని ఆ సమావేశంలో నిర్ణయించారు. నాలుగేళ్లుగా నాయకుల మౌనవ్రతం సుమారు నాలుగేళ్ల కిందట తీసుకున్న నిర్ణయాన్ని అప్పుడెవరూ తప్పుబట్టలేదు. కానీ, ఇప్పుడది పెద్ద అంతర్రాష్ట్ర సమస్యగా మారింది. అప్పుడు సమస్య కానిది, ఇప్పుడు సమస్య కావడం వెనక ఇతర కారణాలూ ఉన్నాయి. ఇది కేజీ బేసిన్లో గ్యాస్ ఉత్పత్తికి సంబంధించినది. కేజీ బే సిన్‌లో గ్యాస్ నిక్షేపాలు అపారంగా ఉన్నాయని అప్పట్లో అంచనా వేశారు. ట్యాప్ తిప్పితే వంటింట్లోకే గ్యాస్ వచ్చేస్తుందని ఊదరగొట్టారు. మన రాష్ట్రంలో నిక్షేపాలు ఉన్నాయి కాబట్టి నిక్షేపంగా మనకు కావాల్సినంత వాడుకుని.. మిగిలిన దానినే ఇతర రాష్ట్రాలకు ఇవ్వొచ్చు అన్నంతలా ప్రచారం సాగింది. గ్యాస్ పొంగి పొర్లుతుంది కాబట్టి గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్లు కట్టుకోవాలని అప్పట్లోనే కేంద్ర పాలకులు సూచించారు. గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్రాజెక్టులు నిర్మించిన వారికే కేటాయింపుల్లో ప్రాధాన్యం ఇస్తామని ప్రకటించడంతో పలు ప్రైవేట్ సంస్థలు వేల కోట్ల రూపాయల పెట్టుబడితో ప్రాజెక్టులు ఏర్పాటు చేశాయి. కానీ, ఇప్పుడు లెక్క తప్పింది. కారణాలు ఏమైనా.. కేజీ బేసిన్‌లో అనుకున్న మేర గ్యాస్ ఉత్పత్తి జరగడం లేదు. అసలు నిక్షేపాలు లేవా? లేక ధరల పెంపు జరిగాక ఉత్పత్తి పెంచుకోవటం కోసమే రిలయన్స్ సంస్థ వ్యూహాత్మకంగా ఉత్పత్తిని తగ్గించిందా? దీనిపై రకరకాల వాదనలున్నాయి. ఏదైతేనేం, గ్యాస్ ఉత్పత్తి తగ్గింది. మన వాటా కూడా పడిపోయింది. మరోవైపు, తన వాటాగా రావాల్సిన 8.5 ఎంఎంఎస్‌సీఎండీ గ్యాస్‌ను పూర్తిగా ఇవ్వాల్సిందేనని కేంద్రంపై రత్నగిరి ఒత్తిడి పెంచింది. అయినా, కేంద్ర ప్రభుత్వం గత 11 నెలలుగా దానిని పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్‌కు 3.48 ఎంఎంఎస్‌సీఎండీ గ్యాస్‌ను సరఫరా చేస్తూ వచ్చింది. అయితే, అటు మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి, వాటా ప్రకారం కేటాయింపుపై కంపెనీ నుంచి ఒత్తిడి పెరగడంతో పాత ఒప్పందాలకు లోబడి మరో 2 ఎంఎంఎస్‌సీఎండీ గ్యాస్‌ను కేటాయిస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు గత 11 నెలలుగా మన రాష్ట్ర విద్యుత్ ప్లాంట్లకు వస్తున్న గ్యాస్‌లో కోత పడింది. కేజీ బేసిన్లో గ్యాస్ ఉత్పత్తి తొలుత వేసిన అంచనా ప్రకారం ఉన్నా.. ఈ సీజన్‌లో అంచనాల మేరకు జరగాల్సినంత జల విద్యుత్ ఉత్పత్తి జరిగినా ఈ సమస్య వచ్చి ఉండేది కాదు. కానీ.. ఈ రెండూ లేకపోవడంతో పరిస్థితి జటిలంగా మారింది. గతంలో కేంద్రం ఇచ్చిన భరోసా ప్రకారం గ్యాస్ కేటాయింపులు చేసి ఉంటే రాష్ట్రం విద్యుదుత్పత్తిలో మిగులు సాధించి ఉండేది. రాష్ట్ర అవసరాలు పోను మిగిలిన విద్యుత్‌ను అమ్ముకుని సబ్సిడీ భారాన్ని కూడా కొంత తగ్గించుకునే వెసులుబాటు లభించేది. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం విద్యుదుత్పత్తి స్థాపిత సామర్థ్యం 13,923 మెగావాట్లు. అయితే... ప్రస్తుతం కేంద్రం నుంచి వచ్చే విద్యుత్తుతోపాటు రాష్ట్రంలో మొత్తం ఉత్పత్తి 9,251 మెగావాట్లే. డిమాండ్ మాత్రం 11,141 మెగావాట్లు. అంటే డిమాండ్‌కు సరఫరాకు లోటు 1900 మెగావాట్లు. ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు అడుగంటడంతో జల విద్యుదుత్పత్తి అసలు ఏ మాత్రం లేకపోగా.. థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుల్లోనూ బొగ్గు కొరతతో ఉత్పత్తి క్షీణించింది. వీటికితోడు ఇచ్చే అరకొర గ్యాస్‌లోనూ కోతలు పెడుతుండడంతో రాష్ట్రం దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటోంది. ప్రధాని జోక్యం చేసుకుంటేనే..? కేబినెట్‌తో సమానమైన సాధికారిక కమిటీ తీసుకున్న నిర్ణయాలను సమీక్షించే అధికారం పెట్రోలియం శాఖ మంత్రికి ఉండదు. తిరిగి ఎనిమిది మంత్రులతో కూడిన సా«ధికారిక కమిటీలోనే దీనిపై చర్చ జరగాలి. అప్పట్లో ప్రణబ్ చైర్మన్‌గా ఉండగా.. ప్రస్తుతం ఈ కమిటీకి రక్షణ శాఖ మంత్రి ఏకే ఆంటోని నేతృత్వం వహిస్తున్నారు. పెట్రోలియం మంత్రిగా రాష్ట్రానికి చెందిన జైపాల్ రెడ్డి ఉండడంతో ఆయనపై విమర్శనాస్త్రాలు మొదలయ్యాయి. ప్రస్తుత విపత్కర పరిస్థితి నుంచి గట్టెక్కే అంశంపై సీఎం కిరణ్ ఆయనతో సంప్రదింపులు జరిపారు. ఆయన సూచనల మేరకు ప్రధాన మంత్రిని కలిసి తాజా సమస్యను వివరించి రాష్ట్రానికి ఎంతో కొంత ఊరట కలిగేలా చర్యలు చేపట్టాలని సీఎం నిర్ణయించుకున్నారు. ప్రధాని మన్మోహన్‌సింగ్ జోక్యం చేసుకుంటే తప్ప ఈ సమస్య పరిష్కారమయ్యే అవకాశం లేదని చెబుతున్నారు. ముందుంది మొసళ్ల పండగ గ్యాస్ కేటాయింపుల్లో 2 ఎంఎంఎస్‌సీఎండీ తగ్గితేనే ఇంతలా అల్లాడిపోతున్నాం. కానీ.. భవిష్యత్‌ను ఒక్కసారి ఊహించుకుంటే ఎవరికైనా కళ్లు బైర్లు కమ్మాల్సిందే! గ్యాస్ అపారంగా ఉందని భారీగా విద్యుత్ ప్లాంట్లు పెట్టారు. ఆ ప్లాంట్లకు సరిపడా గ్యాస్ ఇప్పట్లో వస్తుందన్న గ్యారెంటీ లేదు. దీనికితోడు మరో భారీ ప్రమాదం పొంచి ఉంది. అదే గ్యాస్ ధర. ఇప్పుడున్న గ్యాస్ ధరను పెంచాలని రిలయన్స్ గత కొంత కాలంగా కేంద్రంపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తోంది. సమీప భవిష్యత్‌లో గ్యాస్ ధర పెంచక తప్పదని నిపుణులు చెబుతున్నారు. అదే జరిగితే విద్యుదుత్పత్తి వ్యయం భారీగా పెరుగుతుంది. ఫలితంగా యూనిట్ వ్యయం కూడా పెరిగి వినియోగదారులపై పెను భారం పడడం ఖాయం. పొంచి ఉన్న ఈ సమస్యను ముందే పరిష్కరించుకోకపోతే ఇప్పుడున్న కరెంట్ బిల్లులు రెట్టింపైనా ఆశ్చర్యం లేదు. మన ముందూ ఉంది ఓ మార్గం! మన గ్యాస్‌ను మహారాష్ట్ర తన్నుకుపోయినా.. మనకు ద్వారాలు మాత్రం మూసుకుపోలేదు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకునేందుకు ఓ మార్గం ఉంది. అదే.. గ్యాస్ బదులుగా విద్యుత్తు ఇవ్వాలని డిమాండ్ చేయడం. రత్నగిరి పవర్ ప్లాంటుకు 2 ఎంఎంఎస్‌సీఎండీ గ్యాస్‌ను మన రాష్ట్ర కోటా నుంచి తరలించినందున, అందుకు బదులుగా రత్నగిరిలో ఉత్పత్తయ్యే విద్యుత్తును ఆంధ్రప్రదేశ్‌కు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తేవచ్చు. ఈ మేరకు ప్రధానిని విజ్ఞప్తి చేసి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకోవచ్చు. ఇందుకు రాష్ట్ర నాయకులు నడుం బిగించాల్సి ఉంది. all opinions expressed here are mine.. |
   
Conquas
Side Hero Username: Conquas
Post Number: 4487 Registered: 11-2011 Posted From: 99.82.251.78
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Sunday, August 05, 2012 - 09:52 pm: |
    |
హైదరాబాద్: కేజీ బేసిన్ నుంచి మన వాటాగా ఇప్పుడు వస్తున్న 3.48 ఎంఎంఎస్‌సీఎండీ గ్యాస్‌లో నుంచి మహారాష్ట్రలోని రత్నగిరి విద్యుత్ కేంద్రానికి 2 ఎంఎంఎస్‌సీఎండీ గ్యాస్‌ను బదిలీ చేశారు. ఇది తీవ్ర అన్యాయంగా మనకు ఇప్పుడు కనిపిస్తున్నా.. ఈ అన్యాయానికి బీజం 2008లోనే పడింది. అంతకు ముందే మహారాష్ట్రలోని దభోల్ ప్రాంతంలో భారీ విద్యుత్ ప్రాజెక్టు నెలకొల్పడానికి అమెరికాకు చెందిన ఎన్రాన్ సంస్థతో మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. అనేక వివాదాల అనంతరం వాజపేయి తొలి విడత ప్రధాన మంత్రిగా ఉన్న హయాంలోనే ఈ ఒప్పందాన్ని సమర్థిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటి ంచింది. కౌంటర్ గ్యారెంటీ కూడా ఇచ్చింది. దాని ప్రకారం, గ్యాస్ ఉత్పత్తి లేక ప్లాంట్లు ఆగిపోతే అందువల్ల ఆ కంపెనీకి కలిగే నష్టాన్ని కేంద్రం చెల్లించాల్సి ఉంటుంది. ఇక 2008 తర్వాత అసలు కథ మొదలైంది. ఈ సమయంలోనే గ్యాస్ కేటాయింపులకు సంబం«ధించి కీలక నిర్ణయం జరిగింది. ప్రణబ్ ముఖర్జీ నేతృత్వంలో ఎనిమిది మంది మంత్రులతో కూడిన సాధికారిక మంత్రుల కమిటీ (ఈజీవోఎం) గ్యాస్ కేటాయింపులపై ప్రాధాన్య క్రమాలను నిర్థారించింది. ఇందులో భాగంగానే 2008 అక్టోబర్ 23న రత్నగిరి పవర్ ప్రాజెక్టుకు గ్యాస్ కేటాయించాలని నిర్ణయించింది. ఇక్కడే అసలు మెలిక ఉంది. గ్యాస్ కేటాయింపుల్లో తొలి ప్రాధాన్యం ఎరువుల తయారీ యూనిట్లకు ఇచ్చారు. రెండో ప్రాధాన్యం వంట గ్యాస్, మూడో ప్రాధాన్యం విద్యుదుత్పత్తికి ఇచ్చారు. అయితే, రత్నగిరి విద్యుత్ ప్లాంట్ అయినా ఎరువుల ప్లాంటు హోదా కల్పించి గ్యాస్ కేటాయింపుల్లో ప్రాధాన్యం ఇచ్చారు. ఈ ప్రాజెక్టుకు కేంద్రం కౌంటర్ గ్యారెంటీ ఇవ్వడం, నష్టాన్ని తానే భర్తీ చేయాల్సి రావడంతో గ్యాస్ కేటాయింపుల్లో తొలి ప్రాధాన్యం ఇచ్చారు. all opinions expressed here are mine.. |
   
Conquas
Side Hero Username: Conquas
Post Number: 4486 Registered: 11-2011 Posted From: 99.82.251.78
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Sunday, August 05, 2012 - 09:51 pm: |
    |
నేటి శాపం నాటి పాపం గ్యాస్ దోపిడీకి 2008లోనే బీజం కేటాయింపులపై ప్రణబ్ కమిటీ నిర్ణయం రత్నగిరి ప్రాజెక్టుకు కేంద్రం కౌంటర్ గ్యారెంటీ మూతపడితే నష్టాన్ని కేంద్రం చెల్లించాల్సిందే అందుకే ఆ ప్లాంటుకు తొలి ప్రాధాన్యం అప్పట్లో పట్టించుకోని మన రాష్ట్ర నేతలు సంక్షోభం ముంచుకొచ్చాక పరస్పర విమర్శలు రాష్ట్రానికి రావాల్సిన గ్యాస్‌ను మహారాష్ట్ర తన్నుకుపోయింది. నిన్న మొన్నటి వరకూ కేంద్ర విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న మరాఠా నేత సుశీల్‌కుమార్ షిండే తన పలుకుబడి ఉపయోగించి గ్యాస్‌ను ఎగరేసుకుపోయారు. అదే సమయంలో, పెట్రోలియం, గ్యాస్ శాఖకు మంత్రి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జైపాల్‌రెడ్డి. మన విద్యుత్ ఉత్పత్తికి గండికొడుతూ మహారాష్ట్ర గ్యాస్‌ను తరలించుకుపోతుంటే మన రాష్ట్రానికి చెందిన మంత్రి ఏమి చేస్తున్నారు? రాష్ట్రం అంధకారం అయిపోతుంటే ముఖ్యమంత్రికి పట్టదా? మన ఎంపీలంతా అసమర్థుల్లా కూర్చుండిపోయారు. ఇవీ.. రాష్ట్రంలో ప్రసుత్తం చెలరేగుతున్న విమర్శలు. ఒక్కటి మాత్రం నిజం! అసలే కరువు ఛాయల నేపథ్యంలో విద్యుత్ కొరతతో సతమతమవుతున్న రాష్ట్ర ప్రజలకు ఇది శరాఘాతమే. రిజర్వాయర్లలో నీళ్లు లేక జల విద్యుత్ దాదాపుగా ఆగిపోయింది. థర్మల్ ప్రాజెక్టులూ అంతంతమాత్రంగా నడుస్తున్నాయి. ఇక మిగిలింది గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్రాజెక్టులే! ఈ ప్రాజెక్టులు అయితే దండిగా ఉన్నాయి. విద్యుదుత్పత్తికి అవసరమైన గ్యాస్ మాత్రం అరకొరగానే ఉంది. ఇందులోనూ ఇప్పుడు సగానికిపైగా కోత పడింది. అచ్చ తెలుగులో చెప్పాలంటే మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టే! మొత్తం విద్యుదుత్పత్తి వ్యవస్థ కుదేలైపోయే పరిస్థితి ఇది. అయితే ఈ సంక్షోభానికి మూలం ఎక్కడ ఉందో తెలుసుకోకుండా పైపై ఆరోపణలు, విమర్శల ద్వారా రాష్ట్రానికి ఒనగూరే ప్రయోజనం ఏమీ ఉండబోదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు ఈ దురవస్థకు కారకులెవరు? మన గ్యాస్‌ను మహారాష్ట్ర ఎందుకు తన్నుకుపోయింది? లోపం ఎక్కడుంది? జైపాల్‌రెడ్డి మీదో, మరొకరి మీదో బాధ్యత నెట్టేసి రాజకీయం చేస్తే పరిస్థితిని చక్కదిద్దేది ఎవరు? మనం ఏమి చేయాలి? ఏమి చేస్తున్నాం!? all opinions expressed here are mine.. |
|