Congress Debba --YSR Schemes ki death Chalanachithram.com | Topics | Search
Hide Clipart | Log Out | Register | Edit Profile

Last 30 mins | 1 | 2 | 4 hours     Last 1 | 7 Days

Chalanachithram.com DB » TF Industry related » Archive through July 26, 2012 » Congress Debba --YSR Schemes ki death « Previous Next »

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Methhanithodugu
Megastar
Username: Methhanithodugu

Post Number: 20012
Registered: 12-2008
Posted From: 117.195.219.53

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Wednesday, July 25, 2012 - 10:59 pm:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)

ika YAKAPA Flag waste emo
...bump for Rajanna Fans not Exclusive J fans
what is your comment on this


Hello world "corruption",Narco Nakko Jagan Intl
Asato ma sad gamaya
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Methhanithodugu
Megastar
Username: Methhanithodugu

Post Number: 20011
Registered: 12-2008
Posted From: 117.195.219.53

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Wednesday, July 25, 2012 - 10:56 pm:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)

* ఇందిరమ్మ పథకం ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా పేదలతోపాటు అన్నివర్గాల వారికి సంతృప్తినిచ్చేలా ఆదుకున్న పథకం. ఈ పథకమూ ప్రభుత్వానిదిగా ప్రజల్లో అభిప్రాయం ఏర్పడడం లేదు. ఈ పథకం కింద నిర్మించిన ఇందిరమ్మ కాలనీల్లో, ఇతరచోట్లా భారీగా ఇందిరాగాంధీ విగ్రహాలను ప్రభుత్వ ఖర్చుతో ప్రతిష్టింపచేయాలి.

* ప్రభుత్వం తమ పట్ల ఎంతో బాధ్యతతో ఉంటోందన్న అభిప్రాయం ప్రజల్లో కలిగించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.

* ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలపై ప్రచారం సాగించి ప్రజల్లోకి చొచ్చుకుపోయేందుకు ప్రత్యేకంగా మీడియాను ఏర్పాటుచేసుకోవాలి. టీవీ చానల్‌ను, పత్రికను పెట్టేందుకు సాధ్యాసాధ్యాలపై ఆలోచించాలి. ఈలోగా మూడు నాలుగు చానళ్లలో పార్టీ, ప్రభుత్వ ప్రచారాలు విరివిగా సాగేలా స్లాట్‌లను కొనుగోలు చేయాలి. ప్రభుత్వం ప్రచురిస్తున్న ఆంధ్రప్రదేశ్ మాసపత్రిక పేజీలను పెంచడంతో పాటు సర్క్యులేషన్ పెంచుకోవాలి.

* ప్రభుత్వం వనరులు, అమలుకు యంత్రాంగం అందుబాటు తదితరాలను అనుసరించి కొత్త పథకాలను ప్రభుత్వం ప్రవేశపెట్టాలి.

* మహిళలను ఆకర్షించేలా తమిళనాడు తాళిబొట్టు పథకం తరహాలో పెళ్లిచేసుకొనే జంటలకు పసుపు కుంకుమ కింద తాళిబొట్టు, పెళ్లి సామగ్రి, అనంతరం జీవనం సాగించేందుకు అవసరమైన సరంజామాను సమకూర్చే పథకం ప్రవేశపెట్టాలి.

* రూపాయికే కిలోబియ్యం తదితర పథకాలకు పేర్లు లేనందున కొత్తపేర్లు పెట్టాలి.

* గర్భిణులకు, బాలింతలకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల అమలులో లోపాలు తొలగించాలి. బాలింతలకు తక్షణమే నగదును అందించాలి. ఇపుడు అందిస్తున్న నగదును పెంచాలి.

* ఆరోగ్యశ్రీకింద సేవలను మరింత విస్తృత పర్చాలి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచి ఆరోగ్యశ్రీని రాష్ట్రంలోని పేదలందరికీ అమలుచేయాలి.

* ఎమ్మెల్యేలను మంత్రులు పట్టించుకోవడం లేదన్న ఫిర్యాదులున్నాయి. ఆ మంత్రులు తమ పనితీరును, వ్యవహార శైలిని మార్చుకోవాలి.

* బీసీలను ఆకర్షించేలా చేతివృత్తులవారిని, గొర్రెల కాపరులు, తదితర వెనుకబడిన వర్గాల వారికి కేటాయిస్తున్న నిధుల్ని భారీగా పెంచాలి. బ్యాంకు కార్పొరేషన్లనుంచి విరివిగా రుణాలు ఇప్పించాలి. ఈ రుణాల మంజూరులో క్లిష్టత లేకుండా సులభంగా ఆయా లబ్ధిదారులకు అందాలి.

* కార్పొరేషన్లు, సంస్థల్లో ప్రతినిధులను నియమించి ప్రజలకు మేలు చేకూర్చాలి.

* ప్రతినెలా సీఎం, మంత్రులు వంద నియోజకవర్గాల్లో పర్యటించి ప్రభుత్వ కార్యక్రమాలను పర్యవేక్షించాలి. పార్టీ శ్రేణులతో చర్చించాలి. దీనికో క్యాలెండర్‌ను రూపొందించాలి.

పార్టీకిచ్చిన సూచనలు ఇవీ...
కాంగ్రెస్‌ను క్షేత్రస్థాయి నుంచి పటిష్టం చేసేందుకు కొత్తగా పంచాయతీ కమిటీలను ఏర్పాటుచేయాలి. గ్రామగ్రామాన పార్టీకి అధ్యక్షులను నియమించడం ద్వారా కిందిస్థాయిలో పార్టీ బలోపేతమవుతుంది. ప్రస్తుత మండల, బ్లాక్, జిల్లా, రాష్ట్ర కమిటీలను పునర్నిర్మించాలి పార్టీకి ప్రజాప్రతినిధులులేని నియోజకవర్గాలకు ఇన్‌చార్జుల్ని నియమించాలి కాంగ్రెస్ సిద్ధాంతాలపై కార్యకర్తలను చైతన్యపరిచేలా శిక్షణ కార్యక్రమాలు చేపట్టాలి.

జాతీయపార్టీగా కాంగ్రెస్ గొప్పతనాన్ని వివరిస్తూనే ప్రాంతీయపార్టీలకు, దానికి ఉన్న తారతమ్యాన్ని వివరించాలి యువజన, మహిళా కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ, కిసాన్‌కాంగ్రెస్ తదితర అనుబంధ విభాగాలన్నిటినీ బలోపేతం చేయాలి మండల, పట్టణ కమిటీలు ప్రతి రెండునెలలకోసారి భేటీ కావాలి. పీసీసీ నిర్దేశించిన అంశంతో పాటు స్థానిక అంశాలపై భేటీలో చర్చించి మినిట్స్‌ను పీసీసీకి పంపించాలి పార్టీ సమావేశాలు నిర్వహించని పార్టీ కమిటీల నేతలను తక్షణమే తప్పించి వేరొకరికి బాధ్యతలు ఇవ్వాలి పార్టీకి నష్టం కలిగించే వారిని గుర్తించి వారిపై చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలి బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల విశ్వాసాన్ని తిరిగి పొందేలా ఒక వ్యూహాన్ని అమలు చేయాలి.

Hello world "corruption",Narco Nakko Jagan Intl
Asato ma sad gamaya
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Methhanithodugu
Megastar
Username: Methhanithodugu

Post Number: 20010
Registered: 12-2008
Posted From: 117.195.219.53

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Wednesday, July 25, 2012 - 10:56 pm:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)

* ప్రస్తుత పథకాలను కాంగ్రెస్‌విగా ప్రజలు భావించడంలేదు
* పార్టీ ముద్రపడేలా ప్రభుత్వం వ్యవహరించాలి
* ప్రచారానికో టీవీ, పత్రిక పెట్టాలి
* ప్రస్తుత చానళ్లలో స్లాట్‌లను కొనుగోలుచేయాలి
* సీఎం, పీసీసీ నేతల మధ్య సమన్వయం అవసరం
* కొత్త జంటలకు పెళ్లికానుకలు
* బాలింతలకు నగదు చెల్లింపులు

హైదరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్రంలో కాంగ్రెస్ బతికిబట్టకట్టాలంటే దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ముద్ర చెరిపేయాల్సిందేనని మంత్రుల కమిటీ తేల్చిచెప్పింది. సంక్షేమ పథకాల విషయంలో వైఎస్ పేరు మరుగున పడేలా ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించాలని, పథకాలపై పార్టీ ముద్ర పడేలా ప్రజలకు తక్షణ ప్రయోజనం చేకూరే కొత్త స్కీములను ప్రవేశపెట్టాలని సూచించింది. ప్రభుత్వం, పార్టీ నిర్వహణలో మార్పులు అవసరమని, ప్రజల్లో నమ్మకం పెంచాలని పేర్కొంది. సీఎం, పీసీసీ అధ్యక్షుడు సమన్వయంతో నడవాలని నొక్కివక్కాణించింది.

ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి నేపథ్యంలో పార్టీ, ప్రభుత్వ పటిష్టతకోసం ధర్మాన నేతృత్వంలో మంత్రుల కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కమిటీ తన ప్రాథమిక నివేదికను బుధవారం సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలకు సమర్పించింది. గాంధీభవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి ధర్మాన ప్రసాదరావుతో పాటు కమిటీ సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ, ఆనం రామనారాయణరెడ్డి, పితాని సత్యనారాయణ, రఘువీరారెడ్డి, బస్వరాజు సారయ్యలు పాల్గొన్నారు. ప్రభుత్వానికి 34, పార్టీకి 17 సిఫార్సులు చేస్తూ నివేదికను ధర్మాన ప్రసాదరావు సీఎంకు, పీసీసీ అధ్యక్షునికి అందించారు.

నివేదికలోని అంశాలపై రెండు మూడు రోజుల్లోనే ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని సీఎం సభ్యులకు చెప్పారు. అందుకు అనుగుణంగా ఎన్‌ఆర్‌ఈజీఎస్ తదితర అంశాలపై కమిటీ చేసిన సిఫార్సుల మేరకు వెంటనే సచివాలయంలో సమీక్షలు నిర్వహించారు. కార్యక్రమానంతరం మంత్రి ధర్మాన ప్రసాదరావు, కన్నా లక్ష్మీనారాయణ, పితాని సత్యనారాయణలు మీడియాతో మాట్లాడారు. వైఎస్ పేరును చెరిపేయాలన్న చర్చ జరిగిందా అన్న ప్రశ్నకు మంత్రి ధర్మాన స్పందిస్తూ ‘‘కార్యక్రమాలు అమలు చేయడమే కాదు. అవి తాను చేస్తున్నట్లుగా ప్రజలను చైతన్యపర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. ఏ ప్రభుత్వానికైనా ప్రజాదరణను చూరగొనడం ముఖ్యమైన అంశం. వైఎస్ పేరును చెరిపేయాలన్న కఠినమైన పదాలను వినియోగించకున్నా కమిటీకి అందిన విస్తృతాభిప్రాయం మేరకు పార్టీకి, ప్రభుత్వానికి తగిన సూచనలు చేశాం’’ అని వివరించారు.

కమిటీ సిఫార్సుల్లో ముఖ్యమైన అంశాలివీ..
* పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల ప్రజాప్రతినిధులు లేక, ప్రభుత్వ యంత్రాంగం సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టక క్షేత్రస్థాయిలో వ్యతిరేకత వస్తోంది. తక్షణమే న్యాయపరమైన చిక్కులను అధిగమించి ఎన్నికలకు వెళ్లాలి.

* ప్రభుత్వ పథకాలు ఆశించిన స్థాయిలో పార్టీకి రాజకీయ ప్రయోజనం చేకూర్చాలి. అవి కాంగ్రెస్ పథకాలుగా ప్రజలను చైతన్యపర్చాలి.

* రాష్ట్ర పథకాలే కాదు కేంద్ర పథకాలు కూడా కాంగ్రెస్ చేస్తున్నవిగా ప్రజలు భావించడం లేదు. ఉదాహరణకు దాదాపు లక్ష కోట్లతో కేంద్రం అమలు చేస్తున్న ఎన్‌ఆర్‌ఈజీఎస్‌లో రాష్ట్రం పదిశాతం భరిస్తోంది. ఈ కార్యక్రమంలో లక్షలాది మంది పేదలు లబ్ధిపొందుతున్నా అది ఈ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమంగా ప్రజలు గుర్తించడం లేదు.


Hello world "corruption",Narco Nakko Jagan Intl
Asato ma sad gamaya

Add Your Message Here
Post:
Bold text Italics Underline Create a hyperlink Insert a clipart image HASH(0x8bc5660){Movie Clipart}
Show / Hide regular icons selection options

Click on following links to open cliparts by Alphabetical Order

 A   B   C   D   E   F   G   H   I   J   K   L   M  

 N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z  

Show / Hide Filmy icons selection options

Click on following links to open cliparts by Alphabetical Order

 A   B   C   D   E   F   G   H   I   J   K   L   M  

 N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z  


Username: Posting Information:
This is a public posting area. Enter your username and password if you have an account. Otherwise, enter your full name as your username and leave the password blank. Your e-mail address is optional.
Password:
E-mail:
Options: Enable HTML code in message
Automatically activate URLs in message
Action: