   
Methhanithodugu
Hero Username: Methhanithodugu
Post Number: 19906 Registered: 12-2008 Posted From: 117.195.196.198
Rating:  Votes: 2 (Vote!) | | Posted on Saturday, July 21, 2012 - 08:38 pm: |
    |
Kadapa People had to pay a premium of price Rs 360 for a Cement bag of lcoal companies which uses people water and resources and its a Syndicated price gauging ... common middle man in kadapa was made to be a beggar and TDP fought for a mini battle Hatsoff Kiran Kumar Reddy and CM Ramesh ..... రాస్ట్రమంతటా‘కడప’ప్రయోగం cమ్fహైదరాబాద్, మేజర్‌న్యూస్: ప్రజాసమస్యల పరిష్కారానికి రాజీలేని పోరాటం చేయాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. స్థానిక సమస్యలపెై ఎక్కడిక్కడే ఉద్యమించాలని తీర్మానించింది. స్థానిక సమస్యలపెై కడప జిల్లా కేంద్రంలో రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ చేసిన అమరణ నిరహారదీక్షకు ప్రభుత్వం దిగి రావడంతో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఇకపెై రాష్టమ్రంతటా ఇదే తరహాలో ప్రజాసమస్యలను ఉద్యమించాలని టీడీపీ యోచిస్తోంది. ప్రభుత్వంపెై ఒత్తిడి పెంచి ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి చేయాలని తాజాగా నిర్ణయిం చింది. కడప జిల్లా సమస్యల పరిష్కారానికి సీఎం రమేష్ చేపట్టిన దీక్షను విజ యవంతం చేసేందుకు పార్టీ నాయకత్వం సైతం వ్యూహాత్మకంగా వ్యవహ రించింది. స్థానిక సమస్యలపెై సిఎం రమేష్ చేసిన అమరణ నిరహారదీక్షకు దన్నుగా నిలిచింది. ప్రతిరోజు పార్టీ ముఖ్యనేతలు దీక్ష శిబిరాన్ని సందర్శించేలా చర్యలు తీసుకుని ప్రభుత్వంపెై ఒత్తిడిని రెట్టింపు చేసింది. పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు, సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు, ఎరన్న్రాయుడుతోపాటు పార్లమెం టరీ పార్టీ నేత నామా నాగేశ్వర్ర్రావు, టీడీఎల్పీ ఉప నేత మోత్కుపల్లి నర్సిం హులు, శాసనసభ్యులు పయ్యావుల కేశవ్, పరిటాల సునీత, లింగారెడ్డి వంటి వారు దీక్ష శిబిరాన్ని సందర్శించి రమేష్‌కు సంఘీభావాన్ని ప్రకటించి ప్రభు త్వాన్ని ఇరుకున పెట్టారు. దీనితో గత్యంతరం లేక ప్రభుత్వం నాలుగు రోజులకే దిగివచ్చింది. మరో నాలుగు రోజుల వ్యవధిలో జిల్లాలోని సమస్యలను పరిష్కా రిస్తామంటూ జిల్లా కలెక్టరే స్వయంగా సీఎం రమేష్ చేత దీక్ష విరమిం పజేశారు.రమేష్ దీక్ష విరమించడమే ఆలస్యం జిల్లా మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి కడప జిల్లాలోని సిమెంట్ కంపెనీ యజమాన్యాలతో సమావేశమై ధరలను సమీక్షించగా, సచివాలయంలో భారీ పరిశ్రమల మంత్రి గీతారెడ్డి సైతం సిమెంట్ కంపెనీల యాజమాన్యంతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. స్థానిక సమస్యల పరిష్కారం కోసం ఇకపెై కడప తరహాలో ఉద్యమించాలని టీడీపీ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రతి జిల్లాలో సమస్యలను ఎంపిక చేసుకుని వాటి పరిష్కారం కోసం ముఖ్యనేతలు ప్రజాఆందోళన చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని యోచిస్తోంది. అందులో భాగంగానే వాన్‌పిక్ భూములను తిరిగి రెైతులకు అప్పగించాలన్న డిమాండ్‌తో దశల వారిగా ఉద్యమాన్ని ఉధృతం చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. రెైతులకు తిరిగి భూములిప్పించే విధంగా కృషి చేయగలిగితే పార్టీకి తిరుగులేని మైలేజ్ లభిస్తుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇన్నాళ్లూ పార్టీకి దూరమైన రెైతన్నలు రానున్న రోజుల్లో దన్నుగా నిలిచే అవకాశముంటుందని ఆశిస్తు న్నారు. అందులో భాగంగానే వాన్‌పిక్ భూ ఒప్పందాన్ని రద్దు చేయాలని కోరుతూ టీడీపీ బృందం శుక్రవారం సాయంత్రం ముఖ్యమంత్రిని కలిసి తమ అధినేత చంద్రబాబు రాసిన లేఖను అందించింది. ఈ నెల 25వ తేదీన ఒంగో లులో రెైతులు, మత్స్యకారులు, రెైతు, ప్రజాసంఘాల ప్రతినిధులతో కలిసి రౌండ్‌టేబుల్‌సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. వాన్‌పిక్ ప్రాజెక్టు కోసం భూములు సేకరించినా గ్రామాలలో మూడు రోజుల పాటు పార్టీ ప్రతిని ధులు పర్యటించేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఈ పర్యటనతో ప్రజలను, రెైతులను చెైతన్యవంతులను చేయవచ్చునని టీడీపీ యోచిస్తోంది. తరువాత ఉద్యమ కార్యచరణను ఖరారు చేసి ప్రభుత్వం మెడలు వంచే దిశగా పోరాటం చేయాలని చూస్తోంది. స్థానిక సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ఇకపెై పార్టీ ముఖ్యనేతలు ప్రజలతో మమేకమై ఉద్యమాలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. కడప ప్రయోగం విజయ వంతం కావడంతో రానున్న రోజుల్లో మరిన్ని ప్రజా ఉద్యమాలు నిర్వహిం చేందుకు ఆ పార్టీ ముఖ్య నేతలు సన్నద్ధమవుతున్నారు. ప్రజాసమస్యల పరిష్కా రాన్ని కోరుతూ ప్రజల మధ్యే ఉండడం ద్వారా తిరిగి పార్టీ పునర్‌వెైభవం సాధి స్తుందని ఆ పార్టీ నాయకత్వం ఆశిస్తోంది. సిఎం రమేష్‌కు యువత అభినందన ఢ్SC_0001హైదరాబాద్, మేజర్‌న్యూస్: సిమెంట్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఐదు రోజుల పాటు నిరహారదీక్ష చేసి ప్రభుత్వం మెడలు వంచి స్పష్టమైన హామీని పొందిన రాజ్యసభ సభ్యుడు సిఎం.రమేష్‌ను తెలుగు యువత, తెలుగునాడు విద్యార్థి సమాఖ్య నేతలు ఆయన నివాసం వద్ద పూలమాల వేసి అభినందించారు. కడప జిల్లాలో అదనపు ధరలకు సిమెంట్ విక్రయించి ప్రజలను దోచుకుంటున్న కంపెనీల బండారాన్ని బయటపెట్టారని కితాబునిచ్చారు. ఈ సందర్భంగా సిఎం. రమేష్ మాట్లాడుతూ పట్టుదలతో ప్రజాసమస్యలపెై పోరాటం చేయడం ద్వారానే ప్రజల మన్నలు చూరగొనవచ్చునన్నారు. తాను పార్టీ అధినేత చంద్రబాబును స్ఫూర్తిగా తీసుకుని నిరహార దీక్ష చేపట్టినట్లు తెలిపారు. యువత కూడా ఇదే తరహాలో పోరాటాలు చేయాలని పిలుపు నిచ్చారు. 2014 ఎన్నికలలో టీడీపీ అధికారం లోకి వచ్చే విధంగా యువత, విద్యార్థులు కృషి చేయాలన్నారు. కష్టించే వారికి టీడీపీలో ఉన్నతస్థానం కల్పించడం ఖాయమన్నారు. సిఎం. రమేష్‌ను కలిసి అభినందించిన వారిలో రాష్ట్ర యువత కార్యదర్శి లంకెల దీపక్‌రెడ్డి, టీఎన్‌ఎస్‌ఎఫ్ కార్యదర్శి దినేష్, భూపాల్‌రెడ్డి, సతీష్ తదితరులున్నారు.  Hello world "corruption",Narco Nakko Jagan Intl Asato ma sad gamaya
|