| Author |
Message |
   
Methhanithodugu
Hero Username: Methhanithodugu
Post Number: 19850 Registered: 12-2008 Posted From: 117.195.201.79
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Wednesday, July 18, 2012 - 11:26 pm: |
    |
 Hello world "corruption",Narco Nakko Jagan Intl Asato ma sad gamaya
|
   
Farmer
Side Hero Username: Farmer
Post Number: 3480 Registered: 03-2012 Posted From: 74.63.112.140
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Wednesday, July 18, 2012 - 11:25 pm: |
    |
Methhanithodugu:
 |
   
Methhanithodugu
Hero Username: Methhanithodugu
Post Number: 19843 Registered: 12-2008 Posted From: 117.195.201.79
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Wednesday, July 18, 2012 - 11:10 pm: |
    |
ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను పునరుద్ధరించి వాటికి రాజ్యాంగపరమైన అధికారాలు కల్పించాలని మరికొందరు ఫిర్యాదుచేశారు. ఇదిలావుంటే పార్టీలో కార్యకర్తలకు కనీస మర్యాదలేకుండా పోతోందని, మంత్రి దగ్గరకు వెళ్లినా పార్టీ కార్యకర్తకు కనీసం ఆదరణ దక్కడంలేదని కమిటీ దృష్టికి ఎమ్మెల్సీ ఎం.ఎస్.ప్రభాకర్ తీసుకెళ్లినట్లు సమాచారం. పార్టీ కోసం జెండా మోసిన కార్యకర్తలకు కాకుండా పైరవీల ద్వారా వచ్చే వారికే పార్టీ, ప్రభుత్వ పదవుల్లో స్థానం దక్కుతోందని ఆయన ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. మరోవైపు మంత్రుల తీరుపై పెద్ద ఎత్తున్న ఫిర్యాదులు వెల్లువెత్తినట్లు సమాచారం. ఏ సమ స్యను తీసుకొని మంత్రి దగ్గరకు తీసుకెళ్లినా కనీసం పట్టిం చుకోవడం లేదని కొందరు ఎమ్మెల్యేలు బాహాటంగానే పేర్కొన్నారు. ఈ పరిస్థితి ఇలాగే ఉంటే ఇక పార్టీ మనగడ ఎలా సాధ్యమవుతుందని వారు ప్రశ్నించారు. మంత్రులు కచ్చితంగా వారి వ్యవహారశైలీ మార్చుకోవాల్సిందేనని స్పష్టంగా చెప్పినట్లు తెలిసింది. నామినేటెడ్ పదవుల భర్తీలో పార్టీలో కష్టపడి పనిచేసిన వారికే స్థానం దక్కాలని సూచించారు. మంత్రులు, విప్‌ల నియోజకవర్గాల్లో నామి నేటెడ్ పదవులు ఇవ్వకుండా పదవులు దక్కని ప్రాంతాలకు ఈ పదవుల్లో పెద్దపీట వేయాలని కోరినట్లు తెలిసింది. మం త్రులు, విప్‌లు ఉన్న చోట పదవులు ఇస్తే ఒకే ప్రాంతానికి ప్రాధాన్యత ఇచ్చినట్లవుతుందని కొందరు ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. వైఎస్ హయాంలో అమల వుతున్న పథకాల పేర్లను మార్చాలని ఎమ్మెల్సీ ఎం.ఎస్. ప్రభాకర్ కోరినట్లు తెలిసింది. మరికొందరు పథకాలలోని లోపాలను ఎత్తిచూపి ఆ పథకాలను రద్దుచేయకుండా లోపాలను సరిచేయాల్సి ఉందని సూచించారు. గిరిజన ఎమ్మెల్యేలు పదకొండు మంది ఉన్నా ఒక మంత్రి పదవి ఇచ్చారని, గిరిజన ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణం కష్టతరమైందని ఎమ్మెల్యే కెవివి సత్యనారాయణ ఫిర్యాదుచేశారు. ఈ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం అంతా స్వ యంగా ప్రభుత్వమే చేపట్టాలని లేని పక్షంలో ఇళ్ల నిర్మాణం పూర్తికాదని చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో డాక్టర్లు సరిగా ఉండటంలేదని ఫిర్యాదుచేశారు. ఆరోగ్యశ్రీ పథకం లో కొన్ని లోపాలు నెలకొన్నాయని, వాటిని సరిచేయాలని మరి కొందరు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. తెలం గాణపై తేల్చాల్సిందేనని, లేని పక్షంలో ఇరు ప్రాంతాల్లో కూడా పార్టీ నష్టపోతుందని ఎమ్మెల్యేలు కిచ్చెన్నగారి లక్ష్మా రెడ్డి, బిక్షమయ్యగౌడ్, లింగయ్య తదితరులు వాదించినట్లు సమాచారం. తెలంగాణ ఇస్తే ఈ ప్రాంతంలో పార్టీ బతుకుతుందని, లేని పక్షంలో సీమాంధ్రలో జగన్, ఇక్కడ ఇతర ఉద్యమ పార్టీలు బలోపేతం అవుతాయని స్పష్టంగా చెప్పినట్లు తెలిసింది. ప్రభుత్వ పథకాలు తమవని జగన్ ప్రచారం చేసుకోవడంవల్లే ఉప ఎన్నికల్లో ఆయనకు కలి సొచ్చిందని కొందరు ప్రస్తావించారు. జగన్‌ను తిప్పికొ ట్టడంలో ఇప్పటికే ఆలస్యం చేశామని, మున్ముందు ఎదు రుదాడి తీవ్రం చేసి ఈ పథకాలు కాంగ్రెస్‌వి అని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పలువురు ఎమ్మెల్యేలు చెప్పారు. మనకూ మీడియా కావాలి... ప్రభుత్వం, మంత్రులు లక్ష్యంగా జగన్ మీడియా దుష్ర్పచారం చేస్తోందని కొందరు ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. వీటిని తిప్పికొట్టే ప్రయత్నం ఇతర మీడియా చేయడం లేదని, అది తమకు సంబంధించింది కాదు అని చెబుతు న్నాయని వారు పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో పీసీసీ తర పున తమకూ ఓ మీడియా ఉంటే మేలన్న అభిప్రాయాన్ని వారు వ్యక్తంచేశారు. 20న మళ్లీ భేటీ-కన్నా పార్టీ, ప్రభుత్వానికి ఇచ్చే నివేదికకు తుదిమెరుగులు దిద్దేందుకు ఈ నెల 20న మరోసారి విశ్లేషణ కమిటీ భేటీ అవుతుందని మంత్రి కన్నా లక్ష్మినారాయణ తెలిపారు. ఈ నెల 21న పార్టీ, ప్రభుత్వానికి నివేదిక ఇస్తామన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నుంచి అభిప్రాయాలు తీసుకోవడంజరిగిందన్నారు. తమ పథకాలను కొందరు తమవిగా హైజాక్ చేసుకొన్నారని చెప్పారు. పథకాలు కాంగ్రెస్‌వి అని ప్రచారం చేసి ప్రజలను తమవైపునకు తిప్పుకొనే ప్రయత్నం చేస్తామన్నారు. End Hello world "corruption",Narco Nakko Jagan Intl Asato ma sad gamaya
|
   
Methhanithodugu
Hero Username: Methhanithodugu
Post Number: 19842 Registered: 12-2008 Posted From: 117.195.201.79
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Wednesday, July 18, 2012 - 11:10 pm: |
    |
బీసీ బాట పడదాం! ఃఅన్డ్-లొగొహైదరాబాద్, మేజర్ న్యూస్: రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న బీసీ వర్గాలకు కాంగ్రెస్ చేరువయ్యే చర్యలు తీసుకోవాలని విశ్లేషణ కమిటీకి ఆ పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు స్పష్టం చేశారు. ఇప్పటికైనా సమయం మించి పోలేదని, బీసీ బాట పట్టాల్సిందేనని చెప్పారు. రెడ్డి, ఎస్సీ, ఎస్టీలు జగన్ వైపు వెళ్లాయని, మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో వందసీట్లు అంటూ టీడీపీ బీసీ వర్గాలకు చేరువయ్యే పరిస్థితి నెలకొందని చెప్పారు. ఇప్పటికైనా పార్టీ నాయకత్వం బీసీ వర్గాలకు చేరువయ్యేందుకు కార్యాచరణను రూపొందించు కోవాలని కోరారు. బీసీలకు వందసీట్లు, ప్రత్యేక బడ్జెట్ అంటూ టీడీపీ ఎన్నికల ప్రణాళికను ఇప్పటికే ప్రకటించిందని, చేనేత కార్మికుల కోసం వై.ఎస్.విజయమ్మ దీక్ష చేపడుతున్నారని చెప్పారు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్‌తో ఉన్న వర్గం ఏదని ప్రశ్నించారు. బుధవారం మినిష్టర్స్ క్వాటర్స్‌లోని క్లబ్‌లో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో విశ్లేషణ కమిటీ భేటీ అయింది. ఈ సమావేశంలో మంత్రులు ధర్మాన ప్రసాదరావు, పితాని సత్యనారాయణ, కన్నా లక్ష్మీ నారాయణ, తోట నర్సింహులు, రఘువీరారెడ్డి, ఆనం రాం నారాయణరెడ్డి, గంటా శ్రీనివాస్, సి.రామచంద్రయ్య, డి.కె. అరుణ, జానారెడ్డి, మహీధర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు నాని, ఎం. రాజేష్, అవంతి శ్రీనివాస్, శ్రీధర కృష్ణారెడ్డి, రాజన్నదొర, కమలమ్మ, కన్నబాబు, అనిల్, ఎ.సురేష్, విజయకుమార్, ఆత్రం సక్కు, పి.రమేష్, ముత్యంరెడ్డి, కె.శ్రీధర్, లింగయ్య, ఆరేపల్లి మోహన్, ఎమ్మెల్సీలు భారతీ రాగ్యనాయక్, ఎం.ఎస్.ప్రభాకర్, కిష్టారెడ్డి, పాలడుగు వెంకట్రావ్, చెంగళ రాయుడు, ప్రేంసాగర్ తదితరులు పాల్గొన్నారు. ‘‘మహిళా సంక్షేమం, ఆరోగ్యపథకాలు, పంచాయతీరాజ్ ఎన్నికలు, ప్రభుత్వ పథకాల ప్రచారం, పథకాలలో పారదర్శకత, గ్రామ స్థాయి నుంచి పీసీసీ స్థాయి వరకు పార్టీ పునర్ నియామకం, నామినేటెడ్ పదవులు, పథకాలపై అవగాహన‘‘ వంటి అంశాలపై ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల అభిప్రాయాలను విశ్లేషణ కమిటీ సేకరించింది. ఈ సందర్భంగా బీసీ అంశం, తెలంగాణ, సీమాంధ్రలో జగన్ ప్రభావంపైనే ఎక్కువగా చర్చ సాగినట్లు తెలిసింది. మంత్రుల తీరుబాగోలేదంటూ పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నేరుగా ధ్వజమెత్తినట్లు సమాచారం. కార్యకర్తల పట్ల పార్టీలో జరుగుతున్న వివక్షపై కూడా పెద్ద ఎత్తున్న గళం విప్పినట్లు తెలిసింది. విప్ అనిల్, ఎమ్మెల్యే బిక్షమయ్యగౌడ్‌తోపాటు పలువురు నేతలు బీసీల గురించి బలంగా గళమెత్తినట్లు సమాచారం. పార్టీకి అండగా ఉండే ఎస్సీ, ఎస్టీ, రెడ్డి వర్గాలు జగన్‌తో వెళ్లాయని, ఇక మిగిలిన బీసీలను కూడా టీడీపీ వందసీట్లు, ప్రత్యేక బడ్జెట్ పేరుతో ఇప్పటికే గాలం వేసిందని అనిల్ చెప్పినట్లు సమాచారం. మొన్నటి ఉప ఎన్నికల్లోనే ఏ పార్టీకి ఏ వర్గం అండగా ఉందనే అంశంతోపాటు కాంగ్రెస్‌కు ఎవరు ఉన్నారు అన్నది కూడా తేలిపోయిందని అయన చెప్పారు. పరకాల ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి ఐదువేల ఓట్లు రావడంతోనే పార్టీ పరిస్థితి ఏమిటో తేలిపోయిందని కొందరు నేతలు ప్రస్తావించారు. కాంగ్రెస్ ఎంత బలహీనమైన అభ్యర్థిని నిలబెట్టినా పార్టీకి ఉన్న ఓటు బ్యాంకు రీత్యా కనీసం ఇరవై ఐదువేల ఓట్లన్నా వస్తాయని అనుకున్నామని, అందుకు భిన్నమైన ఫలితాలు వచ్చాయని చెప్పారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో గణనీయంగా ఉన్న బీసీ సామాజిక వర్గానికి చేరువయ్యేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. చేనేత కార్మికులు ఇప్పటికే ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని వారికి కేంద్ర నిధులు ద్వారా అందుకొంటే పార్టీకి మేలుజరుగుతుందని ఓ నేత వ్యాఖ్యనించారు. గీత కార్మికులను కూడా ఆదుకోవాల్సి ఉందని ఎమ్మెల్యే బిక్షమయ్యగౌడ్ కమిటీ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పోరేషన్లకు నిధులు పెంచి, ఆ సంస్థల నుంచి నేరుగా రుణాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కమిటీకి తెలియజేశారు. బ్యాంకులపై రుణాలకు ఆధారపడకుండా చూడాలని కోరారు. part1 Hello world "corruption",Narco Nakko Jagan Intl Asato ma sad gamaya
|
   
Methhanithodugu
Hero Username: Methhanithodugu
Post Number: 19841 Registered: 12-2008 Posted From: 117.195.201.79
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Wednesday, July 18, 2012 - 11:08 pm: |
    |
 Hello world "corruption",Narco Nakko Jagan Intl Asato ma sad gamaya
|
|