| Author |
Message |
   
Methhanithodugu
Hero Username: Methhanithodugu
Post Number: 19636 Registered: 12-2008 Posted From: 117.213.231.85
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Tuesday, July 10, 2012 - 12:13 pm: |
    |
తాను పార్టీకి సేవ కుడినని, పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడమే ఎన్టీఆర్‌కు ఇచ్చే నిజమైన నివాళి అని డెైలాగులు కొట్టిన జూనియర్ తొలిసారి మీడియాతో మాట్లాడిన సమయంలో జగన్ పార్టీని పల్లెత్తు మాట అనకపోవడం బట్టి ఎన్టీఆర్ భవిష్యత్తు వ్యూహమేమిటన్నదీ అర్ధమవుతోందని చెబుతు న్నారు. అటు కొడాలి జెైలులో జగన్‌ను కలిసిన వెంటనే, ఇటు ఎవరూ చెప్పకుండానే ఎన్టీఆర్ హుటాహుటిన మీడి యా సమావేశం ఏర్పాటుచేయటం భుజాలు తడుము కోవడం మాదిరిగానే ఉందని చెబుతున్నారు. గతంలో చాలాసార్లు నారా, నందమూరి కుటుంబాల మధ్య విబేధా లపెై కథనాలు వచ్చినా ఖండించని ఎన్టీఆర్.. ఇప్పుడు కొ డాలి వ్యవహారంపెై వెంటనే స్పందించడం అనేక అనుమా నాలకు తావిస్తోంది. పార్టీ నాయకత్వంపెై ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలపెై పార్టీ వర్గాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. పార్టీ నాయకత్వాన్ని మార్చాలని కోరుకుంటున్నారా అన్న విలేక రుల ప్రశ్నకు నాయకత్వ మార్పు అన్నది మీరో నేనో అను కుని చేసేది కాదని, అంతా కలసి కూర్చుని తీసుకోవలసిన నిర్ణయమన్న ఎన్టీఆర్ వ్యాఖ్యపెై సీనియర్లు మండిపడుతున్నారు. తనకు రాజకీయాలు తెలియవని అమాయకంగా చెబుతున్న ఎన్టీఆర్ కు.. నాయకత్వ మార్పు గురించి మాట్లాడే స్థాయి, అర్హత లేదంటున్నారు. అంటే.. ఎన్టీఆర్ మనసులో బాబును పార్టీ నాయకత్వం నుంచి తప్పించాల ని ఉన్నట్టే స్పష్టమవుతోందని విశ్లేషిస్తున్నారు. ఆ రకంగా ఎన్టీఆర్ తన మనసులోని కోరికను చెప్పకనే చెప్పారంటు న్నారు. ఎన్టీఆర్ మీడియా భేటీ వెనుక చాలా పెద్ద వ్యూహ మే దాగుందని పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు. నాయకత్వం మార్పు అనేది అంతా కలసి తీసుకునే నిర్ణయమని చెప్ప డం, తాను తుది శ్వాసవరకూ పార్టీలోనే ఉంటానని, తన కు బాబు, బాలయ్య, తండ్రి హరికృష్ణతో విబేధాలు లేవని చెప్పుకోవడం అందరి దృష్టి మరల్చడంతో పాటు, తాను అమాయకుడినని చెప్పుకునే ఎత్తుగడ కూడా ఆయన ప్రక టన వెనుక ఉందని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. నాని పార్టీకి తిరిగి రావాలని చెబుతారా అన్న ప్రశ్నకు.. పునరా లోచించుకోవాలని కోరుతున్నా అని నవ్వుతూ బదులిచ్చా రు. పార్టీకి ఎన్టీఆర్ ఎంత అవసరమో, ఆయనకూ పార్టీ అవసరమూ అంతకంటే ఎక్కువ ఉన్న విషయాన్ని మర్చిపో కూడదని పలువురు సీనియర్లు స్పష్టం చేస్తున్నారు. ‘మేము ఎన్టీఆర్ అంతటి ఇమేజ్ ఉన్న నాయకుడు లక్ష్మీపార్వతి మాయలో పడి పార్టీని భూస్థాపితం చేసే పరిస్థితినే ఎదు ర్కొన్నాం. అప్పుడు మేము తిరుగుబాటు చేయబట్టే ఇప్పు డు పార్టీని కాపాడుకోగలిగాం. ఆనాడు బాబు ముందుకు రాకపోతే మాలో ఒకరు నాయతక్వం వహించేవారు. అం తపెద్ద జనాకర్షణ ఉన్న ఎన్టీఆర్‌కే మేము భయపడలేదు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్లకు భయపడే సమ స్యే లేదు. అసలు పార్టీ సినిమా వాళ్లను పక్కకుపెట్టాలి. గతంలో జయప్రద, రోజా, మోహన్‌బాబును అందల మెక్కించారు.సరే మోహన్‌బాబంటే ఆనాడు మాకు అండగా నిలి చారు. సినిమా వాళ్ల వల్ల ఇలాంటి తలనొప్పే తప్ప ఉప యోగం లేదు. మా సార్ ఎందుకో సినిమా వాళ్లంటే ఎక్కువ ఆసక్తి చూపిస్తార’ని పొలిట్‌బ్యూరో సభ్యుడొకరు వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ పార్టీలో చేరకపోయినా వచ్చే నష్టమేమీ లేదని, ఇప్పుడు సినిమావాళ్లను జనం పట్టించు కోవడం లేదని, ఆకర్షణ పనిచేయడం లేదని, చిరంజీవి ఉ పఎన్నికల ప్రచారమే దానికి నిదర్శనమని స్పష్టం చేస్తున్నారు. స శెం Hello world "corruption",Narco Nakko Jagan Intl Asato ma sad gamaya
|
   
Methhanithodugu
Hero Username: Methhanithodugu
Post Number: 19634 Registered: 12-2008 Posted From: 117.213.231.85
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Tuesday, July 10, 2012 - 12:11 pm: |
    |
తెలుగుదేశం పార్టీ నుంచి పెరుగుతున్న వలసల వెనుక జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారా? ప్రస్తు తానికి తాను ఇక్కడే ఉంటూ పార్టీకి సంప్రదాయ వర్గమయిన కమ్మ నేతలను వ్యూహాత్మకంగానే జగన్ పార్టీ వెైపు పంపిస్తున్నారా? తన సన్నిహితుడయిన ఎమ్మెల్యే కొడాలి నాని పార్టీ వీడటం వెనుక జూనియర్ ఆశీస్సులున్నాయా? మరో సన్నిహితుడు వంశీ కూడా త్వరలో జగన్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారా? కోస్తాలో కమ్మ వర్గాన్ని జగన్ పార్టీ వెైపు పంపించడమే అసలు వ్యూహమా? క్లైమాక్స్‌లో జగన్‌తో చేతులు కలుపుతారా? గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని జెైలులో ఉన్న జగన్‌ను కలవడం, ఆ వెంటనే జూనియర్ ఎన్టీఆర్ హుటాహుటిన మీడియాతో భేటీ కావడం వ్యూహాత్మకమేనా? టీడీపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో బీసీలకు హామీలు ప్రకటించిన రోజునే కొడాలి జంప్ కావడం బీసీ హామీలను దృష్టి మరల్చి వాటి ప్రాధాన్యం తగ్గించేందుకేనా?.. తెలుగుదేశం పార్టీ వర్గాల్లో తాజాగా జరుగుతున్న చర్చలివి. తాము అధికారంలోకి వస్తే బీసీలకు ఏమి చేస్తామన్న హామీలను ప్రకటించేందుకు తెలుగుదేశం పార్టీ నాయకత్వం సిద్ధమవుతోన్న వేళ జెైలులో ఉన్న జగన్‌ను కొడాలి నాని కలవడం ఖంగుతినిపించింది. కొద్దిరోజుల క్రితం చంద్రబాబునాయుడును కలిసి కొడాలి నాని కొద్దిగా వెనక్కి తగ్గినట్లు కనిపించినా, ఆయన జగన్ పార్టీలో చేరడం ఖాయమన్న విషయం పార్టీ నేత లకూ స్పష్టంగా తెలుసు. వంశీ కూడా ఇవ్వాళ కాకపోతే రేపయినా ఆ గూటికి చేరతారన్న దానిపెైనా స్పష్టమైన అం చనా లేకపోలేదు. కానీ, బీసీలకు హామీలు ఇచ్చే రోజునే ఇలాంటి సంఘటన జరగడం బట్టి.. బీసీలకు హామీ వ్యవ హారానికి మీడియాలో పెద్దగా ప్రచారం దక్కనీయకుండా, అందరి దృష్టి మళ్లించేందుకు వ్యూహాత్మకంగా వేసిన అడు గేనన్న అనుమనాలు వ్యక్తమవుతున్నాయి. కొడాలి విశ్వాస ఘాతుకానికి ఒడిగట్టారంటూ కృష్ణా జిల్లా నేతలంతా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటుచేస్తే.. పార్టీ కార్యాలయంలోనే ఉన్న విజయవాడ నగర అధ్యక్షుడు వల్ల భనేని వంశీ మాత్రం రాకపోవడం చర్చనీయాంశమయింది. కొద్దిరోజుల క్రితం విజయవాడ వచ్చిన జగన్‌ను వంశీ ఆలింగనం చేసుకోవడం వివాదాస్పదమయిన విషయం తెలిసిందే. ఆయన కూడా త్వరలోనే జగన్ పార్టీ తీర్థం తీసుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అటు కొడాలి నాని, ఇటు వల్లభనేని వంశీ ఇద్దరూ జూనియర్ ఎన్టీఆర్‌కు అత్యంత సన్నిహితులన్న విషయం తెలిసిందే. సోమవారం మీడియాతో మాట్లాడిన ఎన్టీఆర్ సైతం నాని తనకు సన్నిహి తుడేనని అంగీకరించడం ప్రస్తావనార్హం. కొడాలి నాని, వంశీ హైదరాబాద్‌కు ఎప్పుడు వచ్చినా తప్పనిసరిగా ఎన్టీ ఆర్‌ను కలుస్తారన్నది బహిరంగ రహస్యం. పార్టీకి సంబం ధించిన విషయాలను ఆయనతో చర్చిస్తుంటారు. అసలు ఎన్టీఆర్‌కు చెప్పకుండా వారిద్దరూ ఏమీ చేయరని పార్టీ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. కొడాలి జంప్ వెనుక జూని యర్ ఎన్టీఆర్ దన్ను ఉందన్న అనుమానాలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. పార్టీలో తన కుటుంబానికి ప్రాధాన్యం ఇవ్వడం లేదన్న ఆగ్రహాన్ని ఎన్టీఆర్ ఈ విధంగా చూపిస్తు న్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అసలు జూనియర్ ఎన్టీఆరే కోస్తాలోని కమ్మ సామాజికవర్గ నాయకులను ఒక్కొక్కరిని జగన్ పార్టీ వెైపు పంపిస్తున్నారని, ప్రధానం గా.. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన కమ్మ సామాజికవర్గ నాయకులను జగన్ పార్టీలో చేర్పించే రహ స్య అజెండా ఒకటి రూపొందించినట్లు పార్టీ వర్గాలు చెబు తున్నాయి. అంటే చంద్రబాబునాయుడుపెై కమ్మ వర్గంలో విశ్వాసం లేదన్న సంకేతాలతో పాటు, టీడీపీని ఆ వర్గం విడిచిపెట్టాలన్న ఎత్తుగడ అందులో ఉన్నట్లు పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. సొంత సామాజికవర్గం అండ లేకపోతే టీడీపీ ఉనికి కోల్పోతుందన్న వ్యూహం కూడా దానిలో లేకపోలేదంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ చివరకు జగన్ తో చేతులు కలపక తప్పదని మరికొందరు జోస్యం చెబు తున్నారు. గతంలో లోకేష్ నిర్వహణలో ఉన్న ‘స్టుడియో ఎన్’.. జూనియర్ ఎన్టీఆర్ అజమాయిషీలోకి వెళ్లిన తర్వా త పార్టీకి వ్యతిరేకంగా వస్తున్న వార్తా కథనాలను తమ వాదనకు మద్దతుగా వివరిస్తున్నారు. తానే టికెట్ ఇప్పిం చిన కొడాలి నాని.. జెైలులో ఉన్న జగన్‌ను కలిస్తే ఎన్టీఆర్ దానిని తప్పుపట్టకపోగా, దానిని ప్రశ్నించే నెైతిక హక్కు తనకు లేదని చెప్పడం బట్టి ఎన్టీఆర్ భవిష్యత్తు వ్యూహ మేమిటో స్పష్టమవుతోంద ంటున్నారు. పార్టీ మళ్లీ అధికా రంలోకి రావాలని, తెలుగుజాతి ఉన్నంతవరకూ టీడీపీ ఉంటుందని చెప్పే ఎన్టీఆర్.. తనకు అత్యంత సన్నిహితుడ యిన కొడాలి నాని పార్టీ గీత దాటితే కనీసం నచ్చ చెప్పే ప్ర యత్నం కూడా చేయలేదని, అదేవిధంగా గతంలో జగన్ ను ఆలింగనం చేసుకున్న తన మరో సన్నిహతుడు వల్లభనే ని వంశీని కనీసం మందలించని విషయాన్ని తమ వాదన కు మద్దతుగా వినిపిస్తున్నారు. వారిద్దరికీ హరికృష్ణ, ఎన్టీ ఆర్ సిఫార్సు మేరకే టికెట్లు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తు న్నారు. తన కుమారుడికి ప్రాధాన్యం ఇవ్వడం లేదని జూని యర్ తండ్రి హరికృష్ణ సైతం గత మహానాడులో రుసరుస లాడిన విషయం తెలిసిందే. కొడాలి నాని సోమవారం జగన్‌ను జెైలులో కలసిన వెంటనే ఎన్టీఆర్ మీడియాతో హుటాహుటిన భేటీ అవడం వ్యూహాత్మకమేనంటున్నారు. నాని వెనుక తాను లేనని ఖండించిన ఎన్టీఆర్.. ఆయన పార్టీ గడప దాటకుండా తానెలాంటి ప్రయత్నం చేసిందీ వివరించలేదు. నాని చర్యను తప్పు కూడా పట్టలేదు. ఆయ న సొంత వ్యవహారమని, దాని గురించి మాట్లాడే నెైతిక అర్హత తనకు లేదని, నానికి పార్టీలో ఏమి సమస్యలు న్నాయో మీరే ఆయనను అడగండని వ్యాఖ్యానించారు. అంటే పార్టీలో సమస్యల వల్లే నాని పార్టీని వీడారని ఎన్టీ ఆర్ చెప్పకనే చెప్పారు. గతంలో జగన్‌ను ఆలింగనం చేసు కున్న తన మరో సన్నిహితుడు వల్లభనేని వంశీ చర్యను కూడా ఎన్టీఆర్ ఇప్పటివరకూ కనీసం తప్పుపట్టకపోవ డాన్ని పార్టీ వర్గాలు గుర్తు చేస్తున్నాయి.
   Hello world "corruption",Narco Nakko Jagan Intl Asato ma sad gamaya
|
|