   
Methhanithodugu
Hero Username: Methhanithodugu
Post Number: 17924 Registered: 12-2008 Posted From: 117.195.212.40
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Sunday, June 03, 2012 - 03:17 am: |
    |
chaavu debba kottina OT philosophy Chathikila padda YSRCP OT inception is this BOOMERANG బూమరాంగ్? (సూర్య ప్రధాన ప్రతినిధి, హైదరాబాద్):‘‘ ఆరోజు వాతావరణం బాగోలేదని చెప్పి వారించినా ఆయన వినలేదు. ఆ తర్వాతే హెలికాప్టర్ దుర్ఘటన జరిగింది’’ - ఇడుపులపాయ ప్లీనరీ సమావేశంలో వైకాపా గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ ‘‘ రాజశేఖరరెడ్డి గారి మరణంపై నాకు ఇప్పటికీ అనుమానాలున్నాయి’’ - కొడుకు జగన్‌ను అరెస్టు చేసిన రోజు ధర్నా సందర్భంగా విజయమ్మ చేసిన వ్యాఖ్య. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ దుర్ఘటనలో మృతి చెంది వెయ్యి రోజులు దాటినా ఆయన మృతి చెందిన వైనం కుటుంబానికి, ప్రత్యర్ధి పార్టీలకు ఆ అంశం ఒక ఆయుధంగా మారింది. వైఎస్ మృతిపై తనకు అనుమానాలున్నాయంటూ ఉప ఎన్నికల ప్రచారంలో విజయమ్మ చేస్తున్న ప్రచారం వల్ల తమకు సానుభూతి ఓట్లు పెరుగుతాయని వైకాపా నేతలు అంచనా వేస్తున్నారు. అయితే ఆ ప్రచారం వికటించి అసలుకే ఎసరు వచ్చేలా ఉందని సొంత పార్టీ నేత ల్లో కొత్త ఆందోళన మొదలయింది. వైఎస్ పేరు చెప్పి సానుభూతి ఓట్లు సాధించుకోవాలన్న ఎత్తుగడను కాంగ్రెస్-టీడీపీ తిప్పికొట్టడంతో పాటు, అసలు దాని వెనుక కుటుంబసభ్యుల కుట్ర ఉందన్న ఎదురుదాడి ప్రచారం క్షేత్రస్ధాయికి చేరితే సానుభూతి కథ అడ్డం తిరిగే ప్రమాదం లేకపోలేదన్న ఆందోళన వైకాపా నేతల్లో వ్యక్తమవుతోంది. వైఎస్ మృతి చెందిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా స్వయంగా క్యాంపు కార్యాలయానికి వచ్చి విజయమ్మను పరామర్శించిన సందర్భంగా ఆ అనుమానాన్ని సోనియా వద్ద ఎందుకు ప్రస్తావించలేదని కాంగ్రెస్ నేతలు ఎదురుదాడి మొదలుపెట్టడంతో వైకాపా ఆత్మరక్షణలో పడవలసి వచ్చింది. ఇడుపులపాయ ప్లీనరీలో వాతావరణం సక్రమంగా లేనందుకే తన భర్త మృతి చెందారని చెప్పిన విజయమ్మ, ఆయన మృతిపై అనుమానాలు ఉన్నాయనడం కేవలం సానుభూతి రాజకీయమేనని విరుచుపడుతున్నారు. పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ, కాంగ్రెస్ నేతలు తులసిరెడ్డి, వీరశివారెడ్డి, ఎంపీ ఉండవల్లి, రేణుకాచౌదరి, ఎంపీ లగడపాటి, మంత్రి కోండ్రు మురళి తదితరులు వైఎస్ మృతి వెనుక కుటుంబసభ్యుల కుట్ర ఉందని, అందుకే ఆయన చనిపోయిన వెంటనే జగన్‌ను సీఎం చేసేందుకు సంతకాల సేకరణ చేశారని విరుచుకుపడుతున్నారు. అదేవిధంగా, జగన్ ఎంపీగా ఉండి పార్లమెంటులో వైఎస్ మృతిపై ఎందుకు మాట్లాడలేదని ఉండవల్లి ప్రశ్నించడంతో విజయమ్మ ఆత్మరక్షణలో పడవలసి వచ్చింది. ఉండవల్లి లేవనెత్తిన ప్రశ్నకు ఇంతవరకూ వైకాపా శిబిరం నుంచి జవాబు లేకపోవడం, వైఎస్ మృతికి కుటుంబసభ్యులే కారణమని బొత్స నేరుగా దాడి చేయడం చర్చనీయాంశమయింది. దానితో కాంగ్రెస్ నేతలు తమ ప్రచారంలో ఆయన ఆరోపణలే అనుసరిస్తుండటంతో అది సహజంగానే క్షేత్రస్ధాయికి వెళ్లింది. కాంగ్రెస్ నేతల ఎదురుదాడికి సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండటంతో వైకాపా శిబిరం ఆత్మరక్షణలో పడినట్లు స్పష్టమవుతోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. వైఎస్ మృతి చెందిన తర్వాత జగన్‌ను ముఖ్యమంత్రిని చేసేందుకు సంతకాల సేకరణ చేయించినప్పుడే అనుమానం వచ్చిందని, దానిపై విచారణ జరపాలని టీడీపీ కూడా ఎదురుదాడికి దిగింది. వైఎస్ మృతిని రాజకీయం చేస్తున్నారని, శవరాజకీయాలు, సానుభూతి రాజకీయాలు వైఎస్ కుటుంబానికే చెల్లిందని టీడీపీ ప్రచారం చేస్తోంది. కొడుకు అరెస్టు అయిన రోజునే విజయమ్మ వైఎస్ మృతిపై అనుమానం వ్యక్తం చేయటం బట్టి భర్త మృతి, కొడుకు అరెస్టును అడ్డుపెట్టుకుని సానుభూతి రాజకీయాలు చేస్తున్నట్లు స్పష్టమవుతోందని టీడీపీ నేతలు కోడెల, బాబూ రాజేంద్ర ప్రసాద్, వర్ల రామయ్య ప్రచారం చేస్తున్నారు. నిజానికి, వైఎస్ మృతిపై అను మానాల అంశాన్ని విజయమ్మ ఇప్పుడు ప్రస్తావించకుండా ఉంటే బాగుండేదన్న అభిప్రాయం అటు వైకాపా శ్రేణుల్లోనూ వ్యక్తమవుతోంది. వైఎస్ మృతి ప్రస్తావించక ముందు వరకూ రాజకీయ వాతావరణం తమకే అనుకూలంగా ఉందని వైకాపా నేతలు తమ అంతర్గత సంభాషణల్లో స్పష్టం చేస్తున్నారు. కానీ వైఎస్ మృతిపై అనుమానాలున్నాయని విజయమ్మ ఎప్పుడయితే ప్రస్తావించారో.. దానిపై కాంగ్రెస్-టీడీపీ నుంచి అనూహ్య స్థాయిలో ఎదురుదాడి మొదలయిందని, దానిని తాము ఊహించలేదని నేతలు చెబుతున్నారు. వైఎస్ మృతిపై విజయమ్మ మాట్లాడితే సానుభూతి భయంతో దానిపై ఎవరూ మాట్లాడరని తాము అంచనా వేశామని, కానీ అందుకుని భిన్నంగా మూకుమ్మడి ఎదురుదాడి జరుగుతుండటంతో మౌనంగా ఉండవలసి వస్తోందని వాపోతున్నారు. వైఎస్ మృతి ఘటనను ప్రస్తావించిన వెంటనే అందుకు వైఎస్ కుటుంబ కుట్రనే కారణమని కొందరు, వైఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్‌ను సీఎంను చేయాలని కుటుంబం ఒత్తిడి చేసిందని మరికొందరు, అప్పుడు వాతావరణం బాగోలేకనే దుర్ఘటనలో మృతి చెందారని చెప్పి.. ఇప్పుడు ఉప ఎన్నికల సమయంలో మృతిపై అనుమానాలున్నాయని చెప్పడంతో ఈ అంశాలన్నీ సహజంగా ప్రజల్లో చర్చనీయాంశమవుతున్నాయని వైకాపా నేతలు చెబుతున్నారు. వైఎస్ మృతిని కేవలం ఉప ఎన్నికల్లో లబ్ధి కోసమే ప్రస్తావిస్తున్నామన్న భావన ప్రజల్లో బలపడుతోందని అంగీ రిస్తున్నారు. దీనిపై తాము అనవసరంగా తొందరపడి నట్టయిందని, ఇకన యినా తమ నాయకురాలు విజయమ్మ ఆ అంశాన్ని ప్రస్తావించకుండా ఉంటే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. Raina bheet jaaye
|