   
Methhanithodugu
Hero Username: Methhanithodugu
Post Number: 16452 Registered: 12-2008 Posted From: 117.195.218.241
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Wednesday, April 04, 2012 - 03:34 pm: |
    |
Bridge that connects Mahaboob Nagar & Rayala Seema Viciously reduces the distance Hyd to kurnool/ kadapa etc 16.040864,78.333206 very scenic beauty of inwaters of krishna we are missing a beautiful opportunity .... all in vain not now may be in cpl of decades .... Its Jagans duty to fight for YSR true legacy but he interested only in Odarpu yatras ... సింగవటం జల మృత్యు ఘోషకు ఐదేళ్లు ఆత్మకూరు టౌన్, మేజర్‌న్యూస్ :ఆంధ్ర రాష్ట్రంలోని కృష్ణానది చరిత్రలో ఇప్పటి వరకు జరుగని ఘోరకలి ఐదేళ్ళ క్రితం ఆత్మకూరు డివిజన్ నల్లమల ప్రవహించే కృష్ణానది తీరంలో జరిగింది. మహాబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్‌మండలం సింగవటం క్షేత్రంలో జరిగే జాతరకు కర్నూలు జిల్లా నుంచి నాటు పడవలో వెళ్ళిన 61 మంది భక్తులు పుట్టి మునిగి జలసమాదయ్యారు. ఆ సంఘటనకు నేటితో సరిగ్గా ఐదేళ్లు. ఇంతటి ఘోర ప్రమాదం జరిగినా ప్రభుత్వం మాత్రం ఇప్పటికి స్పందించలేదు. అప్పటి అధికార పార్టీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 18-1-2007న సింగవటం జాతరకు వెళ్లే నాటు పడవ మునగడంతో మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు 19-1-2007న నెహ్రునగర్‌కు సాయంత్రం హెలిక్యాప్టర్‌లో చేరుకొని ఓదార్చారు. ఆ సమయంలోనే కర్నూలు - మహాబూబ్ నగర్ జిల్లాల సరిహద్దుల్లో సోమశిల - సిద్దేశ్వరం మద్యన కృష్ణానదిపై రూ. 110 కోట్లతో వంతెన నిర్మాణంను నిర్మిస్తానని హామి ఇచ్చారు. ఆ విధంగానే ఆ అంచనాలను రూ. 120 కోట్లకు పెంచి 2009 ఫిబ్రవరి 13న మహాబూబ్ నగర్ జిల్లా కొల్లాపురంలో వంతెన నిర్మాణానికి అధికారికంగా భూమిపూజ చేశారు. టెండర్లు కూడా అప్పట్లో ఓ దశకు వచ్చాయి. కాని వార్షిక బడ్జెట్‌లో కేటాయింపులో తగ్గడం, అదే ఏడాది వైఎస్సార్ హెలిక్యాప్టర్ ప్రమాదంలో కన్నుమూయడంతో ఈ సిద్దేశ్వరం వంతెన నిర్మాణం ఆనాటి నుంచి ఇప్పటికి అటకెక్కింది. పాలకులు, మంత్రివర్గం , సంబంధిత శాఖలు వంతెన నిర్మాణంను అంచనాలపైనే రూపొందిస్తుంది. తాజాగా 2011-12 వార్షిక బడ్జెట్‌లో రూ. 280 కోట్లను కేటాయిస్తున్నామని న్యాయశాఖమంత్రి ఏరాసు ప్రతాప రెడ్డి అట్టహాసంగా ప్రకటించారు.అంతేకాక రూ. 25 కోట్లు కూడా విడుదలైనట్లు వెల్లడించారు. అయితే ఆ నిధులు ఎక్కడ ఖర్చయ్యాయో ఇప్పటికి కనిపించడం లేదు. యానివిటి విధానంలో కాంట్రాక్టరే వంతెన నిర్మాణానికి అవసరమయ్యే నిధులను భరాయించి ఆ తర్వాత ప్రభుత్వం నుంచి బిల్లులను దశల వారిగా పొందాల్సి ఉంటుందని చెప్పారు. కాని ఈ విధానానికి ఏ ఒక్క కాంట్రాక్టరు కూడా ముందుకు రాకపోగా జలయజ్ఞానికి కేటాయించిన వేల కోట్లాది రూపాయాల నిధులే దారి మళ్లడంతో సిద్దేశ్వరం వంతెన నిర్మాణ ప్రక్రియకు ఏ ఒక్కరు ముందుకు రావడం లేదు. ఇదిలా ఉండగా గత రెండేళ్ళుగా ప్రత్యేక తెలంగాణ వేర్పాటు ఉద్యమంతో రాష్ట్రంలో ప్రభుత్వం పరిస్థితి ఇరకాటంలో పడింది. మంత్రులు, ముఖ్యమంత్రుల మద్య విభేదాలు, రాష్ట్ర పాలన అస్థవ్యవస్థం, ప్రభుత్వ శాఖల ముఖ్య కార్యదర్శులలో అంకితభావం లోపం, రాజకీయ పార్టీల మద్య సయోద్యలేకపోవడం, వీటన్నింటి ప్రభావం సిద్దేశ్వరం వంతెనపై పడింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే కోస్తాంధ్ర తో సంబంధం లేదని తెలంగాణ వాదులు పరోక్షంగా సిద్దేశ్వరం వంతెన నిర్మాణానికి మోకాలడ్డుపెట్టడం గతంలో జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల మొదలు మద్యం ధర, సాధారణ ఎన్నికల వరకు అన్ని పార్టీలతోపాటు అధికార పార్టీకి సిద్దేశ్వరం వంతెన నిర్మాణ హామి గుర్తుకొస్తుంది.ఆ తర్వాత వంతెన నిర్మాణ ప్రక్రియను అటకెక్కిస్తున్నారు. సింగవటం జాతరలో జరిగిన నాటు పడవ సంఘటన తర్వాత ఈ ఐదేళ్ళలో మరో ఐదు స్వల్ప నీటి ప్రమాదాలు జరిగాయి. ఏదేనా ప్రమాదం జరిగితేనే సిద్దేశ్వరం వంతెన నిర్మాణాన్ని చేపడుతామని ప్రభుత్వం ప్రకటనలిస్తుందే తప్ప సింగవటం ఘోరకలి లాంటి ఉపద్రవాన్ని ముందస్తుగా ఎదుర్కొనేందుకు సంగమేశ్వరం వద్ద వంతెన నిర్మాణంను నిర్మించ తలచింటే ఎప్పటికో పూర్తయ్యేది. అంతేకాక హైదరాబాద్ నుంచి కొల్లాపూర్‌మీదుగా సోమశిల, సిద్దేశ్వరం, ఆత్మకూరు, నంద్యాల, తిరుపతి, చెనై్న వరకు ప్రదాన రహదారిని అభివృద్ది పరచడమే కాక తెలంగాణ, రాయలసీమ ప్రాంతాలు అన్ని విధాలుగా ప్రగతి సాధించి ఉండేటివి. 2012-13 ఆర్థిక సంవత్సరంలో కృష్ణానదిపై సిద్దేశ్వరం వంతెన నిర్మాణానికి మరింత బడ్జెట్‌ను కేటాయించనున్నట్లు సమాచారం. ఇలా నాలుగేళ్ళలో వంతెన నిర్మాణ అంచనాలను పెంచుతున్నారే కాని కార్యచరణను మాత్రం ప్రభుత్వం జలసమాది చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వ యంత్రాంగం ఈ బడ్జెట్‌లోనైనా సిద్దేశ్వరం వంతెననిర్మాణం చేపట్టి కృష్ణానదిలో పడవ ప్రమాదాలను నివారించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది.  Golden Spoon |