No Bolls to Fight CM killer - Ambani Chalanachithram.com | Topics | Search
Hide Clipart | Log Out | Register | Edit Profile

Last 30 mins | 1 | 2 | 4 hours     Last 1 | 7 Days

Chalanachithram.com DB » TF Industry related » Archive through April 04, 2012 » No Bolls to Fight CM killer - Ambani « Previous Next »

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Methhanithodugu
Hero
Username: Methhanithodugu

Post Number: 16413
Registered: 12-2008
Posted From: 117.195.219.74

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Wednesday, April 04, 2012 - 07:41 am:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)

Sashem /Complete

పెట్రోలియం శాఖ నారాజ్..
ధర పెంచుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలమవుతుండటం వల్లే... రిలయన్స్ సంస్థ అట్నుంచి నరుక్కొస్తోందని, ఉత్పత్తికి కోత పెడుతోందని పెట్రోలియం శాఖ అనుమానిస్తోంది. ఈ మొత్తం వ్యవహారంపై ఆ శాఖకు చెందిన విధానకర్తలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అవసరమైతే రిలయెన్స్‌తో కుదుర్చుకున్న ఉత్పత్తి విభజన ఒప్పందాన్ని (సీఎస్‌సీ)ని కూడా పునఃసమీక్షించాలని భావిస్తున్నారు.

డీ6 బ్లాక్‌లో ఉత్పత్తి తగ్గినందున... ఈ బ్లాక్‌ను అభివృద్ధి చేయటానికి పెట్టిన ఖర్చు రూ. 9100 కోట్లను తిరిగి ఇవ్వకూడదని చమురు మంత్రిత్వ శాఖ యోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. రిలయెన్స్ చర్యల వల్ల భారత ఇంధన రంగానికి ఏటా రూ.15 వేల కోట్ల నష్టం వస్తోందని రాజ్యసభ సభ్యుడు తపన్‌సేన్ (సీపీఎం)ఆరోపించారు. ఈ నష్టాన్ని నివారించటానికి పెట్రోలియం శాఖ మంత్రి జైపాల్‌రెడ్డితో సహా అనేక మంది ప్రముఖులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.

మళ్లీ అదే వాదన...
గత ఏడాది నవంబర్‌లో అప్పటి పెట్రోలియం శాఖ కార్యదర్శి 2012 ఏప్రిల్ నాటికి రిలయన్స్ అదనంగా తొమ్మిది బావులను తవ్వాలంటూ ఒక లేఖ రాశారు. అదేరోజు రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ ముకేష్ అంబానీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను, ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీని కలిసారు. ఆ తర్వాత నాలుగు రోజులకు రిలయన్స్ ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. "పీఎస్‌సీ ప్రకారం రెవెన్యూ ఆధారంగా పెట్టుబడి పెట్టిన సొమ్మును తిరిగే పొందే అధికారం ఉంది. ఎంత ఉత్పత్తి చేయాలి, ఏయే బావులను ఉపయోగించాలనే విషయానికి సంబంధించి సీఎస్‌సీలో ఎటువంటి అంశాలు లేవు'' అని ఈ ప్రకటనలో పేర్కొంది. రిలయెన్స్ మళ్లీ ఈ వాదననే బలంగా వినిపించే అవకాశముంది.

Golden Spoon
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Methhanithodugu
Hero
Username: Methhanithodugu

Post Number: 16412
Registered: 12-2008
Posted From: 117.195.219.74

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Wednesday, April 04, 2012 - 07:38 am:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)

ఐదేళ్ల తర్వాత ఈ ధరను మరోసారి సమీక్షిస్తామని ఒప్పందంలో సర్కారు పేర్కొంది. అయి తే.... ఇప్పుడు చెల్లిస్తున్న ధర చాలా తక్కువని, దీనిని 14.2 డాలర్లకు పెంచాలని రిలయన్స్ డిమాండ్ చేస్తోంది. ఈ వినతిని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ నేతృత్వంలోని మంత్రుల బృందం ఫిబ్రవరి 24న సమీక్షించింది. ధరను పెంచటానికి నిరాకరించింది. ఈ సమావేశపు మినిట్స్‌ను కేంద్ర కేబినెట్ సెక్రటేరియట్‌కు పంపించింది.

అసలు విషయమేమిటంటే.... ప్రణబ్ నేతృత్వంలో జరిగిన సమావేశపు మినిట్స్ వేరు! కేంద్ర కేబినెట్ సచివాలయం నుంచి వచ్చిన మినిట్స్ సారాంశం వేరు. ఈ విషయాన్ని పెట్రోలియం శాఖ అధికారులే గుర్తించారు. 'ఈ మినిట్స్‌లో తేడా ఉంది. దీనిని సరిదిద్దండి' అని పెట్రోలియం మంత్రిత్వ శాఖ కార్యదర్శి చతుర్వేది- కేంద్ర కేబినెట్ సెక్రటరీ అజిత్‌సేథ్‌కు ఒక లేఖ రాశారు. ఈ లేఖ ప్రస్తుతం సంచలనం రేపుతోంది.

మినిట్స్ మారిందిలా...
"2009లో అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే... రాబోయే ఐదేళ్లకు చెల్లించాల్సిన ధరను నిర్ణయించడం జరిగింది. 2010లోనే కాంట్రాక్టర్లు ధరను పెంచాలని కోరారు. దీనిని సర్కారు తిరస్కరించింది. ఐదేళ్ల కోసం ఈ ధరను నిర్ణయించినందున... అప్పటిదాకా ఇదే ధర అమలులో ఉంటుంది'' అ ని ప్రణబ్ నేతృత్వంలో జరిగిన మంత్రుల బృందం నిర్ణయించింది. ఇదే మినిట్స్‌ను పెట్రోలియం శాఖ కేబినెట్ సెక్రటేరియట్‌కు పంపింది

. అయితే... కేబినెట్ సెక్రటేరియట్ నుంచి మినిట్స్ బయటకు వచ్చేసరికి 'ఐదేళ్ల కోసం ఈ ధర ను నిర్ణయించినందున... అప్పటిదాకా ఇదే ధర అమలులో ఉంటుంది' అనే వాక్యాలు మాయమయ్యాయి. 'సవరించిన' మినిట్స్ ఆధారంగా రిలయన్స్ సంస్థ కోర్టుకు ఎక్కితే... వారికి అనుకూలంగా ఆదేశాలు వచ్చే ప్రమాదముందని పెట్రోలియం శాఖ ఆందోళన చెందుతోంది. వెంటనే... తప్పు సరిదిద్దుకోవాలని కేంద్ర కేబినెట్ సెక్రటేరియట్‌ను కోరింది.

ఒక వేళ గ్యాస్ ధరలను పెం చాల్సి వస్తే... 2014లో మళ్లీ ధరలు సమీక్షించేలోపు రిలయన్స్‌కు రూ. 40,900 కోట్లు అదనంగా చెల్లించాల్సి వస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. అందువల్లే చతుర్వేది వెంటనే స్పందించారని చెబుతున్నారు. "మంత్రుల బృందం ఈ నిర్ణయాన్ని ఎందుకు తీసుకుందనే విషయం కేబినెట్ సెక్రటేరియట్ పంపిన మి నిట్స్‌లో లేదు. ఇది వాస్తవ పరిస్థితిని ప్రతిబింబించటం లేదు'' అని పేర్కొన్నా రు. వాస్తవానికి చమురు మంత్రిత్వ శాఖ రూపొందించిన లీగల్ నోట్ లోనూ ధరలను పెంచాల్సిన అవసరం లేదనే విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నారు.

Golden Spoon
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Methhanithodugu
Hero
Username: Methhanithodugu

Post Number: 16411
Registered: 12-2008
Posted From: 117.195.219.74

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Wednesday, April 04, 2012 - 07:34 am:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)

o pika unte

రిలయన్స్ మాయ
గ్యాస్ ధర పెంపు కోసం కొత్త ఎత్తులు
పెంచేందుకు మంత్రుల కమిటీ ససేమిరా

కేబినెట్ సెక్రటేరియట్‌లో మారిన మినిట్స్
రిలయన్స్‌కు అనుకూలంగా తారుమారు
రెండేళ్లలో రూ.50వేల కోట్లకు టెండర్
గ్యాస్ ఉత్పత్తిలో కోత.. బావుల మూసివేత
రిలయన్స్‌పై పెట్రోలియం శాఖ కన్నెర్ర

హైదరాబాద్, ఏప్రిల్ 3 : గ్యాస్ ఉత్పత్తిని క్రమక్రమంగా తగ్గిస్తూ, బావులను మూసివేస్తూ... రిలయన్స్ ప్రదర్శిస్తున్న 'ముందు చూపు' దేశంలో సంక్షోభాన్ని సృష్టిస్తోంది. ఈ కక్కుర్తి కాసుల కోసమే అని పెట్రోలియం శాఖ వర్గాలు గట్టిగా అనుమానిస్తున్నాయి. పైగా... లాభాల కోసం మంత్రుల సాధికార బృందం సమావేశం 'మినిట్స్'ను కూడా మార్చే స్థాయిలో వ్యూహం నడుస్తోందని చెబుతున్నాయి. గ్యాస్ సరఫరాలో రిలయన్స్ కోత పెట్టడంతో మన రాష్ట్రంలోనే సుమారు 1500 మెగావాట్ల విద్యుదుత్పత్తి పడిపోయింది. మున్ముందు ఈ సంక్షోభం మరింత ముదిరే ప్రమాదం కనిపిస్తోంది. ఈ సంస్థను దారిన పెట్టడమెలా అనే అంశంపై కేంద్రంలో తీవ్రస్థాయిలో తర్జన భర్జనలు జరుగుతున్నాయి.

ఏమిటీ సంగతి 'కేజీ బేసిన్‌లో గ్యాస్ తక్కువగా ఉంది. అందుకే ఉత్పత్తి మందగించింది' అని రిలయన్స్ వాదిస్తోంది. ఇది అవాస్తవమని... భవిష్యత్తులో అధిక ధరలకు అమ్ముకునేందుకే ఇప్పుడు ఉత్పత్తిలో కోత పెట్టినట్లు పెట్రోలియం శాఖ భావిస్తోంది. మన దేశంలో అత్యంత ఎక్కువ గ్యాస్ నిలువలు ఉన్న బ్లాక్ కేజీ బేసిన్‌లోనే ఉంది. 2006లో ప్రభుత్వానికి, రిలయెన్స్‌కు మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం... 2011 ఏప్రిల్ నాటికి కంపెనీ ప్రతి రోజూ 22 బావుల నుంచి 61.88 మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్స్ (ఎంఎంఎస్‌సీఎండీ) గ్యాస్‌ను వెలికి తీయాలి. ఏప్రిల్ నుంచి ఉత్పత్తిని 80 మిలియన్ ఎంఎంఎస్‌సీఎండీలకు పెంచాలి.

బావుల సంఖ్య కూడా 22 నుంచి 31కి పెరగాలి. కానీ, రిలయన్స్ తీరు 'నానాటికీ తీసికట్టు'గా మారుతోంది. ఉత్పత్తి పెంచడం మాట అటుంచి... ఇప్పటికే కొన్ని బావులను మూసేసింది. ఇతర బావుల నుంచి ఉత్పత్తిని గణనీయంగా తగ్గించింది. ఇలా మిగుల్చుకున్న గ్యాస్‌ను భవిష్యత్తులో ఎక్కువ ధరకు విక్రయించుకోవాలన్నదే రిలయన్స్ వ్యూహమని భావిస్తున్నారు. ఎందుకంటే... ప్రస్తుతం కేజీ బేసిన్‌లోని డీ6 బ్లాక్ నుంచి వెలికి తీస్తున్న మిలియన్ ఎంఏబీటీయూ ధర (ఇది బ్రిటిష్ థర్మల్ యూనిట్. ఒక ఎంఎంఎస్‌సీఎండీలో 35,000 ఎంఎంబీటీయూలు ఉంటాయి) 4.2 డాలర్లు. 2009లో అంబానీ బ్రదర్స్ మధ్య పోరు నేపథ్యంలో ప్రభుత్వం ఈ ధరను నిర్ణయించింది.
inka undi

Golden Spoon
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Methhanithodugu
Hero
Username: Methhanithodugu

Post Number: 16410
Registered: 12-2008
Posted From: 117.195.219.74

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Wednesday, April 04, 2012 - 07:30 am:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)

https://www.andhrajyothy.com/mainnewsshow.asp?qry=2012/apr/4 /main/4main1&more=2012/apr/4/main/main&date=4/4/2012
Jagan emaina sesthaademo revenge kosam ikkadA CM= Common Man who is paying already 55 Rs For LPG/Liter its was 32 Rs last yr ...

Golden Spoon

Add Your Message Here
Post:
Bold text Italics Underline Create a hyperlink Insert a clipart image HASH(0x9975648){Movie Clipart}
Show / Hide regular icons selection options

Click on following links to open cliparts by Alphabetical Order

 A   B   C   D   E   F   G   H   I   J   K   L   M  

 N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z  

Show / Hide Filmy icons selection options

Click on following links to open cliparts by Alphabetical Order

 A   B   C   D   E   F   G   H   I   J   K   L   M  

 N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z  


Username: Posting Information:
This is a public posting area. Enter your username and password if you have an account. Otherwise, enter your full name as your username and leave the password blank. Your e-mail address is optional.
Password:
E-mail:
Options: Enable HTML code in message
Automatically activate URLs in message
Action: