   
Methhanithodugu
Hero Username: Methhanithodugu
Post Number: 14865 Registered: 12-2008 Posted From: 59.93.67.231
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Tuesday, January 31, 2012 - 08:20 pm: |
    |
సీఎం ఎవరు? మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు? నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డా? బొత్స సత్యనారాయణా? ఎవరు చేయవలసిన పని వారు చేయడం లేదా? కిరణ్ విఫల మవుతున్నందునే ఆయన చేయాల్సిన పనులు బొత్స చేస్తున్నారా? . పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్య నారాయణ తాజా ఢిల్లీ పర్యటనతో అందరిలోనూ తలెత్తుతున్న సందేహాలివి. బొట్స00(సూర్య ప్రధాన ప్రతినిధి, హైదరాబాద్) :బొత్స సత్యనారాయణ ఢిల్లీ పర్యటన సందర్భంగా ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను కలసి ప్రస్తావించిన అంశాలు, ఆయన దృష్టికి తీసుకువెళ్లిన సమస్యలన్నీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధానిని కలిసినప్పుడు మాట్లాడే స్థాయివే కావడం చర్చనీయాంశమయింది. ఆయన ఒక మంత్రి గానే ప్రధానిని కలిసినప్పుడు తన శాఖకు సంబంధించిన సమస్యలు మాత్రమే ప్రస్తావిస్తే దానికి పెద్దగా ప్రాధాన్యం ఉండేది కాదు. సాధార ణంగా తమ శాఖకు సంబంధించి కీలకమైన సమస్య లేమైనా ఉంటే ఆయా మంత్రులు దానివరకే పరిమతం అవుతుంటారు. అసలు ప్రధాని వరకూ వెళ్లే సంద ర్భాలు బహు స్వప్నం. ఆయా శాఖల మంత్రులు అదే శాఖలకు సంబంధించిన కేంద్రమంత్రుల వద్దకు వెళ్లి విన్నపాలు చేయడం రివాజు. కానీ, బొత్స సత్యనారాయణ మాత్రం ముఖ్య మంత్రి స్థాయి వ్యక్తి చెప్పాల్సిన అంశాలన్నీ ప్రధాని వద్ద ప్రస్తావించడం చూస్తే, సహజంగానే రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరన్న అనుమానం ఎవరికయినా వస్తుందని పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. గతంలో కూడా తన శాఖకు సంబంధం లేని 108 నిర్వహణపై సమీక్ష నిర్వహించి విమర్శలు ఎదుర్కొన్నారు. బొత్స తన రవాణా శాఖకు సంబంధించి జెఎన్‌ఎన్‌యు ఆర్‌ఎం నుంచి ఆర్టీసి నిధుల సాయం సరిపెట్టుకోకుండా, వ్యవసాయ, ఆర్ అండ్ బీ, పవర్, సాగునీటిశాఖలకు సంబంధించిన సమస్యలనూ ప్రస్తావించడం గమనార్హం. ఇందులో ఏవీ బొత్స శాఖలకు సంబంధం లేనివేనని పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఇందులో ముఖ్యమంత్రి పర్యవేక్షిస్తున్న పవర్ కూడా ఉంది. కాగా, ప్రధానిని కలిసిన బొత్స.. వరి ధాన్యం మద్దతు ధరను క్వింటాలుకు 200 రూపాయలు పెంచాలని కోరారు. అదేవిధంగా 1300 రూపాయల మద్దతు ధర లభిస్తేనే రైతులకు గిట్టుబాటవుతుందని సూచించారు. చేవెళ్ల-ప్రాణహితతో పాటు పోలవరం ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వాలని అభ్యర్ధించారు. కొవ్వాడ అణువిద్యుత్ ప్లాంటుపై పునరావాస ప్యాకేజీ ఆకర్షణీయంగా లేనందుకే వ్యతిరేత వస్తున్నందున, ప్యాకేజీ పెంచాల న్నారు. గ్రామీణ ప్రాంతాల మధ్య రోడ్డు సదుపా యాలు మెరుగుపరిచేందుకు అధిక నిధులు ఇవ్వాలన్నారు. రాజీవ్ యువకిర ణాల కార్యక్రమానికి హాజరుకావాలని అభ్యర్ధించారు.నిజానికి, చేవెళ్ల-ప్రాణి హత, పోలవరం ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వాలని ముఖ్యమంత్రి కిరణ్ చాలాకాలం నుంచీ ఒత్తిడి చేస్తున్నారు. ఆ రెండూ ముఖ్యమంత్రి స్థాయిలో ప్రస్తావిం చవలసిన అంశాలే. ఇక రైతులకు గిట్టుబాటు, మద్దతు ధర పెంచాలన్న అంశం కూడా సీఎం స్థాయిలోనిదే. అణు విద్యుత్ కేంద్రం సమస్య కూడా ముఖ్యమంత్రి ప్రస్తావించే స్థాయి అంశమే. ప్రధానంగా.. రాజీవ్ యువకిరణాల కార్యక్రమానికి హాజరయి, తమ పరువు కాపాడాలని బొత్స ప్రధానిని కలసి విన్నవించడం చూస్తే.. ఆయన ముఖ్యమంత్రి స్థాయిలోనే ఢిల్లీ పర్యటన చేసినట్లు కనిపిస్తోందని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కిరణ్ ఒకసారి ఇప్పటికే ప్రధానిని కలిసి యువకిరణాల కార్యక్ర మాలకు హాజరు కావాలని కోరటం, ఆ మేరకు 4న వస్తా నన్న ప్రధాని పర్యటన రద్దు కావడం తెలిసిందే. అయితే తాను మళ్లీ యువకిరణాలను ప్రస్తావించి తప్పని సరిగా వచ్చి తమ పరువు కాపాడాలని కోరడంతో పాటు, రెండు ఫైళ్లను కూడా అందించడం చూస్తే.. యువ కిరణాలకు ఒకవేళ ప్రధాని హాజరయితే, అది తన అభ్య ర్ధన వల్లే సాధ్యమయిందన్న క్రెడిట్ సాధించేందుకే బొత్స ఎత్తుగడ అని పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు. తనకు అద నంగా ఉన్న పీసీసీ అధ్యక్ష పదవిని బొత్స ఢిల్లీ స్థాయిలో తన పలుకుబడి పెంచుకుని, లక్ష్యసాధనకు సాధనంగా వినియోగించు కుంటున్నారన్న వ్యాఖ్యలు పార్టీలో బాహా టంగానే వినిపిస్తున్నాయి. తనకూ రాష్ట్ర స్థాయి సమస్యలపై అవగాహన ఉందని, తాను కూడా ముఖ్య మంత్రి స్థాయి నాయకుడినేనన్న సంకేతాలను అటు ఢిల్లీ కి, ఇటు ప్రజ లకూ ఇచ్చే వ్యూహమే బొత్స అడుగుల్లో కనిపిస్తోం దంటున్నారు.
 Dont waste Food Hyd&Guntur Jagadish Hatsoff |