| Author |
Message |
   
Methhanithodugu
Hero Username: Methhanithodugu
Post Number: 10457 Registered: 12-2008 Posted From: 59.93.70.117
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Monday, June 27, 2011 - 08:57 am: |
    |
నా.స) మీ మాటలు వింటే మాజీ అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ ప్రెసిడెంట్ గ్రీన్ స్పాన్ ఆత్మ హత్య చేసుకుంటాడు. ప్రజాభివ్రుద్ది అంటె అది వేరేలే సర్. మీకు అర్ధం కాదు అనుకుంటా. ప్రస్తుతానికి మీ పడికట్టు మాటలు ఈ టీవీ లో చెప్పుకోండి. అ 3 ) అవినీతి ఎక్కువ అయ్యి మేపలేని తెల్ల ఏనుగులా ఈ ప్రాజెక్ట్ తయారవుతుంది. నా.స) కొంచెం సమాధానం ఇవ్వదగిన ప్రశ్నే. అవినీతిని రూపుమాపలేక పోవచ్చు కానీ, ప్రజలు విజ్ఞాన వంతులు,విజ్ఞులు అయితే తగ్గించ వచ్చు. ఈ మాటలు చెప్పి కట్టకపోతే ఏ ప్రాజెక్ట్ ముందుకు పోదు. అ 4 ) ప్రగతి నిరోధక పనులతో దేశం వెనక్కి మరులుతుంది. నా.స) జోకులేయ్యకండి సర్. ఇటువంటి మీ మాటలు వింటే దేశం మరో వంద సంవత్సరాలకి వెనక్కి వెళ్తుంది. ప్రాజెక్ట్ కట్టడానికి డబ్బు ఎలా తీసుక రావాలో నేను చెప్తాను. 1 ) మన ప్రభుత్వ రంగ బ్యాంకులలో ఫిక్సుడు డిపాజిట్ల రూపం లో కొన్ని లక్షల కోట్ల రూపాయలు మూలుగుతుంది. దాని నుండి అప్పుగా తీసుకో వచ్చు. ఈ అప్పుని ప్రతి సంవత్సరంపదివేలకోట్ల చొప్పున కనీసం పదిశాతం వడ్డీతో పది సంవత్సరాలలో తీర్చివేయ వచ్చు. 2 ) జూబ్లీ హిల్స్ లోని కాసు బ్రహ్మనంద రెడ్డి పార్క్ ని అమ్మి పారేసి కట్ట వచ్చు. 3 ) జాతీయ ప్రాజెక్ట్ గా డిక్లేర్ చెయ్యగలిగితే తొంబయ్ శాతం నిధులు కేంద్రం నుండి తీసుక రావచ్చు. మిగిలిన పది శాతం మనం అడ్జస్ట్ చెయ్య వచ్చు. 4 ) వరల్డ్ బ్యాంకు నుండి అప్పు తీసుకోవచ్చు. లేదంటే ప్రజలనుండి నీటి పారుదలా బాండ్లు అమ్మి సాధించ వచ్చు. 5 ) ప్రభుత్వ రంగ సంస్థలని అమ్మి వేసి డబ్బుని జాతీయ సంపదలు అయిన ప్రాజెక్టు ల మీద ఇన్వెస్ట్ చెయ్య వచ్చు. (ఒక నాడు చంద్ర బాబు ఈనాడు లో యాడ్ లకి,జన్మ భూమి టోపీలకి ఖర్చు చేసాడు లే) 6 ) పోలవరం పూర్తి చేస్తే 960 మెగా వాట్లు,పులిచింతల పూర్తి చేస్తే 300 మెగా వాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుంది.మిగతా 1740 మెగా వాట్లు లో ,ప్రస్తుతం ఇచ్చే ఉచిత విద్యుత్ ఒక 500 మెగావాట్లు తగ్గుతుంది. ఇక నికరంగా కావాల్సింది 1240 మెగా వాట్లు. మన క్ఙ్ బేసిన్ లో గ్యాస్ ఉపయోగిస్తే లేక ప్రస్తుతం నిర్మాణం లలో ఉన్న కొన్ని ప్రైవేటు విద్యుత్ ఉత్పత్తి కర్మాగారాలు పూర్తి అయితే ఈ మొత్తం అడ్జస్ట్ చెయ్యడం కష్టం కాదు. మనసుంటే మార్గం ఉంటుంది. ఇన్ని ఉపయోగాలు ఉన్న ఈ ప్రాజెక్ట్ ని సాధ్యం కాదు అని చేతులెత్తేస్తామా లేక అభివృద్ధి కోసం ముందుకు వెళ్తామా? సంపద సృష్టి అంటె మౌలిక సదుపాయాల కల్పనతో పాటు,మానవులకి కావాల్సిన ఉపాధి అవకాశాలు కల్పించడమే. సమాజ నిర్వహణ, లాభ నష్టాలు వేసుకొనే ఒక కార్పోరేట్ సంస్థ కాదు. మన తెలంగాణా ని సస్య శ్యామలం చేసి అభివృద్ధి చేద్దామా లేక కుంటి సాకులు చెప్పి ఎడారి చేద్దామా? ఇప్పుడు చెప్పండి విజ్ఞులారా నేను ఈ లోక్ సత్తాని,దాని అధినేతని చెత్త అని పిలవడంలో ఎమన్నా తప్పు ఉందా? జై హింద్. The End ... inka JP/LS Fans vassi oogaandi .... dumb & dumber Chinni Fans Ass |
   
Methhanithodugu
Hero Username: Methhanithodugu
Post Number: 10456 Registered: 12-2008 Posted From: 59.93.70.117
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Monday, June 27, 2011 - 08:55 am: |
    |
14 ) ఇక పెరిగిన సంపద వలన వర్తక,వాణిజ్య,ఇతరత్రా పన్నులు పెరిగి ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంది. 15 ) భూముల రేట్లు ఎంతో పెరుగుతుంది. రెండు పంటలకి నీళ్ళు వస్తే ఎకరా కనీసం పదిలక్షలు అవుతుంది. ఇప్పుడు ఉన్న లక్షతో పోలిస్తే రైతుల నికర ఆస్తి పది రేట్లు పెరుగుతుంది. 16 ) సంపద అంటే మన రోడ్లు, ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాల లేక పచ్చ నోట్లా? మన ఆర్ధిక శాస్త్రం ఉట్టి కాగితాలకి విలువ ఉన్నది అని చెప్తుందా? ఇక మన పడక కుర్చీ మేధావుల అభ్యంతరాలు. 1 ) ఇది సాధ్యమేనా? నా సమాధానం: అసలు మొదలే పెట్టకుండా మీనమేషాలు లెక్క వేస్తే ఎలా సార్. ఇలా అనుకుంటే నూట యాభయ్ ఏళ్ల క్రితం సర్ అర్ధాన్ కాటన్ గారు గుర్రాల మీద తిరిగి ప్రాజెక్ట్ లు కట్టేవారా? ముందు మొదలు పెడదాము. 2 ) ఇందులో అవినీతికి ఆస్కారం ఉంటుంది. నా.స) అవినీతి అనేది మన సమాజం లో ఇప్పుడప్పుడే పొయ్యేది కాదు. అందరూ విద్యావంతులు అయ్యి,ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా నిజాయితీగా ఉంటె మొత్తం సమాజం లో మార్పు వస్తుంది. ఇప్పుడే అభివృద్ధి చెందుతున్న మన దేశంలో రాత్రికి రాత్రికి మార్పు జరగదు.ప్రజలు మెరుగయిన సమాజం కోసం అడుగులు వేస్తున్నారు. కొద్ది కాలం లోనే మనము ఒక విజ్ఞాన వంతమయిన,నాగరిక సమాజం దిక్కుకి నడిచి , అవినీతి ని అత్యల్పానికి తగ్గించ గలుగుతాము. 3 )ఇంత డబ్బు ఎక్కడనుండి తెస్తాము? నా.స) కింద పేరాగ్రాఫ్ తరువాత చూడండి. ఇక జయ ప్రకాష్ నారాయణ గారి అసంబద్ద వాదనకి వద్దాము. అభ్యంతరం 1 ) ఒక్కొక్క ఎకరానికి మూడు లక్షల ఖర్చు పెట్టడం కన్నా ,ఆ డబ్బుని రైతులకి డైరెక్ట్ గా ఇవ్వడం మేలు. నా.స ) మీ మాటలు వింటే అసలు మీకు ఒక ప్రజా అభివృద్ధి గురించి వీసమెత్తు అయినా అయిడియా ఉందా? మీరు ప్రజా పాలన అంటే ఏమిటో,సంఘ అభివృద్ధి అంటే ఏమిటో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అశోకుడు,అబ్దుల్ కెమాల్ పాషా, షేర్ షా సూరి,చాణక్యుడి అర్ధ శాస్త్రం మొదలయిన వాటి గురించి మీరు తెలుసుకోవలిసిన అవసరం ఉంది. ఒక సంఘం లో నోట్ల 'కాగితాలకి' విలువ లేదు మహాశయా. శక్తిని జౌళ్ళ లో కొలిచినట్లుగా,మానవ శ్రమని నోట్లతో కొలుస్తారు అంతే. డబ్బు అంటె అది ఒక కొలమానము మాత్రమె. సంపద అంటె మానవ శక్తి,శ్రమ. శ్రమ లో మిగులు విలువ గురించి తెలుసుకోవాలంటే మీరు కార్ల్ మార్క్స్ గురించి చదవాల్సిందే. :) :) అ 2 ) ప్రతి సంవత్సరం నిర్వహణ ఖర్చులు తట్టుకునే కన్నా ఆ డబ్బుని డైరెక్ట్ గా రైతుల ఎకౌంటు లో జమ చేయడం ఉత్తమం.
dumb & dumber Chinni Fans Ass |
   
Methhanithodugu
Hero Username: Methhanithodugu
Post Number: 10455 Registered: 12-2008 Posted From: 59.93.70.117
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Monday, June 27, 2011 - 08:55 am: |
    |
6 ) ఇక గ్రామీణ ఆదాయం పెరిగితే దాని ద్వారా వ్యవసాయ కూలీల ఆదాయం పెరుగుతుంది. గ్రామీణ కొనుగోలు శక్తి పెరిగితే దగ్గరలోని పట్టణాలలో పచారీ కోట్ల నుండి, హోటల్లు,నిర్మాణ, సినిమా,వినోదం,వస్త్ర పరిశ్రమ,వైద్యం, రవాణ ,అన్ని రంగాల్లో వృద్ది కలుగుతుంది. అన్ని రంగాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. పారిశ్రామిక వృద్దికి దోహదం చేస్తుంది. 7 ) సంపదపెరిగితే గ్రామీణులు,దళిత ,బడుగు,బలహీన వర్గాలు తమ పిల్లల విద్యపై అధికంగా ధనాన్ని వెచ్చించ గలుగుతారు. దీనితో విద్యా రంగం తో పాటు,దాని అనుభంద రంగాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అందరికి నాణ్యమయిన విద్యతో ఒక అభివృద్ధి చెందిన సమున్నత సమాజ నిర్మాణానికి మార్గం సుగమము అవుతుంది. 8 ) బోర్లు వెయ్యడం తగ్గి పొతే భూగర్భ జలాలు అడుగంటటం ఆపవచ్చు. దీనివలన ముందు తరాలకి మేలు కలగడం తో పాటు ,గ్లోబల్ వార్మింగ్ తగ్గించ వచ్చు. 9 ) అన్నిటికన్నా ముఖ్యంగా ప్రజలకి ఆహార భద్రత కలిగించ వచ్చు. పౌష్టిక ఆహార వృద్ది వలన ప్రజల ఆయురారోగ్యాలు మెరుగుపడతాయి. 10 ) పెట్టు బడీ దారి విధానం లో సంపద సృష్టి అంటే ఒక సైక్లింగ్ లాగా ఒక రంగం అభివృద్ధి మరొక రంగంలో ఉపాధి అవకాశాలు పెంచుతుంది. ఇది ఒక సైక్లింగ్ లాగా ఉంటుంది. పెట్టుబడీ దారీ విధానం,దాని ఉపయోగాలు అనే టాపిక్ మీద తరువాత ఒక వ్యాసం రాస్తాను. 11 ) మూడువేల మెగా వాట్ల పవర్ జనరేషన్ కి ప్రతి సంవత్సరం ఎంత మందికి ఉపాధి కలుగుతుంది. యాభయ్ వేల కోట్లు ఇన్వెస్ట్ చేస్తే ఎన్ని కూలీ లకి పని రోజులు కల్పించ వచ్చు. అసలు 'జాతి సంపద' అంటే పచ్చ నోట్లా లేక ప్రజలకి ఉపాధి కల్పనా దినాలా? 12 ) మన నీటిని వృధాగా సముద్రంలో కలుపుకొని, భూమాత కి రంధ్రాలు చేసి,భూగర్భ జలాలు తోడి,ఫ్లోరోసిస్ భూతానికి మన తెలంగాణా ప్రజల్ని బలి చేద్దామా లేక నదీమ తల్లి జలాలతో మన తెలంగాణా గడ్డని అభిషేకం చేసి,ఒక అభివృద్ధి చెందిన సమాజాన్ని సృస్టిద్దామా? 13 ) ఈ ప్రాజెక్ట్ నిర్వహణకి ఎంత మందికి ఉపాధి అవకాశాలు కల్పించ వచ్చు. మన అసలు సంపద అయిన యువతని ఖాళీగా కూర్చోకుండా ఎంతమందికి ఉపాధి కల్పించవచ్చు ఈ ప్రాజెక్ట్ నిర్వహణ ద్వారా? అభివృద్ధి అంటే అందరికి ఉపాధి కల్పించి,తద్వారా ప్రజా జీవనాన్ని మెరుగుపరచే అనేక ఇతర వృత్తులకి మెరుగయిన బాటలు పరచడం కాదా?
dumb & dumber Chinni Fans Ass |
   
Methhanithodugu
Hero Username: Methhanithodugu
Post Number: 10454 Registered: 12-2008 Posted From: 59.93.70.117
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Monday, June 27, 2011 - 08:54 am: |
    |
http://indrasenagangasani.blogspot.com/2011/06/blog-post_25. html లోక్ సత్తా ,ఇది ఒక అతి పెద్ద చెత్త లోక్ సత్తా ,ఇది ఒక అతి పెద్ద చెత్త ,ఎందుకంటే ప్రాణహిత చేవెల్ల ప్రాజెక్ట్ అనవసరం అంటున్నందుకు. రామోజీ రావు చేత,రామోజీ రావు కొరకు,రామోజీ రావు వలన మనుగడ సాధిస్తున్న ఈ పేపర్ లీడర్ జయ ప్రకాష్ నారాయణ కి ఇంతకన్నా జ్ఞానం ఉంది అనుకోవడం మన తప్పు. అసలు ప్రాణహిత చేవెల్ల ప్రాజెక్ట్ గురించి ఒక సారి చూద్దాము. తెలంగాణలోని 8 జిల్లాల్లో 16లక్షల ఎకరాలకు సాగునీటిని, జంట నగరాలకి తాగునీటిని,తెలంగాణలో ని 8 జిల్లాలలో అనేక గ్రామాలు, చిన్న చితక పట్టణాలకి తాగునీటిని అందించే ప్రాణ హిత-చేవేళ్ళ ప్రాజెక్టు తెలంగాణ పాలిట వరప్రదాయని. ఈ ప్రాజెక్ట్ వివరాలని ఒక సారి చూద్దాము. గోదావరి నది కి ఉపనది అయిన ప్రాణహిత నుండి నీటిని ఎత్తిపోతల ద్వారా తెలంగాణా కి తరలించడం ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశ్యం. ఈ ప్రాజెక్ట్ మొత్తం ఎత్తిపోతలు కాకుండా కొంత దూరం గ్రావిటీ ద్వారా కూడా నీరు ప్రవహిస్తుంది. లెక్క లేనన్ని,చిన్న,మధ్య తరహా ప్రాజెక్టులు,చెరువులు ,కుంటలు నీటి ద్వారా నింప వచ్చు. నీటి సరఫరా సామర్ధ్యము - 160 టి ఎం సి లు (ఇంకా పెంచ వచ్చు.కనీసం 200 టి ఎం సి ల నీరు సాధించ వచ్చు) మొత్తం ఆయకట్టు- 16 లక్షల ఎకరాలు (డ్రిప్ ఇర్రిగేషన్ ఉపయోగిస్తే ఇంకా పెంచవచ్చు. ఒక టి ఎం సి నీటితో పదివేల ఎకరాలు సాగు చేయవచ్చు) నిర్మాణ ఖర్చు- 40 వేల కోట్లు (ఇంకా పెరగ వచ్చు, మొత్తం యాభయ్,అరవై వేల కోట్లకి పెరగ వచ్చు) నిర్వహణ ఖర్చు- 2000 కోట్లు ప్రతి సంవత్సరం కి (మొత్తం మూడు వేల మెగా వాట్ల,ఇతర నిర్వహణ ఖర్చులు) అంటే ప్రతి ఎకరాకి నిర్మాణ ఖర్చు రమా రమీ మూడు లక్షల ఇరువది వేలు, నిర్వహణా ఖర్చు ప్రతి సంవత్సరం రమా రమీ పది హేను వేలు ఒక ఎకరాకి పడుతుంది. ఈ ప్రాజెక్ట్ పూర్తి చేస్తే ప్రపంచంలోనే ఒక అతి పెద్ద రికార్డు అవుతుంది. దాదాపు 1600 అడుగుల ఎత్తుకి నీటిని లిఫ్ట్ చెయ్యాలి. శభాష్ (ఎవరన్న పూర్తి చేస్తే) లోక్ సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ గారి వాదన ఒక సారి చూద్దాము. నేను ఆ వీడియో స్వయంగా చూసాను. 1 ) ఒక్కొక్క ఎకరానికి మూడు లక్షల ఖర్చు పెట్టడం కన్నా ,ఆ డబ్బుని రైతులకి డైరెక్ట్ గా ఇవ్వడం మేలు. 2 ) ప్రతి సంవత్సరం నిర్వహణ ఖర్చులు తట్టుకునే కన్నా ఆ డబ్బుని డైరెక్ట్ గా రైతుల ఎకౌంటు లో జమ చేయడం ఉత్తమం. 3 ) అవినీతి ఎక్కువ అయ్యి మేపలేని తెల్ల ఏనుగులా ఈ ప్రాజెక్ట్ తయారవుతుంది. 4 ) ప్రగతి నిరోధక పనులతో దేశం వెనక్కి మరులుతుంది. వెల్. ఈ మాటలు,లెక్కలు, టీవీ లో చూడగానే మన పడక కుర్చీ మేధావులకి ఒళ్ళు పులకిస్తుంది. ఇక జయప్రకాష్ నారాయణ గారి భక్తులకి అయితే అబ్బో,చెప్పనలవి కాదు. గుడ్డలు చించుకోవడమే తరువాయి. ఈయన చెప్పిన మాటలు అన్నీ ఒక ప్రైవేటు కంపనీ Cఏఓ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ (ఎవరన్నా గుర్తుకు వస్తున్నార,తప్పు లేదులే) ద్వారా బోర్డు అఫ్ డైరెక్టర్స్ కి వివరిస్తే వాళ్ళంతా లేచి చప్పట్లు కొడతారు. ఇక మనము అసలు విషయానికి వద్దాము. ప్రభుత్వం అంటే లాభ నష్టాలు చూసుకునే ప్రైవేటు అర్గనైజేషనా? అసలు ఎకనామి అంటే ఏమిటీ? ఉట్టి కాగితపు నోట్లు లెక్కబెట్టుకునే సంస్థా? అసలు డబ్బు అంటే ఏమిటీ? సంపద అంటే ఏమిటీ? ప్రభుత్వ ఉపాది కల్పన ఏ విధంగా చేస్తుంది? ఈ ప్రాజెక్ట్ వలన లాభాలు నా ఉద్దేశంలో. 1 ) ప్రతి సంవత్సరం కనీస నికర జలాలతో తెలంగాణా రైతాంగం రెండు పంటలు అయినా పండించుకోగలదు. ప్రతి ఎకరానికి మిర్చి కానీ,ప్రత్తి కానీ,వరి కానీ వేస్తే,సంవత్సరంలో రెండు పంటల మీద కనీసం లక్ష రూపాయల అధిక ఆదాయాన్ని కల్లజూడగలరు. అంటే సంవత్సరానికి పదహారు వేల కోట్ల అధిక ఆదాయం. ఇది కలకాలం ఉంటుంది. ఏవో కొన్ని సంవత్సరాలు చీడ,పీడలో, అకాల వర్షాలో,వరదలో వస్తే కొంత మినహాయింపు ఉంటుంది. 2 ) గ్రామాలలో నీటి సరఫరా మెరుగుపడటం వలన పశుగ్రాసం పెరుగుతుంది. పశు సంపద వలన కనీసం ఇంకొక వెయ్యి కోట్లు మిగులుతుంది. 3 ) ఇవాళ ఉచితంగా ఇస్తున్న కర్రెంట్ వినియోగం కొంత తగ్గుతుంది. కనీసం వెయ్యి కోట్లు అయినా మిగులుతుంది. 4 ) రైతుకి బోర్లు వెయ్యడం కోసం లక్షల రూపాయలు వెచ్చించే భారం తగ్గుతుంది. బోర్లు సాధారణంగా ఎండి పోతాయి. అందువలన రైతు మళ్ళీ మళ్ళీ బోర్లు వేయిస్తాడు.ఈ బోర్లు వెయ్యడం గురించి ఒక పెద్ద పుస్తకమే రాయవచ్చు. దీని ద్వారా యావరేజ్ గ సంవత్సరానికి ఇంకొక నాలుగు వందల కోట్లు ఆదా చెయ్య వచ్చు. 5 ) జంట నగరాలకి,తెలంగాణా లోని ఇతర పట్టణాలకి,గ్రామాలకి తాగు నీటి మీద రమా రమీ ఇంకొక వెయ్యి కోట్లు మిగులుతుంది. dumb & dumber Chinni Fans Ass |
|