| Author |
Message |

Methhanithodugu
Side Hero Username: Methhanithodugu
Post Number: 7507 Registered: 12-2008 Posted From: 59.93.75.194
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Friday, January 14, 2011 - 11:28 am: |

సంక్రాంతి పండుగ తర్వాత మంత్రి డీఎల్ రాజీనామా?! సంక్రాంతి పండుగ తర్వాత తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలని రాష్ట్ర మంత్రి డీఎల్.రవీంధ్రా రెడ్డి భావిస్తున్నట్టు ఆయన సన్నిహితుల ద్వారా తెలియవచ్చింది. ఇందుకోసం ఆయన ఉపసభాపతి నాదెండ్ల మనోహర్ అపాయింట్‌మెంట్ కూడా కోరినట్టు విశ్వసనీయ వర్గాల సమచారం. అయితే, ఈనెల 20వ తేదీ వరకు తాను నగరంలో అందుబాటులో ఉండనని, 21, 22, తేదీల్లో వచ్చి కలవాలని సూచించినట్టు తెలుస్తోంది. కడప జిల్లాకు చెందిన మంత్రి డీఎల్, యువనేత వైఎస్.జగన్మోహన్ రెడ్డి వర్గానికి చెందిన శాసనసభ్యుల మధ్య సవాల్ ప్రతిసవాళ్లు జరుగుతున్న విషయం తెల్సిందే. జగన్ వర్గానికి చెందిన ఆ ఐదుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డీఎల్ డిమాండ్ చేశారు. పార్టీ బ్యానర్, సోనియా ఫోటో కాకుండా మీరు ఒక్క వైఎస్ బొమ్మతోనే గెలిచి ఉంటే ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయాలని, తాను కూడా రాజీనామా చేస్తానని ప్రకటించారు. కడప ఎంపీ, పులివెందుల అసెంబ్లీ స్థానాలకు జరిగే ఉప ఎన్నికలతో పాటు.. తమతమ స్థానాలకు వైఎస్ బొమ్మతో మీరు ఎన్నికల్లో పోటీ చేయండి, తాను వైఎస్ బొమ్మ లేకుండా కాంగ్రెస్ బ్యానర్‌పై, సోనియా ఫోటో పెట్టుకుని పోటీ చేస్తానని డీఎల్ ప్రకటించారు. దీనికి జగన్ వర్గం ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ నివాసానికి కూతవేటు దూరంలో నిలబడి (జలదీక్ష) సమాధానం ఇచ్చారు. తొలుత మీరు రాజీనామా చేయండి, ఆ వెంటనే మేము రాజీనామాలు చేస్తామని, ఆ తరువాత ప్రజల్లోకి వెళ్ళి తేల్చుకుందామని రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే అమర్ నాథ్‌రెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, బద్వేలు ఎమ్మెల్యే కమలమ్మ, రైల్వేకోడూరు ఎమ్మెల్యే కె.శ్రీనివాసులు ఢిల్లీ జల దీక్షలో సవాలు చేశారు. అంతేకాకుండా, రాజీనామా చేసే వేదిక, సమయం నిర్ణయిస్తే తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. దీనికి డీఎల్ కూడా వెంటనే స్పందించారు. వేదిక అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయమేనని చెప్పారు. ఈ పరిస్థితుల్లో మంత్రి డీఎల్.. డిప్యూటీ స్పీకర్ అపాయింట్‌మెంట్ కోరడం ప్రతి ఒక్కరినీ ఉత్కంఠతకు గురిచేస్తోంది. రాజీనామా సమర్పించేందుకే నాదెండ్లను డీఎల్ కలువనున్నట్టు ఆయన సన్నిహిత వర్గాలు చెపుతున్నాయి. మొత్తం మీద ప్రస్తుతం కడప రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి. |

Methhanithodugu
Side Hero Username: Methhanithodugu
Post Number: 7506 Registered: 12-2008 Posted From: 59.93.75.194
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Friday, January 14, 2011 - 11:15 am: |

akkada Dl & Shankar Rao (5 times mla) evito roju oka MLA/manthri vachi jagan fans ni thittatam pshyco fans anta ..chevi chevi koskunaademo intha protest sesi t'pati aapa leka poyaadu Shankar Sir ni జగన్ బండారం బయటపెట్టడానికి గంటసేపు చాలు!: శంకర్ దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి కుమారుడు, మాజీ కడప ఎంపీ వై.ఎస్. జగన్మోహన రెడ్డి అవినీతిని నిరూపించడానికి గంట సేపు చాలుననని రాష్ట్ర చేనేత శాఖ మంత్రి పి. శంకరరావు అన్నారు.

వై.ఎస్. జగన్ అవినీతిని నిరూపించేందుకు తన వద్ద నిరూపిత సాక్ష్యాధారాలు ఉన్నాయని, ఎక్కడైనా జగన్ బండారాన్ని బయటపెట్టేందుకు సిద్ధంగా ఉన్నానని శంకరరావు తెలిపారు. వై.ఎస్. జగన్ అవినీతిని నిరూపించలేకపోతే తన ఆస్తులను ప్రజలకు ఇచ్చేస్తానని ఆయన సవాలు విసిరారు.

సైకోఫ్యాన్స్ వల్లే జగన్ పార్టీ పెడుతున్నారని, వై.ఎస్. జగన్ తన ప్రవర్తన మార్చుకుని తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరుతారని శంకరరావు ఆశాభావం వ్యక్తం చేశారు. వై.ఎస్. రాజశేఖర రెడ్డి కంటే ఒక మెట్టు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఉండాలని తాను కోరుకుంటున్నట్లు శంకరరావు తెలిపారు.

తెలంగాణ ప్రక్రియ పూర్తయ్యే వరకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి కొనసాగుతారని శంకరరావు చెప్పారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి ఎన్నికపై తమ కాంగ్రెసు అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని శంకరరావు మీడియా ప్రతినిధులతో అన్నారు. 2012లో తెలంగాణ రాష్ట్ర ఏర్పడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.