   
Methhanithodugu
Side Hero Username: Methhanithodugu
Post Number: 6400 Registered: 12-2008 Posted From: 59.93.79.70
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Tuesday, November 30, 2010 - 06:19 am: |
    |
kikure debba సభ్యత్వానికి, కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేసిన వెంటనే వైయస్ జగన్ కు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. గుంటూరు జిల్లాలో దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహాల స్థాపనపై నిషేధం విధిస్తూ జిల్లా కలెక్టర్ రామాంజనేయులు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో ఆరు నెలల పాటు ఏ విధమైన విగ్రహాలు స్థాపించకూడదని ఆయన ఆదేశాలు జారీ చేశారు. వైయస్ విగ్రహాల స్థాపనను అడ్డుకునేందుకే ఈ ఆదేశాలు జారీ అయినట్లు భావిస్తున్నారు. రాష్ట్ర రాజకీయ పరిణామాల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా విగ్రహాల స్థాపనపై నిషేధం విధించినట్లు కలెక్టర్ చెప్పారు. విగ్రహాల స్థాపనపై నిషేధం విధించడం వెనక రాజకీయ కారణాలున్నాయని వైయస్ జగన్ అనుచరులు మండిపడుతున్నారు. తమను పోలీసులు వేధింపులకు గురి చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో వందలాది వైయస్ విగ్రహాలు తయారై ఉన్నాయి. వచ్చే ఏడాది జనవరిలో వైయస్ జగన్ గుంటూరు జిల్లాలో ఓదార్పు యాత్ర చేపట్టాల్సి ఉంది. ఆయన ఓదార్పు యాత్రలో బాధితులను పరామర్శించడంతో పాటు విరివిగా వైయస్సార్ విగ్రహాలను ఆవిష్కరిస్తున్నారు. దీన్ని అడ్డుకోవడానికే కలెక్టర్ ఆ ఆదేశాలు జారీ చేసినట్లు భావిస్తున్నారు. |