![]() ![]() ![]() ![]()
Biggboss
Side Hero Username: Biggboss
Post Number: 7569 Registered: 08-2017 Posted From: 24.6.111.180
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Friday, December 28, 2018 - 02:13 pm: |
![]() ![]() ![]() ![]() ![]() |
అమరావతి: దేశంలో ఆంధ్రప్రదేశ్ భాగం కాదు అన్నట్లు కేంద్రం వ్యవహరిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. విశాఖ ఉత్సవ్‌లో ఎయిర్ షో కూడా నిర్వహించనివ్వకుండా అడ్డుకున్నారంటూ మండిపడ్డారు. రాష్ట్రప్రభుత్వం రుణమాఫీ చేస్తామంటే సహకరించని కేంద్రం.. ఇప్పుడు ఓట్లు కోసం రైతులకు ఏదో చేస్తామని ప్రకటిస్తోందని దుయ్యబట్టారు. రైతులపై కేంద్ర ప్రభుత్వానికి అభిమానం లేదన్నారు. కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటు విషయంలో ఉన్న అన్ని సానుకూలాంశాల గురించి చాలాసార్లు కేంద్రానికి వివరించామని, కానీ ముందుకురాలేదన్నారు. ట్రిపుల్ తలాక్ విషయంలో అరెస్టులు సరికాదన్న సీఎం.. క్రిమినల్ కేసులు నమోదు చేసి మూడేళ్లు జైల్లో పెడతామనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. దేశంలో అందరికీ ఒకే ఐపీసీ వర్తించాలని, రాజ్యసభలో కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తామన్నారు. గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుపై కేంద్రం ఇంకా ముందడుగు వేయడం లేదని కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సహకరించని కేంద్రానికి తాము పన్నులు ఎందుకు కట్టాలని నిలదీశారు. జగన్ తన సొంత జిల్లాలో ఏర్పాటు చేసే కడప స్టీల్ ప్లాంట్‌పై ఒక్కమాట కూడా కేంద్రాన్ని అనలేదని సీఎం దుయ్యబట్టారు. తనకు కేంద్రం నుంచి లబ్ధి జరగదనే జగన్ నోరువిప్పడం లేదని ఆరోపించారు. హైకోర్టు విభజన విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరపలేదన్నారు. హైకోర్టు విభజన వల్ల జగన్ అవినీతి కేసులు మళ్లీ మొదటికొచ్చే అవకాశం ఉందని చంద్రబాబు చెప్పారు. |