![]() ![]() ![]() ![]()
Platypus
Side Hero Username: Platypus
Post Number: 8609 Registered: 01-2008 Posted From: 77.100.60.41
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Friday, April 27, 2018 - 11:26 am: |
![]() ![]() ![]() ![]() ![]() |
Friend raasindhi - ikkada share chestunnaa. కొందరి పుట్టుక ఎలా ఉంటుంది అంటే..తన మన బేధం లేకుండా, చిన్న పెద్ద తేడా లేకుండా,ఊరు వాడ తేడా లేకుండా,ఇతను నా మనిషి నా ఇంట్లో మనిషి అని చెప్పుకునేలా ఉంటుంది.అలాంటి పుట్టుక లో పుట్టిన మనిషి వివేకా. వివేకానంద రెడ్డి గారు అని పిలవాలి.కానీ నేను పిలవను..ఎందుకంటే ఆయన మా ఇంట్లో మనిషి మా మనిషి ప్రజల మనిషి. అప్పుడు నాకు 19 ఏళ్ళు ఉంటాయి.మంచి వేసవి కాలం. నర్తకి సెంటర్ లోని ఒక కస్టమ్స్ షాప్ కి వెళ్ళాను చలువ కళ్ల జోడు కొనడానికి.ఒక వ్యక్తి తెల్ల దుస్తుల్లో తెల్ల చెప్పులతో అప్పుడే షాప్ లోకి వచ్చాడు. వచ్చి అమాంతంగా నా భుజాన తన మోచేతిని ఉంచి స్టైల్ గా నిల్చున్నాడు.ఎవరు ఈయన నా అనుమతి లేకుండా నా భుజాన్ని సపోర్ట్ గా తీసుకున్నాడాని మా ఇద్దరికీ ఎదురుగా ఉన్న అద్దంలో చూస్తే ముందు రోజు జమీన్ రైతు పేపర్ లో చూసిన నెల్లూరు ంళా వివేకా. ఎరుపు రంగులో ఉన్న కళ్ల జోడు కళ్ళకి పెట్టి నన్ను చూసి ఎలా ఉన్నాయరా అబ్బాయ్??అని అడిగారు అద్దం లోనే. ఒక ంళా ఇలా కుడా ఉండొచ్చని నాకు ఆరోజే తెలిసింది. ప్రజల కి ఇంత దగ్గరగా. నేను బావున్నాయి అన్నాను భయంగా,అమాయకంగా. పిల్లోడికి నచ్చిందట కానీ ఇది డబ్బాలో పెట్టి ఇచ్చేయి అని తీసేసుకుని వెళ్ళిపోయాడు. అసలు నేను ఎవరు? నా అభిప్రాయం ఆయన అడగడం ఏంటి?అని నేను తెరుకునే లోపే ఆయన వెళ్లిపోయారు. అది ఆయనతో నా మొదటి పరిచయం. అప్పటి నుంచి ఆయనకి నేను రహస్య అభిమాని. Vఱ్ కాలేజ్ లో డిగ్రీ చదివేపుడు కాలేజ్ కరెస్పాండెంట్ గా ఒక రోజు కాలేజ్ కి వచ్చారు.స్టూడెంట్స్ అందరం పైకి లేచి నిల్చున్నాము.నేను వెనక బెంచి.ఇది కూడా యాదృచ్చికమే..వచ్చి నా భుజం మీద చేయి వేసి నిల్చుని ఎలా చదువుతునర్రా అని ఇంట్లో పెదనాన్న అడిగినట్లు అడిగాడు అందరిని ఉదేశించి.అందరం గట్టిగా బాగా చదువుతున్నాము అని అరిచాము. నా భుజం మీద ఆయన చేయి మాత్రం అలానే ఉంది.ఇంకా బాగా చదివండి.మళ్ళీ వస్తా !! ఇంట్లో వాళ్ళు మీ మీదే ఆశలు పెట్టుకుని ఉంటారు.అది గుర్తుపెట్టుకోండి చాలు. అని వెళ్లిపోయారు నా భుజం మీద చేయి తీసేసి. ఇది నా రెండో పరిచయం ఆయనతో.ఆ మాటలతో ఆయన మీద అభిమానం ఇంకొంచెం పెరిగింది. డిగ్రీ అయిపోయింది.లీలా మహల్ లో సెకండ్ షో కి వెళ్ళాను.అప్పట్లో బాల్కనీ టికెట్ 60 రూపాయలు.సినిమా ఇంకా మొదలవలేదు.బాల్కనీ లో రోడ్ వైపు ఉండే మెట్లు దగ్గరికి వెళ్ళాను కూల్ డ్రింక్ కొనుక్కుని.ఒకతను అటు తిరిగి నిల్చుని గుప్పు గుప్పు అని సిగరెట్టు కాలుస్తున్నాడు..ఎవరో అనుకున్నా. ఒక్కసారిగా బాషా సినిమా లో రజని లా నా వైపు కి తిరిగాడు..చూస్తే మళ్లి వివేకా. సినిమా వేయలా ఇంకా అని నన్ను ఉదేశించి అడిగారు.ఇంకా లేదు అన్నాను. ఆయనకి నేను ఎవరో తెలీదు.అయినా సరే కాసేపు ఆయనతో మాట మాట కలపాలి అని ఆశ పడ్డాను. ఆయన కి నేను ఎవరో చెప్పాలనుకున్నాను.కస్టమ్స్ షాప్ లో కళ్ళజోడు దగ్గరి నుంచి మొదలు పెట్టాలనుకునే లోపు సినిమా మొదలయింది అని బెల్ మోగింది.అప్పట్లో బెల్ కొట్టే వారు సినిమా మొదలయితే. సిగరెట్టు కాలికింద నలిపి నన్ను దాటుకుని లోపలికి వెళ్లిపోయారు. మళ్ళీ ఆయన్ని ఎప్పుడు కలుస్తానో అనుకుంటూ లోపలికి వెళ్ళాను.ఎంట్రన్స్ లొనే ఆయనికి స్పెషల్ గా ఒక చైర్ వేసి కూర్చోబెట్టారు.ఒక ంళా ఇలా ఒక్కడే సెకండ్ షో సినిమా కి వస్తాడని నాకు అప్పటి వరకు తెలీదు. నేను సినిమా చూడడం మానేసి ఆయనకి దగ్గరగా కూర్చుని ఆయనను చూస్తూ ఉండిపోయాను ఆ రెండున్నర గంట. అప్పుడు తెలిసింది ఆయనలో ఒక పసిపిల్లాడు దాగి ఉన్నాడని. హాల్ యాజమాన్యం ఇంటర్వెల్ లో కూల్ డ్రింక్ పంపిస్తే స్ట్ర్రాతో చిన్న పిల్లోడిలా కూల్ డ్రింక్ తాగుతూ సినిమా చూస్తూ మధ్యలో అప్పుడప్పుడు హాయిగా నవ్వుతూ సినిమా మరొక 10 నిమిషాల్లో ముగుస్తుంది అనగా పైకి లేచి వెళ్లిపోయారు. ఆయన అలా లేచి వెళ్లిపోతుంటే నేను అలానే ఆయన్ని చూడడం నాకు ఇప్పటికి గుర్తే. (అదే నేను ఆయన్ని చివరి సారిగా చూడడం.ఆ తరవాత ఆయన్ని లోకల్ ట్.వ్. లో ఫాలో అవడం మొదలు పెట్టాను.) సినిమా అయ్యాక నేను మీ రహస్య అభిమాని ని అని ఆయన్ని ఆపి చెప్పాలనుకున్నాను.కానీ ఇంకా మరి కొంచెం సినిమా ఉంది అనగా లేచి వెళ్లిపోయారు. అలాగే ఇవాళ కూడా మన నుంచి వెళ్లిపోయారు.ఇంకా కొంచెం రోజులు ఉండకుండా మన నుంచి దూరం గా వెళ్లిపోయారు. ఆ రోజు నుంచి నిన్నటి రోజు వరకు నేను ఎపుడు సెకండ్ షో కి సినిమా కి వెళ్లిన వివేకా వచ్చారా అని వెతకడం అలవటాయి పోయింది.ఇక ఎవరిని వెతకాలి సెకండ్ షో కి వెళ్లి?? ఇంత వరకు ఆయనతో ఒక ఫోటో కూడా దిగలేదు. ఏదొక రోజు ఆయన దగ్గరికి వెళ్లి నేను గత 12 ఏళ్లుగా మీ రహస్య అభిమాని ని అని చెప్పుకోవాలి అని అనుకున్నాను.మరొక్కసారి నా భుజం మీద ఆయన చేయి వేపించుకుని ఆయనకి సపోర్ట్ గా నిల్చుకోవాలి అనుకున్నాను. నువ్వు ఎవరివి రా అంటే నేనొక అనామకుడిని అని కాకుండా నాకంటూ ఒక స్థాయి గౌరవం వచ్చే వరకు ఆగి, వెళ్ళి కలిసి నర్తకి సెంటర్ లో 12 ఏళ్ల క్రితం కస్టమ్స్ షాప్ లో మీకు ఎర్ర చలువ కళ్ల జోడు నేనే సెలెక్ట్ చేశా అని మిమ్మల్ని చూస్తూ పెరిగా అని ఆయనతో చెప్పి ఒక ఫోటో దిగి దాన్ని పదిలంగా నేను ఉన్నంత వరకు దాచుకోవాలి అని ఆశ పడ్డాను. నా ఆశ లో తప్పు ఉందా? నా ఆశ చెదిరింది ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు వివేకా ఇక లేరు అని వార్త తెలియగానే.ఎందరో అభిమానుల వల్లే నా గుండె కూడా పగిలింది.రేపటి నుంచి నెల్లూరు స్టైలిష్ స్టార్ వివేకా అనకుండా స్వర్గీయ వివేకా అని పేపర్స్ లో న్యూస్ లో వస్తే అది విని చూసి ఒక అభిమాని గా నేను ఎలా తట్టుకోగలను? నాకు తెలిసిన, నేను దగ్గరగా చూసిన రాజకీయ నాయకుడు అయినా.. కథానాయకుడు అయినా... నువ్వే వివేకా. నువ్వు లేని రోజున రాజకీయం రంజుగా ఉండదు. నువ్వు లేని రోజున సింహపురి లో సింహం ఉండదు. నువ్వు లేని రోజున ఏ.సి.సెంటర్ లో ఉత్సహం ఉండదు. ఒక్క మాటలో చెప్పాలంటే... ఒక రిక్షా కార్మికుడి నుంచి ఒక పారిశుధ్య కార్మికుడి వరకు నువ్వు లేని రోజున సామాన్యుడి కళ్ళలో జీవం ఉండదు. ఆ.C సెంటర్ మూగబోయిన ఈ రోజున ఒకటి మాత్రం చెప్పగలను. వివేకా హయాంలో నేను ఉన్నాను,ఆయనకి ఒక రహస్య అభిమానిగా నేను ఉన్నాను, అని నా పిల్లలకు వాళ్ళ పిల్లలకు నేను గర్వముగా చెప్పగలను. ఎందుకంత గర్వపడాలి అనే వాళ్ళకి నా దగ్గర ఉన్న సమాధానం ఒక్కటే... నాకు తెలిసినంతలో నేను చూసినంతలో.. ఆయన కి మాత్రమే తెలుసు మనిషిని మనిషిగా చూడడం.ఆయనలో నేనొక రాజకీయ నాయకుడిని చూడలేదు.ఒక మనిషిని చూసాను.ఆ మనిషికి సాటి మనిషిగా అభిమానిని అయ్యాను. నిన్ను ఇప్పటి వరకు కలవని, నా లాగా ఒక వేళ నిన్ను కలిసినా నువ్వు గుర్తుపట్టని ఎందరో రహస్య అభిమానుల తరపున తడిచిన కళ్ళతో బరువెక్కిన గుండెతో మీ ఆత్మ కి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.అలాగే కుటుంబ సభ్యులకు సానుభూతి తెలుపుకుంటున్నాను. ఒక శకం ముగిసింది. "వివేకా అనే ఆయన" ఇక లేరు. This world appearance is a confusion: even as the blueness of the sky is an optical illusion. I think it is better not to let the mind dwell on it, but to ignore it. |