![]() ![]() ![]() ![]()
Platypus
Side Hero Username: Platypus
Post Number: 6368 Registered: 01-2008 Posted From: 82.19.11.233
Rating:  Votes: 1 (Vote!) | | Posted on Wednesday, April 12, 2017 - 06:22 pm: |
![]() ![]() ![]() ![]() ![]() |
సుబ్బడు పదో తరగతి పరీక్షలు పదహారో సారి కూడా గట్టెక్కలేకపోయేసరికి జీవితం మీద విరక్తి చెంది, దేవుడు ఉన్నాడో లేడో, ఒక వేళ ఉంటే తన జాతకంలో పది దాటే ప్రాప్తం ఉందొ లేదో కనుక్కుందామని ఊరవతల ఉన్న కొండ పైన మర్రి చెట్టు కింద తపస్సు మొదలెట్టాడు. ఒక నిమిషం గడిచిందో లేదో, ఒక సన్నని గొంతు సుబ్బడిని పలకరించింది. "నాయనా సుబ్బిగా" సుబ్బడు కళ్ళు తెరిచి చూసాడు. ఎదురుగా దేవుడు తన అభయహస్తంతో వెర్రి నవ్వుతో వెలిగిపోతున్నాడు. "స్వామీ నువ్వేనా? నిజంగా నువ్వేనా? కలయా వైష్ణవ మాయా? ఇంత తొందరగానా? అసలేమీ జరుగుతూ ఉంది ఇక్కడ?" అని సాష్టాంగ నమస్కారం చేసాడు సుబ్బడు. "సమయం లేదు మిత్రమా... వరమా వంకాయ పులుసా? తేల్చుకో" దేవుడు చిరునగవుతో సుబ్బడిని పైకి లేపాడు. "వరమే స్వామీ " అన్నాడు సుబ్బడు "సరే, ఇదిగో ఈ మూడింటిలో ఏదో ఒకటి కోరుకొనుము - అంతులేని ఐశ్వర్యం, అంతులేని విజ్ఞానం, అంతులేని ఆనందం" సుబ్బడు భళ్ళున నవ్వేసాడు. "నీది మరీ చాదస్తం స్వామి. ఎవరన్నా విజ్ఞానమే కోరుకుంటారు. అటు ఐశ్వర్యమైనా, ఇటు ఆనందమైనా - విజ్ఞానం తో సుబ్బరంగా సంపాదించేసుకోవచ్చు." దేవుడు చిద్విలాసంగా నవ్వి, "దానికేమిలే నాయనా... నీకు ఏమి కావాలో చెప్పి తరించు." అన్నాడు. సుబ్బడు అంతులేని విజ్ఞానం కోరుకున్నాడు. దేవుడు ఒక నిట్టూర్పు విడిచి, హాం ఫట్ అన్నాడు. వెంటనే ఒక ఉరుము ఉరిమింది. ఒక మెరుపు మెరిసింది. ఒక జల్లు పడింది. సుబ్బడు తడిసిపోయాడు. అలాగే విజ్ఞానవంతుడైపోయాడు. అప్పుడు సుబ్బడు తల చేతిలో పట్టుకొని "దీనెమ్మ జీవితం! ఐశ్వర్యం ఎందుకు అడగలేదు నేను?" అని కుప్పకూలిపోయాడు. |