![]() ![]() ![]() ![]()
Platypus
Side Hero Username: Platypus
Post Number: 4461 Registered: 01-2008 Posted From: 167.220.196.182
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Friday, September 09, 2016 - 10:50 am: |
![]() ![]() ![]() ![]() ![]() |
వన్‌కళ్యాణ్ ఆత్మగౌరవ సభలో అపశృతి చోటుచేసుకుంది. సభలో జరిగిన తొక్కిసలాటలో ఒక యువకుడు మృతి చెందగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మరణించిన యువకుడిని తూ.గో జిల్లా కాజులూరు మండలం కుయ్యేరు గ్రామవాసి వెంకటరమణగా గుర్తించారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. కాగా, ఈ సభను వీక్షించేందుకు సభా స్థలిలోని చెట్లు ఎక్కిన యువకులు కొందరు కిందపడి గాయాలపాలయినట్లు తెలిసింది. వారిలో కొందరి పరిస్థితి విషయంగా ఉందని వైద్యులు తెలిపారు. అంతేకాకుండా కిందపడిన వారిని తొక్కుకుంటూ మరికొందరు వెళ్లడంతో పరిస్థితి విషమించింది. పవన్ సభ ప్రారంభించే ముందే అభిమానులకు జాగ్రత్తలు చెప్పినా తమ అభిమాన నటుడిని చూడాలన్న ఆత్రంతో గాయాలపాలయ్యారు. |