   
Methhanithodugu
Legend Username: Methhanithodugu
Post Number: 34051 Registered: 12-2008 Posted From: 117.195.205.140
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Friday, July 11, 2014 - 07:48 am: |
     |
తలసానితో సహా 5గురు టిఆర్ఎస్ లోకి జంప్ ? సనత్ నగర్ తెలుగుదేశం శాసనసభ్యుడు,మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తో సహా ఐదుగురు టిడిపి ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ లో చేరవచ్చని ప్రచారం జరుగుతోంది.తలసాని శ్రీనివాస యాదవ్ గత కొంతకాలంగా పార్టీపై అసంతృప్తిలో ఉన్నారు. బిసిలకు నాయకత్వం అప్పగిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు మాట తప్పారని ఆయన గత కొంత కాలంగా అసమ్మతితో ఉన్నారు. కొద్ది రోజుల క్రితం గురుకుల్ ట్రస్టు భూములలో కూల్చివేతలకు నిరసనగా జరిగిన ఎమ్మెల్యేల పర్యటనకు కూడా ఆయన దూరంగా ఉన్నారు.ఆయనతోపాటు మరికొందరి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ప్రకాశ్‌గౌడ్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానందగౌడ్‌లతోపాటు మహబూబ్‌నగర్ కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి, నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరవచ్చని అంటున్నారు.అయతే రేవంత్ రెడ్డి దీనికి ఇష్టపడడం లేదని, కాని ఆయనపై ఒత్తిడి ఎక్కువగా ఉందని అంటున్నారు.ముఖ్యమంత్రి కెసిఆర్ కుమారుడు, మంత్రి కె.తారక రామారావు తో తలసాని సంప్రదింపులు జరుపుతున్నట్లు చెబుతున్నారు.  Hyderabad Made Babu Brand not Babu Made Brand Hyderabad Dont waste food -9948 203 208 Hyder-abad |maa ollu amayakulu |kids < 10 yr Heart surgery free |