| Author |
Message |
   
Methhanithodugu
Legend Username: Methhanithodugu
Post Number: 32883 Registered: 12-2008 Posted From: 117.195.195.249
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Saturday, May 17, 2014 - 12:30 am: |
     |
పొత్తులపై దృష్టిపెట్టని వైనం.... ఉప ఎన్నికల్లో మాత్రమే సత్తా చాటిన వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ఒంటరిగా సీమాంధ్రలోపోటీచేసే బలం ఉందా ఇతరపార్టీలను కలుపుకొని వెళ్లాల్సిన అవసరం ఉందా అన్న బలబలాల అంచనాలు వేసుకోవ డంలో విఫలమైందన్న విమర్శ ఉంది. ఏ పార్టీతో అవగాహనకు ముందుకు పోకపోవడం కూడా ఆ పార్టీకి శాపంగా మారిందని కొందరు పేర్కొంటున్నారు. పైగా ఉప ఎన్నికలు జరిగిన జిల్లాలలోనే ప్రధానంగా ఆ పార్టీ నాయకత్వం దృష్టిసారించిందని పేర్కొంటున్నారు. నెల్లూరు, కర్నూలు, కడప, ప్రకాశం జిల్లాలో ఉప ఎన్నికల్లో విజయం సాధిం చింది. ఈ జిల్లాలోని నేతలంతా మెజార్టీగా కాంగ్రెస్ నుం చి వైఎస్సార్‌కాంగ్రెస్‌లోకి వచ్చి ఈ ఉప ఎన్నికల్లో గెలు పొందిన వారే. దీంతో ఈ సార్వత్రిక ఎన్నికలలోనూ వైఎ స్సార్ కాంగ్రెస్ పార్టీ ఆయా జిల్లాలలోనూ ప్రధానం గావి జయం నమోదుచేసుకొంది. ఇతర జిల్లాలలో పార్టీ బలో పేతం చేయడంలో ఆ పార్టీ నాయకత్వం విఫలమైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. క్షేత్రస్థాయి పార్టీ నిర్మాణంలో విఫలం...? క్షేత్రస్థాయిలో సరైన క్యాడర్ లేక కూడా ఆ పార్టీ ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఓటమిపాలైందన్న విమర్శ ఉంది. గతంలోజరిగిన సహకార సంఘాల ఎన్నికలలో మూడో స్థానానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిమితం కావాల్సి వచ్చింది. ఈ ఓటమికి కూడా నాడు క్షేత్రస్థాయిలో ఆ పా ర్టీకి సరైన క్యాడర్ లేకపోవడమేనన్న ప్రచారం సాగింది. ఇలా పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టిపెట్టకపోవడం వల్ల కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి శాపంగా మారిందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. Dont waste food -9948 203 208 Hyder-abad |maa ollu amayakulu |TDP Should not Win - VJWarrior |
   
Methhanithodugu
Legend Username: Methhanithodugu
Post Number: 32882 Registered: 12-2008 Posted From: 117.195.195.249
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Saturday, May 17, 2014 - 12:29 am: |
     |
ఈనేపథ్యంలో ఈ సీనియర్ కాంగ్రెస్ నేతలంతా టిడిపి తీర్థం పుచ్చుకొన్నారు. దీంతో ఈ సీనియర్ నేతల తోపాటే కాంగ్రెస్ ఓటు బ్యాంకు గుంపగుత్తగా టిడిపి ఖాతాలో చేరిందని రాజకీయ వర్గాల విశ్లేషణ. ఈ నేపథ్య ంలోనే ఇప్పటికే ఉన్న తన ఓటింగ్‌శాతంతోపాటు టిడిపికి అదనంగావచ్చి చేరిన కాంగ్రెస్ ఓటు బ్యాంకు వల్ల సీమాంధ్రలో ఆ పార్టీ తన హవా సాగించారన్న ప్రచారం ఉంది. టిడిపిలో చేరిన సీమాంధ్ర సీనియర్లు అధికశాతం గెలుపొందిన వారిలో ఉన్నారు. అదే సందర్బంలో జగన్మోహన్‌రెడ్డి పార్టీ ఏర్పాటు మొదలు నుంచి ద్వితీయ శ్రేణి నాయకత్వంపైనే ఆధారపడి సాగింది. ఇది కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటమికి దోహదపడిన అంశంలో ఒక్కటి అని రాజకీయ వర్గాలు పేర్కొం టు న్నాయి. వీటితోపాటు జగన్‌పై వ్యతిగతంగా చంద్ర బాబు చేసిన విమర్శలు జనంలోకి విస్త్రుతంగా పోవడం కూడా ఓటమి కారణాలలో ఒకటి అని చెబుతున్నారు. రాష్ట్ర విభ జన నిర్ణయం జరిగిపోయిన సందర్బంలో ఎత్తుకొన్న సమై క్యనినాదం ఆ పార్టీకి పెద్దగా ప్రయోజనం కల్పించలేదు. పైగా విభజన ఖాయంగా జరిగిన నేపథ్యంలో అందంకు మానషికంగా సిద్దమైన ప్రజలు హైదరాబాద్ తరహా అభి వృద్ధిని కోరుకొంటున్న విషయాన్ని పసిగట్టడంలో జగన్ విఫలం అయ్యారన్న విమర్శలు ఉన్నాయి. సీమాంధ్ర ప్రా ంతాన్ని తాను అభివృద్ది చేయగలనన్న విశ్వాసాన్ని ప్రజల్లో జగన్ కలిగించలేక పోయారన్న ప్రచారం ఉంది.
Dont waste food -9948 203 208 Hyder-abad |maa ollu amayakulu |TDP Should not Win - VJWarrior |
   
Methhanithodugu
Legend Username: Methhanithodugu
Post Number: 32881 Registered: 12-2008 Posted From: 117.195.195.249
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Saturday, May 17, 2014 - 12:27 am: |
     |
ముందుచూపు లోపం....? పదేళ్లపాటు రాష్ట్రాన్ని దేశాన్ని పాలించిన పార్టీపై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకతతోపాటు రాష్ట్ర విభజన నిర్ణయంతో సీమాంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గల్లంతైందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు తన ఖాతాలో చేరేలా చేసుకోవడంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విఫలమైందని చర్చసాగుతోంది. కాంగ్రెస్ పార్టీలో ఉండి బయటకు వచ్చిన జగన్ తాను స్థాపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ఓటు బ్యాంకు తన మాతృపార్టీ అయిన కాంగ్రెస్‌దే. ఈ విష యం సీమాంధ్ర ప్రాంతంలో జరిగిన పలు ఉప ఎన్నికల్లో స్పష్టమైంది. అయితే సార్వత్రిక ఎన్నికల నాటికి గల్లం తయ్యే అవకాశమున్న కాంగ్రెస్ ఓటు బ్యాంకును తన ఖాతాలో చేర్చుకోవడంలో జగన్ విఫలం అయ్యారన్న ప్రచారం ఉంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్ సీనియర్లు పెద్ద ఎత్తున్న ఇతర పార్టీ లలోకి వెళ్లేందుకు ఆసక్తిచూపారు. తొలి ప్రాధాన్యతగా ఆ సీనియర్ నేతలు వైఎస్సార్ కాంగ్రెస్ వైపు మొగ్గుచూపినా జగన్ వైపు నుంచి సరైన సందన రాలేదన్న ప్రచారం ఉంది.
Dont waste food -9948 203 208 Hyder-abad |maa ollu amayakulu |TDP Should not Win - VJWarrior |
   
Methhanithodugu
Legend Username: Methhanithodugu
Post Number: 32880 Registered: 12-2008 Posted From: 117.195.195.249
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Saturday, May 17, 2014 - 12:26 am: |
     |
కాంగ్రెస్ వ్యతిరేక ఓట్లను తనవైపు తిప్పుకోవడంలో జగన్ విఫలం హైదరాబాద్, మేజర్ న్యూస్‌ః ఒకప్పుడు సీమాంధ్ర ప్రాంతంలో ఫ్యాన్ గాలితో ప్రత్యర్థి పార్టీలలో వణుకు పుట్టించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈఎన్నికల్లో ఓటమికి కారణం ఏమిటి..? టిడిపితో హోరాహోరిగా ఈ ఎన్నికల్లో ఆ పార్టీ తలపడినా వచ్చిన ఫలితం నిరాశమిగిల్చేదిగా వచ్చింది. ఒకప్పుడు ఉప ఎన్నికలలో సత్తా చాటిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత సార్వత్రిక ఎన్నికలలో పరాజయం పాలవడానికి కారణాలు ఎన్నో అన్న ప్రచారం సాగుతోంది. కీలకమై విధాన పరమైన నిర్ణయాలలో తప్పుటడుగులే ఆ పార్టీకి శాపంగా మారాయని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ ఓటు బ్యాంకును తనవైపు తిప్పుకోవడంలో జగన్ విఫల మయ్యారన్న ప్రచారం సాగుతోంది. రాష్ర్ట విభజన నిర్ణయం నేపథ్యంలో సమైక్యాంధ్ర నినాదం ఎత్తుకొన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆ తరువాత అభివృద్ధి నినాదాన్ని ఎత్తుకోవడంలో ఆలస్యం చేసిందని ప్రచారం కూడా ఉంది. వీటితోపాటు పలు కారణాలు ఆ పార్టీ ఓటమికి దోహదం చేశాయని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.
Dont waste food -9948 203 208 Hyder-abad |maa ollu amayakulu |TDP Should not Win - VJWarrior |