| Author |
Message |
   
Newguy123
Hero Username: Newguy123
Post Number: 15682 Registered: 01-2009 Posted From: 192.200.5.41
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Monday, March 03, 2014 - 08:51 am: |
    |
Man_of_masses:ye rakamga choosina alliance or merge would be best option
last ki jarigedi ade.. KCR's bargain formula idi.. |
   
Methhanithodugu
Legend Username: Methhanithodugu
Post Number: 30160 Registered: 12-2008 Posted From: 117.195.207.59
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Monday, March 03, 2014 - 08:45 am: |
    |
Man_of_masses:ye rakamga choosina alliance or merge would be best option
manaki sambadam illio its only about cadres trs ki antha deep network lekunde .. kani ippudu every one likes winners ... so TDP lo undedi only old tdp cadre who are looking for BC /Reddy /settler (so called) votes .... congress is in dilemma but will fight Every single Vote for YSRCP = CONG - sampoo
|
   
Man_of_masses
Megastar Username: Man_of_masses
Post Number: 23265 Registered: 01-2008 Posted From: 198.175.154.213
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Monday, March 03, 2014 - 08:40 am: |
    |
TRS Cong veru veru ga pothe iddariki bokka ne votes cheelipotay TRS ki edge unna kuda.. Cong vallane T vachindanedi janalaki undi so votes baaga cheelutai oka vela... T-JAC ganaka Cong pakkana cherindante inka KCR gadiki baaga lambam ye rakamga choosina alliance or merge would be best option http://i42.tinypic.com/54g1g2.png |
   
Methhanithodugu
Legend Username: Methhanithodugu
Post Number: 30159 Registered: 12-2008 Posted From: 117.195.207.59
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Monday, March 03, 2014 - 08:33 am: |
    |
yes telangana supporters might have had been irked ..by venkayya naidu ... but still i am awe struck ..65 yrs oldy or 16 yrs Dude Modi for PM in vijag .... emi flo tho kodatav naa raaja ....ninnu touch sese vadu ledu AP lo ... http://www.youtube.com/watch?v=TMLyZvJIJUA&t=125
  Every single Vote for YSRCP = CONG - sampoo
|
   
Methhanithodugu
Legend Username: Methhanithodugu
Post Number: 30158 Registered: 12-2008 Posted From: 117.195.207.59
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Monday, March 03, 2014 - 08:20 am: |
    |
kikure nominated post of Yuva Kiranalu Chairman KC .Reddy is asked to step down ASAP ...by the AP Governor Narsimhan mudal THALAIVAR governor correcting the mistakes of KKR
 Every single Vote for YSRCP = CONG - sampoo
|
   
Methhanithodugu
Legend Username: Methhanithodugu
Post Number: 30155 Registered: 12-2008 Posted From: 117.195.207.59
Rating:  Votes: 2 (Vote!) | | Posted on Monday, March 03, 2014 - 07:17 am: |
    |
earlier state vigilance caught around 50 petrolbunks with some caliberated remote to cheat city drivers .. they gave notice to 20 something PBs .. and then sudennly without formal notice PB announced Band in city...by 10 am no Pbs open ...then came Govn Narsmiham vuncle ...he ordered ration shop dealers will take over PBs... debaki digochar ...i wish we had governor rule after YSR in 2009 గవర్నర్ దెబ్బకి దిగొచ్చారు రాష్ట్రపతి పాలన ఎలా వుంటుందో ఈ తరం తెలుగు ప్రజానీకానికి తెలియదు. ఎప్పుడో 70లలో ఓ సారి తెలుగు ప్రజలు రాష్ట్రపతి పాలనను చూశారు. దాదాపు నలభయ్యేళ్ళ తర్వాత రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కావడంతో.. కొందరికి విచిత్రంగా వుంది, మరికొందరు ‘అసలేం తేడా లేదే..’ అనుకుంటున్నారు. అయితే, తూనికలు కొలతల శాఖ రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ బంక్‌లపై దాడులు చేయడం, దానికి నిరసనగా బంక్‌ల యాజమాన్యాలు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు దిగడం.. ఆ వెంటనే రంగంలోకి దిగిన గవర్నర్, తక్షణం బంక్‌లు తెరవాలని ఆదేశించడం.. దెబ్బకి దెయ్యం దిగొచ్చినట్టుగా బంక్‌లు తెరుచుకోవడం చూసి.. రాష్ట్రపతి పాలన ఇలా వుంటుందా.? అని ఆశ్చర్యపోవాల్సి వస్తోంది. అదే ముఖ్యమంత్రి, మంత్రులు.. తదితర వ్యవహారమనుకోండి సీన్ ఇంకోలా వుంటుంది. మంత్రిగారికి బంక్ యాజమాన్యాలు మొరపెట్టుకుంటాయి. ఆయనేమో కమిటీ వేస్తానంటారు. ఆ కమిటీ బంక్ యాజమాన్యాలతో చర్చలు జరుపుతుంది. ఇదంతా పెద్ద తతంగం. రాష్ట్రపతి పాలనలో రాష్ట్రానికి సంబంధించినంతవరకు గవర్నర్ సుప్రీం. దాంతో, ఆయన కన్నెర్రజేస్తే పరిస్థితి ఎలా వుంటుందోనని బంక్ యాజమాన్యాలు కంగారుపడ్డాయి. ఇక్కడ లాబీయింగ్ చేసేందుకు అవకాశం లేకపోవడంతో, బంక్ యాజమాన్యాలు ప్రజలకు క్షమాపణలు చెప్పి మరీ, బంక్‌లు తెరిచాయి. దాంతో వాహనదారుల ఇబ్బందులు కొద్ది గంటల్లోనే మటుమాయమైపోయాయి. అద్గదీ సంగతి.  Every single Vote for YSRCP = CONG - sampoo
|
   
Methhanithodugu
Legend Username: Methhanithodugu
Post Number: 30154 Registered: 12-2008 Posted From: 117.195.207.59
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Monday, March 03, 2014 - 07:08 am: |
    |
Minsupal election now will server as a pulse of the urban voter .... the great kiran kumar reddy milestone just like bellam konda kidney stone ... dabbul teestara mla/mp ... doubte ... కోర్టు వాతలు పెట్టిందని... రాష్ట్రంలో మునిసిపల్ ఎన్నికల నగారా మోగింది. మునిసిపాలిటీ.. మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు మార్చి 30న జరుగుతాయని అధికారికంగా ప్రకటన వెలువడిరది, ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వచ్చింది. సాధారణ ఎన్నికలకీ, మునిసిపల్ ఎన్నికలకీ సమయం అతి తక్కువే వున్నా, మునిసిపల్ ఎన్నికలకూ సార్వత్రిక ఎన్నికలకు ఏర్పాట్ల విషయంలో ఎటువంటి ఇబ్బందీ వుండదని అధికారులు చెబుతున్నారు. రిజర్వేషన్ల ప్రక్రియ విషయంలోనే ఇన్నాళ్ళూ ఇబ్బందులు తలెత్తడం వల్ల ఎన్నికలు ఆలస్యం అయ్యాయన్నది అధికారుల వాదన. కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఎంతగా చెప్పినా వినకుండా వాయిదా కోసం సుప్రీంను ఆశ్రయించారని ఎన్నికల కమిషనర్ రమాకాంత్‌రెడ్డి చెప్పారు. మొత్తమ్మీద, రాష్ట్రపతి పాలనలో మునిసిపల్ ఎన్నికలు జరగనున్నాయన్నమాట. రాష్ట్రపతి పాలన లేకుండా, ప్రజలెన్నుకున్న ప్రభుత్వం రాష్ట్రాన్ని పరిపాలిస్తూ వుంటే, కోర్టు హెచ్చరికల్ని పక్కన పెట్టి మరోమారు రాజకీయం మునిసిపల్ ఎన్నికల్ని పోస్ట్‌పోన్ చేసి వుండేదేమో. ఎందుకంటే గతంలోనూ హైకోర్టు హెచ్చరించినా, ప్రభుత్వం ఎన్నికల్ని పక్కన పెట్టింది మరి. పార్టీల గుర్తులపై ఎన్నికలు జరుగుతాయని ఎన్నికల కమిషనర్ వెల్లడిరచడంతో వివిధ రాజకీయ పార్టీల్లో ఎన్నికల సందడి నెలకొంది. ఓ పక్క మునిసిపల్ ఎన్నికలు, ఇంకోపక్క సార్వత్రిక ఎన్నికలు.. వెరసి రాష్ట్రంలో హాట్ హాట్‌గా మారింది రాజకీయం. మామూలుగా అయితే మునిసిపల్ ఎన్నికల్ని వివిధ రాజకీయ పార్టీలు చాలా సీరియస్‌గా తీసుకుంటాయి. ఈ ఎన్నికల్లోనే పార్టీల సత్తా ఏంటో చూచాయిగా తెలుస్తుంది. సార్వత్రిక ఎన్నికలకు కొద్ది రోజుల ముందు జరుగుతున్న మునిసిపల్ ఎన్నికల్ని రాజకీయ పార్టీలు ఎలా తీసుకుంటాయి.? ఈ ఎన్నికల ఫలితాలు, సార్వత్రిక ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపుతాయి.? అన్నది వేచి చూడాల్సిందే  Every single Vote for YSRCP = CONG - sampoo
|
   
Methhanithodugu
Legend Username: Methhanithodugu
Post Number: 30153 Registered: 12-2008 Posted From: 117.195.207.59
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Monday, March 03, 2014 - 06:58 am: |
    |
How India can still make it to the Asia Cup final PS: For India, the only objective left is to beat Afghanistan by a bonus point and hope one of the scenarios works in their favour. http://ibnlive.in.com/news/cricketnext/how-india-can-still-m ake-it-to-the-asia-cup-final/455561-78.html Every single Vote for YSRCP = CONG - sampoo
|
   
Methhanithodugu
Legend Username: Methhanithodugu
Post Number: 30151 Registered: 12-2008 Posted From: 117.195.207.59
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Monday, March 03, 2014 - 06:53 am: |
    |
అదేవిధంగా తెలంగాణ ఇచ్చింది మేమంటే మేమని కాంగ్రెస్ టిఆర్‌ఎస్ కొట్లాడు కుంటున్నాయి. విభజన నేపథ్యంలో ఇరు ప్రాంతాల్లో మారిన రాజకీయ పరిస్థితుల్లో పొత్తుల కోసం అన్ని పార్టీలు ఏదో ఒక పార్టీ వైపు చూస్తునే ఉంది. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రాంతంలో టిఆర్‌ఎస్‌ను విలీనం లేదా పొత్తు పెట్టుకొని ఈ ప్రాంతంలో బలోపేతం కావాలని కాంగ్రెస్‌నాయకత్వం భావిస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఇస్తే టిఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని ఆ పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారని ఏఐసిసి ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ వెల్లడించారు. కెసిఆర్‌పై నమ్మకంతో కాంగ్రెస్ హైకమాండ్ విభజన నిర్ణయం తీసుకొని తెలంగాణలో బలపడే దిశగా అడుగులు వేసింది. కానీ విభజన బిల్లు ఆమోదం పొందాక కేసిఆర్ టిఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేయడం యోచన చేసినా ఆ పార్టీ శ్రేణుల నుంచి తీవ్ర ప్రతిఘటన వస్తోంది. అదే సందర్భంలో తెలంగాణలో ఒంటరిగా బలపడాలన్న భావన ఆ పార్టీ నేతల్లో నెలకొంది. కానీ తన షరత్తులు అంగీకరించడంలేదు అన్న కారణంతో కాంగ్రెస్‌తో విభేదించి కెసిఆర్ బిజెపివైపు చూస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ సమాచారం ఉన్న కేంద్ర మంత్రి, కాంగ్రెస్ ఆగ్రనేత జైరాం రమేష్ కెసిఆర్ వ్యవహార శైలీపై మాటల తూటాలు పేల్చారు. కెసిఆర్ వస్తే దొరల రాజ్యం వస్తుందని, కాంగ్రెస్‌పార్టీతోనే సామాజిక తెలంగాణ సాధ్యమని టి జేఏసీ నేతలతో సమావేశం సందర్బంగా ఆయన చెప్పారు. దీనిపై కెసిఆర్‌తో సహా టిఆర్‌ఎస్ పార్టీ నేతలంతా ఘాటుగా స్పందించారు. పొత్తు, విలీనం అంటున్న కాంగ్రెస్ ఆ ధర్మాన్ని పాటించకుండా తమ పార్టీ నేతలను చేర్చుకొని కవ్వింపుచర్యలకు దిగుతోందని విమర్శిస్తున్నారు. దీంతో ఇరు వైపుల మాటల తూటాలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్, టిఆర్‌ఎస్‌ల మధ్య పొత్తు కుదరుతుందా లేక వేర్వేరు బాటలో ఆ పార్టీలు పయనిస్తాయా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ విధంగా రెండు పార్టీలు చేతికి చెయ్యిచ్చాయని అంటున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి హైవోల్టేజి షాక్ తగిలినట్లుగా అయిందని అంటున్నారు. Every single Vote for YSRCP = CONG - sampoo
|
   
Methhanithodugu
Legend Username: Methhanithodugu
Post Number: 30150 Registered: 12-2008 Posted From: 117.195.207.59
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Monday, March 03, 2014 - 06:52 am: |
    |
kattukunnodu vadilesad unchukunta annodu vadilesaadaaa ??? congress ditched by jagan and KCR ..its quoted that jagan promised on bible with congress from chanchal guda Jail ...
సూర్య ప్రధాన ప్రతినిధి, హైదరాబాద్):ఒంటరిగా వస్తే ఓటేస్తారో లేదోననే అనుమానంతో పొత్తుల కోసం ప్రయత్నించిన కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో దారుణంగా దెబ్బతిన్నది. రాష్ట్ర విభజన అంశాన్ని తనకు అనుకూలంగా మలచుకుని తెలంగాణలో టిఆర్‌ఎస్‌తోనూ, మిగిలిన ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్ సిపితోనూ జట్టుకట్టి మళ్లీ అత్యధిక స్థానాలు సాధించి కేంద్రంలో అధికారంలోకి రావాలని ప్లానేసిన కాంగ్రెస్ చతికిలపడింది. తెలంగాణ సాధన కోసం గత 13 ఏళ్లుగా అహర్నిశలు శ్రమిస్తున్న కెసిఆర్‌ను దారికి తెచ్చుకున్నామని ఇటీవలి కాలం వరకు కాంగ్రెస్ సంతోషించింది. అదే విధంగా కేసులలో కూరుకుపోయిన జగన్‌ను కూడా కాంగ్రెస్ పార్టీ చేరదీసింది. ఇటు కేసిఆర్ అటు జగన్ తమకు పావులుగా దొరకడంతో కాంగ్రెస్ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. అయితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయం పూర్తికాగానే కెసిఆర్ ఎదురు తిరిగారు. అదే విధంగా జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత జగన్ వ్యవహార శైలి మారిపోయింది. అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీకి కేంద్రంలో మద్దతు ఇస్తామని చెప్పిన ఆ పార్టీ నాయకులు ఆ తర్వాత అటుకేసి చూడటమే మానేశారు. జగన్ విషయంలో ముందునుంచి అనుమానపడుతూనే ఒక మత గ్రంధం సాక్షిగా ప్రమాణం చేయించుకున్నారని ఆప్పటిలో పుకార్లు వచ్చాయి. అయితే ఆ తర్వాత ఇరు పార్టీల మధ్య సఖ్యత దెబ్బతిన్నది. తెలంగాణ రాష్ట్రం ఇవ్వబోవడానికి ముందుగానే కాంగ్రెస్ పార్టీ జగన్‌కు ఉప్పందించిందని కూడా అప్పటిలో ఆరోపణలు వచ్చాయి. జగన్ సమైక్య రాష్ట్రం ఉద్యమానికి నాయకత్వం వహించి కోస్తా ఆంధ్ర, రాయలసీమల్లో బలపడాలని కాంగ్రెస్ ఆదేశించిందని కూడా అంటున్నారు. అయితే జగన్ బలపడిన తర్వాత గత మేలు మరచిపోయి కాంగ్రెస్‌కు హాండిచ్చారని అంటున్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక గాలులు వీస్తున్నాయని తేలడంతో ఆయన ప్లేటు ఫిరాయించారని అంటున్నారు. ముందుగా బిజెపివైపు వెళ్లేందుకు ఆయన తీవ్రంగా ప్రయత్నం చేశారు. పశ్చిమబెంగాల్ ముఖ్య మంత్రి మమతా బెనర్జీతో కలిసి జాతీయ రాజకీయాల్లో అడుగులేస్తున్న జగన్ ఎటువెళతారో ఇప్పటికీ స్పష్టం కాలేదు. అయితే బిజెపి వైపే వెళ్లేందుకు ఆయన ఇప్పటికి ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. ఎన్నికల తర్వాత బిజెపితో జతకడతానని ఆయన బిజెపి నేతలకు స్పష్టం చేస్తున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీకి దిమ్మతిరిగేలా చేస్తున్నది. అదే విధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తే పార్టీని విలీనం చేస్తామని కెసిఆర్ అన్నట్లు కాంగ్రెస్ అగ్రనేతలు కూడా చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కన్నా టిఆర్‌ఎస్‌తో విలీనం అంశాన్నే కాంగ్రెస్ పార్టీ సీరియస్‌గా తీసుకున్నది. కెసిఆర్ కాంగ్రెస్‌లో కలిస్తే తమకు తెలంగాణలో తిరుగు ఉండదని కాంగ్రెస్ పార్టీ ఎత్తుగడలు వేసింది. అందుకే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఏటికి ఎదురీది మరీ బిల్లును ఆమోదించేలా చేసుకుంది. కెసిఆర్ పార్టీని విలీనం చేస్తారని అన్నందుకే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుందని అప్పటిలోనే పుకార్లు వచ్చాయి. వర్కింగ్ కమిటీ నిర్ణయం తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎన్నో ప్రతిఘటనలు ఎదుర్కొంది. చివరకు ఆ పార్టీ ముఖ్యమంత్రి ఎదురుతిరిగినా నిరంకుశంగా రాష్ట్ర విభజన చేసేసింది. కేవలం కెసిఆర్ తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తారనే ఆశతో మాత్రమే ఈ పని చేశారని అందరూ అనుకున్నారు. అయితే ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత కెసిఆర్ మాట మార్చారని అంటున్నారు. అయితే దీనికి కాంగ్రెస్ పార్టీ తప్పిదం కూడా ఉందని టిఆర్‌ఎస్ నాయకులు అంటున్నారు. టిఆర్‌ఎస్‌ను దెబ్బతీయాలని కాంగ్రెస్ ప్రయత్నం చేయడం కెసిఆర్‌కు అరికాలిమంట నెత్తికెక్కించింది. టిఆర్‌ఎస్ బహిష్కరించిన మెదక్ ఎంపి విజయశాంతిని కాంగ్రెస్ పార్టీ చేర్చుకోవడంతో టిఆర్‌ఎస్ భగ్గుమంది. ఒక వైపు పొత్తు కోసమో లేదా విలీనం కోసమో ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా చేయడం ఏమిటని టిఆర్‌ఎస్ ప్రశ్నించింది. తెలంగాణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టడం నుంచి ఆమోదించడం వరకు కెసిఆర్ ఎంతో చాకచక్యంగా వ్యవహరించి కాంగెస్‌తో పని చేయించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకోవడం జరగగానే ఆయన మాట మార్చినట్లుగా కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. ఇప్పుడు కెసిఆర్ బిజెపి వైపు చూస్తున్నారని అంటున్నారు. ఎన్నికల తర్వాత బిజెపితో వెళ్లేందుకు ఆయన మంత్రాంగం సాగిస్తున్నారని అంటున్నారు. అయితే ఇది ఇంకా ధృవపడలేదు. అయితే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని ఇప్పటికే చాలా సర్వేలు వెల్లడించడంతో కెసిఆర్ కాంగ్రెస్‌తో కలిసివెళ్లేందుకు పునరాలోచించుకుంటున్నారని అంటు న్నారు. నిన్నమొన్నటి వరకు చెట్టాపట్టాలేసుకు తిరిగిన కాంగ్రెస్ టిఆర్‌ఎస్ పార్టీలు ఇప్పుడు బద్ధశత్రువుల్లా విమర్శించుకుంటున్నాయి.
Every single Vote for YSRCP = CONG - sampoo
|
   
Methhanithodugu
Legend Username: Methhanithodugu
Post Number: 30149 Registered: 12-2008 Posted From: 117.195.207.59
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Monday, March 03, 2014 - 06:48 am: |
    |
నో విలీనం – నో పొత్తు తెలంగాణ రాష్ట్ర సమితి కాంగ్రెస్ తో పొత్తు, విలీనం రెండింటికీ వద్దని చెప్పేందుకు సిద్దం అయ్యింది. కాంగ్రెస్ అగ్ర నేతలతో కె సీ ఆర్ సంభాషణ ఫలించింది. ఇప్పుడే విలీనం లేదా పొత్తు పెట్టుకుంటే తెలుగు దేశం బి జె పి తో కలిసి తెలంగాణ లో పోటీ చేసి గట్టి దెబ్బ తీసే ప్రమాదం ఉన్నదని అప్పుడు ఎదురయ్యే ఇబ్బందులని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు విడి విడిగా పోటీ చేస్తే టీ టీ డీ పీ ఖాళీ కావటం ఖాయమని ప్రభుత్వ వ్యతిరేక ఓటు కూడా ఆ రెండు పార్టీలకి కాకుండా మా వైపే వస్తుందని నమ్మకంగా చెప్పటంతో కాంగ్రెస్ మాత్రం సైలెంట్ పాటిస్తోంది. అందుకోసమే అపాయింటెడ్ డేట్ కూడా గెజిట్ తో పాటు ప్రకటించకుండా ఆపింది. నిశ్శబ్ధం కూడా ఒక రకమైన అంగీకారమే అని భావిస్తున్న టీ ఆర్ ఎస్ ఒంటరి పోరు పేరుతో కార్యకర్తలని, టీ జె ఏ సీ నేతలని బి జె పి వైపు కోకుండా చూసుకుంటోంది.  Every single Vote for YSRCP = CONG - sampoo
|
   
Methhanithodugu
Legend Username: Methhanithodugu
Post Number: 30148 Registered: 12-2008 Posted From: 117.195.207.59
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Monday, March 03, 2014 - 06:47 am: |
    |
పవన్ సొంత పార్టీ ఖాయం పవన్ కల్యాణ్ కొత్త పార్టీ పెట్టేందుకు సిద్దం అవుతున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ కంటే ముందే పవన్ పార్టీ ప్రకటన ఖాయం. పవన్ పార్టీ పెడితే కిరణ్ పార్టీఉండకపోవచ్చు. వచ్చేయ్ వారం మధ్యలో ఖచ్చితంగా 7 నుండి 15 మధ్యలో ముహూర్తం ఖరారు చేయమని పండితులని కోరిన పవన్ పేరు, వివరాలు, లక్ష్యాలు ఆ రోజు ప్రకటించనున్నారు.  Every single Vote for YSRCP = CONG - sampoo
|