   
Methhanithodugu
Megastar Username: Methhanithodugu
Post Number: 29180 Registered: 12-2008 Posted From: 117.213.229.31
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Tuesday, February 11, 2014 - 06:51 am: |
    |
26న ఎన్నికల నోటిఫికేషన్! దేశవ్యాప్తంగా జరగాల్సి ఉన్న సార్వత్రిక ఎన్నికల గంట మోగే సమయం ఆసన్నం కాబోతోంది. ఈనెల 21 వరకు పార్లమెంటు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఆ సమావేశాలు ముగిసిన వెంటనే కొన్ని రోజుల వ్యవధిలోనే అంటే 26వ తేదీనే సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడుతుందని ఢల్లీ వర్గాలు తెలియజేస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికలతో పాటుగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు కూడా ఎన్నికలు ఉంటాయని ఎన్నికల సంఘం ఇదివరకే ప్రకటించింది. ఆ నేపథ్యంలో నోటిఫికేషన్ వెలువడే తేదీ కాస్తంత ముందుకు రావడం ప్రాధాన్యం సతరించుకుంటోంది. మామూలుగా అయితే మార్చి మొదటివారంలో ఎన్నికల నోటిఫికేషన్ రావచ్చునని చాలా రోజులుగా ఊహాగానాలు సాగుతున్నాయి. అయితే ఇప్పుడు ఆ తేదీ కాస్తా ముందుకు వచ్చింది. ఈనెల 26న ఖరారుగా నోటిఫికేషన్ వస్తుందని అంతా అంటున్నారు. ఎంత ఆలస్యం అయినప్పటికీ.. నెలాఖరులోగా నోటిఫికేషన్ వస్తుందని చెబుతున్నారు. నోటిఫికేషన్ రాగానే రాష్ట్రంలో కూడా ఇక ఎన్నికల కాక మొదలైనట్లే. విభజన జరిగితే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఆరునెలలు వాయిదా పడవచ్చునని, నియోజకవర్గాల పునర్విభజన కూడా పూర్తయిన తర్వాత మాత్రమే ఎన్నికలు పెడతారని ఒక వాదన వినిపిస్తోంది గానీ.. అందులో బలం లేదు. నియోజకవర్గాల పెంపు వచ్చే ఎన్నికలకు ముందు మాత్రమే అవుతుందని అనుకుంటున్నారు.
 I believed KKR. still believing .. Imust be gorre - Linkmaster , Choopulu Kalisina Subavela
|