Kiran Hero - Sonia Direction - Arik... Chalanachithram.com | Topics | Search
Hide Clipart | Log Out | Register | Edit Profile

Last 30 mins | 1 | 2 | 4 hours     Last 1 | 7 Days

Chalanachithram.com DB » New TF Industry Related » Archive through February 06, 2014 » Kiran Hero - Sonia Direction - Arikatla Analysis « Previous Next »

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Methhanithodugu
Megastar
Username: Methhanithodugu

Post Number: 29002
Registered: 12-2008
Posted From: 117.195.193.128

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Wednesday, February 05, 2014 - 10:50 am:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)

కిరణ్ దీక్షలో "అధిష్టానం మార్కు''

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎంతో సాహసోపేతంగా నిర్వహించిన "సమైక్య మౌనదీక్ష'' అను హైడ్రామాకు అజ్ఞాత రచయిత అధిష్టానమే అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీమాంధ్రలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిని సమైక్య ఛాంపియన్ గా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్న అధిష్టానమే ఈ దీక్షకు కర్త, కర్మ, క్రియగా వ్యవహరించిందని అంటున్నారు విశ్లేషకులు.

వాస్తవంగా ముఖ్యమంత్రికి ఇలాంటి దీక్షలు, ధర్నాలు నిర్వహించే ఓపిక లేదు. ఆయన మనస్తత్వానికి ఇవన్నీ విరుద్ధం. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి పోరాడేంత ఓపిక, సహనం ఉన్న వ్యక్తి కాదు కిరణ్ కుమార్ రెడ్డి. అలాంటిది గాంధేయ మార్గంలో మౌనదీక్ష వరకూ వెళ్లడంటే దాని వెనుక గాంధీ పార్టీ వాళ్ల గైడెన్స్ ఉందని భోగట్టా.
దీక్ష రోజున ఉదయం నుంచి సాయంత్రం వరకూ జరిగిన పరిణామాలను చూస్తే ఈ విషయం ఎవరికైనా సులభంగానే అర్థం అవుతుంది. ఈ దీక్షలో అధిష్టానం మార్కు ఉందని అనేక పరిణామాలు సుస్పష్టం చేస్తున్నాయి.

ముఖ్యమంత్రి జంతర్ మంతర్ కు బయలు దేరుతున్న వేళ తెలంగాణ వాదులు మిడతల దండులా ఎలా వచ్చిపడ్డారు? అనేది మొదటి అనుమానం. తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతల ఆధ్వర్యంలో తెలంగాణ వాదులు విజృంభించి ముఖ్యమంత్రి కాన్వాయ్ కు అడ్డుపడటం అనేది అధిష్టానం గేమ్ ప్లాన్ లో భాగంగా జరిగిందని వినికిడి. విలన్ లేకపోతే హీరోయిజం పండదు. తెలంగాణ వాదులు వచ్చి అడ్డుపడకపోతే కిరణ్ ను హీరోను చేసే డ్రామా పండదు! అని గ్రహించి తెలంగాణ వాదులను అధిష్టానమే అక్కడికి రప్పించిందని తెలుస్తోంది. లేదంటే.. ముఖ్యమంత్రి మానాన ముఖ్యమంత్రి దీక్ష చేస్తుంటే.. ఆయనను పూచిక పుల్లలా తీసి పడేసే తెలంగాణ వాదులు ఎందుకు అడ్డుపడతారు చెప్పండి!

అధిష్టాన దర్శకత్వ పటిమను చాటే రెండో విషయం.. సీమాంధ్ర కాంగ్రెస్ ప్రముఖుల అంతా అక్కడ ప్రత్యక్షం కావడం. ముఖ్యమంత్రి అధిష్టాన నిర్ణయానికి వ్యతిరేకంగా చేపట్టిన దీక్ష లో పాల్గొనడానికి ఏ ఒక్క కాంగ్రెస్ అధిష్టాన విధేయుడూ వెనుకాడలేదు! అందరూ దీక్షలో పాల్గొన సంఘీభావం తెలిపారు! మరి అధిష్టానం అనుమతి లేనిదే వారు వచ్చి ఉంటారంటే నమ్మడానికి ఏపీ ప్రజలు వెర్రివాళ్లు కాదు!

ముఖ్యమంత్రి దీక్షకు అధిష్టానం ఘోస్ట్ గా స్క్రిప్ట్ అందించిందని ఈ సైడ్ లైట్స్ నిరూపిస్తున్నాయి!


Andhra TDP kalu mokkuta :-( ,Choopulu Kalisina Subavela
"Meaning of Self respect " ysr mistake


Add Your Message Here
Post:
Bold text Italics Underline Create a hyperlink Insert a clipart image HASH(0x970b424){Movie Clipart}
Show / hide regular icons selection options

Click on following links to open cliparts by Alphabetical Order

 A   B   C   D   E   F   G   H   I   J   K   L   M  

 N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z  

Show / Hide Filmy icons selection options

Click on following links to open cliparts by Alphabetical Order

 A   B   C   D   E   F   G   H   I   J   K   L   M  

 N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z  

Username: Posting Information:
This is a public posting area. Enter your username and password if you have an account. Otherwise, enter your full name as your username and leave the password blank. Your e-mail address is optional.
Password:
E-mail:
Options: Enable HTML code in message
Automatically activate URLs in message
Action: