| Author |
Message |
   
Methhanithodugu
Megastar Username: Methhanithodugu
Post Number: 28421 Registered: 12-2008 Posted From: 117.195.219.102
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Tuesday, November 12, 2013 - 07:42 am: |
    |
4.5 bakras hero selfish kirri
రచ్చబండ పేరు చెప్పి కిరణ్ తెలంగాణ ప్రాంతంలో అడుగుపెడితే.. యుద్ధం తప్పదనే రేంజిలో తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నాయకులు కూడా.. ఆయన మీద తీవ్రమైన స్వరంతో విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో మొత్తనికి ముఖ్యమంత్రి కిరణ్ తానే ఒక అడుగు వెనక్కు తగ్గారు. జగ్గారెడ్డి ఉన్నంత వరకు తన సేఫ్టీకి సంబంధించి సమస్య ఉండదనేఉద్దేశంతో సంగారెడ్డిలో తన రచ్చబండ పర్యటనను ప్లాన్ చేసుకున్న ముఖ్యమంత్రి కిరణ్.. సహచర తెలంగాణ ప్రాంత మంత్రులు వచ్చి కోరడంతో వారి కోరికను మన్నించి తన రచ్చబండ ఆలోచనను రద్దు చేసుకోవాల్సి వచ్చింది. నిన్న మొన్నటిదాకా ముఖ్యమంత్రి కిరణ్‌కు అత్యంత విధేయుల్లో ఒకరుగా ఉన్న తెలంగాణ ప్రాంత నాయకుడు గండ్ర వెంకటరమణా రెడ్డి వంటి వారు కూడా ఆయన పట్ల తీవ్రస్వరంతో హెచ్చరిక మాటలు మాట్లాడడం కూడా ఈ సందర్భంగా గమనార్హం. గండ్ర స్వయంగా కిరణ్ తమకు సీఎం కానే కాదని, ఆయనను రచ్చబండకు అనుమతించేది లేదని కూడా ప్రకటించారు. ఇలాంటి ప్రకటనల నేపథ్యంలో మంత్రులు గీతారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, విప్ జగ్గారెడ్డి ముఖ్యమంత్రిని కలిశారు. వారు ఏం మంత్రాంగం నడిపారో తెలియదు గానీ.. మొత్తానికి సీఎంట రచ్చబండ టూరు రద్దయింది. ఆదిలాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ సభ ఉన్నందున ఆ కారణంచేత సీఎం సంగారెడ్డి పర్యటనను వాయిదా వేసుకున్నట్లు చెబుతూ ఈ వెనక్కు తగ్గడాన్ని కవర్‌చేసే బాధ్యతను విప్ జగ్గారెడ్డి తీసుకున్నట్లు కనిపిస్తోంది. మంత్రులు, ఎమ్మెల్యేల కోరిక మేరకు వాయిదా వేసుకున్నారే తప్ప.. తెరాస, జేఏసీలకు భయపడి కాదని జగ్గారెడ్డి అన్నారు. సంగారెడ్డి లో అసలు బంద్ చేయగలిగే దమ్ము ఎవరికి ఉన్నదంటూ ప్రశ్నిస్తున్న ఆయన.. త్వరలోనే సంగారెడ్డిలో లక్షమందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తాం అంటూ పేర్కొన్నారు. ఆసభకు సీఎం కిరణ్ కూడా వస్తారన్నారు. రచ్చబండలో సీఎం వచ్చి ఉంటే మెదక్‌జిల్లాకు 200 కోట్లు వచ్చి ఉండేవని ఆయన ఆవేదన వ్యక్తంచేయడం విశేషం.  Andhra NGO ,Jai Kabjavani "rara o'sodaruda raa na chelikaaada"- Gajal Srinivas Geyam
|
   
Thokka_tholu
Junior Artist Username: Thokka_tholu
Post Number: 479 Registered: 02-2013 Posted From: 124.123.229.129
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Tuesday, November 12, 2013 - 07:30 am: |
    |
Methhanithodugu:
plan cheyyatamenduku.. thoka mudavatam enduku... Duraashaato modalainadi, avamaanam tho mugustundi |
   
Methhanithodugu
Megastar Username: Methhanithodugu
Post Number: 28420 Registered: 12-2008 Posted From: 117.195.219.102
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Tuesday, November 12, 2013 - 07:19 am: |
    |
fullto police ayina ussa Sangareddy pejala power ruchi miss ayyare .... ‘సమైక్యవాదినే..’ అంటూ పదే పదే చెబుతున్న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, రచ్చబండ కార్యక్రమం పేరుతో ప్రజల్లోకి వెళ్ళడానికి సిద్ధమయ్యారు. తెలంగాణలోని మెదక్ జిల్లా, సంగారెడ్డిలో సీఎం చేతుల మీదుగా రచ్చబండ కార్యక్రమం నిర్వహించాలని ఎమ్మెల్యే జగ్గారెడ్డి పక్కా వ్యూహం రచించారు. వ్యూహం.. అని ఎందుకు అనాల్సి వస్తోందంటే, కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలే సీఎం కిరణ్‌ని వ్యతిరేకస్తోంటే, విప్ జగ్గారెడ్డి కిరణ్‌కి అండగా నిలిచారు మరి. తాను సమైక్యవాదినని జగ్గారెడ్డి కూడా చెబుతూ వస్తున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో సీఎం కిరణ్ మెదక్ ‘రచ్చబండ’ ఏమవుతుందోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ‘రచ్చబండకి ఎవరూ హాజరు కావొద్దు..’ అని సాక్షాత్తూ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ అనధికారిక ఆదేశాల్ని పార్టీ శ్రేణులకు ఇచ్చారనే ప్రచారమూ నెలకొన్న దరిమిలా, జగ్గారెడ్డి సత్తా చూపించే టైమొచ్చిందని అంతా అనుకున్నారు. అయితే అనూహ్యంగా జగ్గారెడ్డికి షాక్ తగిలింది. ‘రచ్చబండ’ వాయిదా పడిరది. వేరే కార్యక్రమం వుండడం వల్లే.. అని జగ్గారెడ్డి కహానీలు విన్పించాల్సి వస్తోందిప్పుడు. రాష్ట్ర విభజన దిశగా కేంద్రం దూసుకుపోతోంటే, పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా సమైక్య నినాదం విన్పిస్తున్న కిరణ్, రచ్చబండ పేరుతో తెలంగాణలో అడుగు పెడితే పరిస్థితులు ఉద్రిక్తంగా మారతాయన్న ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో కిరణ్, తన ఆలోచన మార్చుకున్నారనే గుసగుసలు విన్పిస్తున్నాయి. అయితే జగ్గారెడ్డి మాత్రం ఈ వాదనల్ని కొట్టి పారేస్తున్నారు. ఆయనెంత బుకాయించినా.. ఇప్పటికే చేసుకున్న ఏర్పాట్లు.. ఇతర పార్టీలపై చేసిన కామెంట్లు.. ఇవన్నీ వృధా అయిపోవడంతో, ఈ షాక్ జగ్గారెడ్డికి గట్టిగానే తగిలిందని చెప్పుకోవచ్చు.
 Andhra NGO ,Jai Kabjavani "rara o'sodaruda raa na chelikaaada"- Gajal Srinivas Geyam
|
|