   
Methhanithodugu
Megastar Username: Methhanithodugu
Post Number: 27804 Registered: 12-2008 Posted From: 117.213.226.218
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Thursday, September 12, 2013 - 01:07 am: |
    |
సీమాంధ్రలో వైఎస్ ఫార్ములా? హైదరాబాద్, మేజర్ న్యూస్: రాష్ట్ర విభజన నిర్ణయంతో తెలంగాణలో గెలుపు ఖాయంగా భావిస్తున్న కాంగ్రెస్ హైకమాండ్ సీమాంధ్రలో మాత్రం నష్టపోకుండా చర్యలు తీసుకొంటోంది. వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి కనీసంగా ముపె్సై ఎంపీ సీట్లు గెలిస్తేనే కేంద్రంలో మళ్లీ అధికారంలోకి రాగలమని కాంగ్రెస్ హైకమాండ్ బావిస్తోంది. అప్పుడే రాహుల్‌ను ప్రధానిగా చేయాలన్న లక్ష్యం నెరవేరుతుందని ఆ పార్టీ వర్గాలు సైతం పేర్కొంటు న్నాయి. అయితే విభజన నిర్ణయంతో తెలంగాణాలో స్వీప్ చేస్తామన్న భావనతో ఉన్న కాంగ్రెస్‌కు ఆ ప్రాంతంలో వచ్చే పదిహేను, పదహారు ఎంపీ సీట్లతో కేంద్రంలో అధికారంలోకి రావడం కష్టమే. ఇదే భావనతో ఉన్న కాంగ్రెస్ హైకమాండ్ సీమాంధ్రలో ఉన్న 25 ఎంపీ సీట్లలో మెజార్టీ సీట్లు కైవసం చేసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రాన్ని విభజిస్తే అన్ని సీట్లు సాధించడం కాంగ్రెస్‌కు కష్టసాధ్యమే. ఈ నేపథ్యంలోనే... సమైక్యాంధ్ర సెంటిమెంట్‌తో అక్కడి వోట్లు కొల్లగొట్టే కొత్త పార్టీలను తెరపైకి తీసుకురావాలని అధిష్ఠానం తీవ్రంగా ఆలోచిస్తున్నది. తాను సృష్టించే ఈ సమైక్యాంధ్ర పార్టీలతో ఆ సీట్లను సాధించి చివర కు కేంద్రంలో అధికారం కో సం కావాల్సిన మెజార్టీ సీట్లను సాధించాలని కాంగ్రెస్ హై కమాండ్ యోచిస్తోంది. ఈ లక్ష్యసాధనలో భాగంగానే కాంగ్రెస్‌పార్టీ సీమాంధ్ర ప్రాంతంలో మూడు కొత్త పార్టీల సృష్టించేందుకు సన్నాహాలు చేస్తోందని తెలుస్తోంది. తద్వారా విభజన నిర్ణయంతో తనకు వ్యతిరేకంగా ఏర్పడే ఓట్లు వైఎస్సార్ సిపి, టిడిపి ఖాతాల్లోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకొంటోందని సమాచారం. 2009 ఫార్ములా.. దివంగత నేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి 2009లో అమలు చేసిన ఫార్ములాను ప్రస్తుతం కాంగ్రెస్ హైకమాండ్ అమ లుచేయాలని భావిస్తోంది. 2004లో అధికారంలోకి వచ్చి న కాంగ్రెస్ పార్టీకి 2009 నాటికి కొంత ప్రజా వ్యతిరేకత రావడం సహజమని భావించిన నాటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి నాడు కొత్త పార్టీల ఏర్పాటుకు పరో క్షంగా ప్రోత్సాహం అందించారని ప్రచారం ఉంది. 2009 ఎన్నికలకు ముందు ప్రజారాజ్యం పార్టీ, లోక్‌సత్తా పార్టీలు ఆవిర్భవించి ఆతరువాత అవి ఎన్నికల్లో పాల్గొన్న విషయం తెలిసిందే. దీంతో నాడు కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక ఓట్ల ను ఈ రెండు పార్టీలు భారీగా చీల్చగలిగాయి. ఈ కారణం చేతనే నాడు టిఆర్‌ఎస్, సిపిఎం, సిపిఐతో పొత్తుపెట్టుకొని మహాకూటమిని టిడిపి ఏర్పాటు చేసుకొన్నా మెజార్టీ సీట్లు నుదక్కించుకోలేకపోయిం నాడు బోటాబోటీ మెజార్టీతో వై.ఎస్. ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావడానికి నాడు ప్రధానంగా పిఆర్‌పి, లోక్‌సత్తా పార్టీలు దోహదం చేశా యని రాజకీయ ఉద్దండులు సైతం విశ్లేషణలు చేశారు. సీమాంధ్రలో పిఆర్‌పి ప్రభావం మెండగా ఉండటమే కా కుండా 2009లో 17 శాతం ఓట్లను సాధించుకొంది. పి ఆర్‌పికి వచ్చిన ఈ ఓట్లశాతంలో మెజార్టీ వ్యతిరేక ఓట్లు చేరాయన్నది రాజకీయ వర్గాలు సైతం పేర్కొన్నాయి. ఈవిషయాన్ని ముందస్తుగా ఊహించి నాడు వై.ఎస్. సైతం పరోక్షంగా, అంతర్గతంగా పిఆర్‌పి ఏర్పాటుకు సహకరిం చారన్న ప్రచారం కూడా ఉంది. ప్రస్తుతం రాష్ట్ర విభజన నిర్ణయంతో సీమాంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి ము ఖం చెల్లని పరిస్థితి నెలకొంది. ఈ వ్యతిరేకత నుంచి స్వ యంగా గట్టెక్కలేని స్థితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తన ఓటు బ్యాంకు శాశ్వతంగా టిడిపి, వైఎస్సార్‌సిపి పార్టీల ఖాతా లోకి వెళ్లకుండా 2009నాటి వై.ఎస్.ఫార్ములాను అను సరించేందుకు సిద్దమవుతోంది. ఇందుకోసం సీమాంధ్ర ప్రాంతంలో మూడు కొత్త పార్టీల ఏర్పాటుకు బీజం వేస్తు న్నట్లు విశ్వసనీయ సమాచారం. సమైక్యాంధ్ర రాష్ట్ర సమితి పార్టీ, సమైక్యాంధ్ర పార్టీ, నవ్యాంధ్ర పార్టీ ఇలా మూడు పేర్లతో కొత్త పార్టీల ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నా యని విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే కొందరు వ్యక్తుల చేత సమైక్యభావజాలం కలిగిన పార్టీ ఏర్పాటుకు బీజం వేసినట్లు తెలిసింది. వీరు పార్టీల ఏర్పాటుకోసం ఎన్నికల కమిషన్‌కు ధరఖాస్తులు చేసుకొంటున్నట్లు తెలిసింది. ఈ మూడు పార్టీలను తెరపైకి తీసుకురావడంద్వారా తననుం చి వెళ్లిపోయే ఓట్లు ఆయా పార్టీలకు పడేట్లు వ్యూహరచన చేస్తోంది. రాష్ట్రాన్ని రెండుగా చీల్చడంవల్ల తెలంగాణలో 17 ఎంపీ సీట్లు, సీమాంధ్రలో25ఎంపీ సీట్లు ఉంటాయి. తెలంగాణలో 15 నుంచి 16ఎంపీ సీట్లపై ధీమాతోఉన్న కాంగ్రెస్‌పార్టీకి, సీమాంధ్రలో కూడా మెజార్టీ సీట్లు సాధిం చుకోనిదే కేంద్రంలో తిరిగి అధికారంలోకి రావడం కష్టం. కనుక మూడు కొత్త పార్టీలను తెరపైకి తీసుకురావడం ద్వా రా ఆయా పార్టీలకు వచ్చే ఎంపీ సీట్లతో తిరిగి కేంద్రంలో అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ అధినాయకత్వం స న్నాహాలు Andhra NGO "rara o'sodaruda raa na chelikaaada" - "Jana gana mana ..tava subha..Ashisha Maa'n'ge" - Andhra Praja Gay?akudu gajala Srinivas
|