Brahmastram = BJP Mps Chalanachithram.com | Topics | Search
Hide Clipart | Log Out | Register | Edit Profile

Last 30 mins | 1 | 2 | 4 hours     Last 1 | 7 Days

Chalanachithram.com DB » New TF Industry Related » Archive through August 30, 2013 » Brahmastram = BJP Mps « Previous Next »

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Methhanithodugu
Megastar
Username: Methhanithodugu

Post Number: 27554
Registered: 12-2008
Posted From: 117.195.220.125

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Friday, August 30, 2013 - 10:31 am:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)

part 2 అప్పుడు స్వీట్లు పంచుకున్నారు....ఇప్పుడు కత్తులు దూసుకుంటున్నారు2000 సంవత్సరంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో వున్నప్పుడు మూడు రాష్ట్రాలను ఇవ్వడం జరిగింది. అప్పట్టో రాష్ట్ర విభజన జరిగితే ఇరు ప్రాంతాల ప్రజలు స్వీట్లు పంచుకున్న సందర్భాలున్నాయి. విభజన నేపథ్యంలో ఆనందడోలికల్లో మునిగిపోయారు. ఒక విధంగా చెప్పాలంటే స్థానికులు రాష్ట్రాల విభజనను ఆస్వాదించారు. కానీ కాంగ్రెస్‌ పార్టీ దేశంలో ఎన్నో వివాదాలు వున్నప్పటికీ ఒక్క తెలగాణ రాష్ట్రాన్నే ప్రకటించడం జరిగింది. ప్ర టన వెలువడడానికి ముందు వివిధ పార్టీలతో కానీ, నాయకులతో కానీ సమగ్రమైన రీతిలో చర్చించలేదు. సుహృద్భావ వాతావరణానికి ఆస్కారం ఇవ్వలేదు. ఫలితంగా సీమాంధ్ర ప్రాంతం అగ్నిగుండం అవుతోంది. స్థానికులంతా తిరగబడ్డారు. ఊరూ వాడా ఏకమయ్యాయి. చిన్నా పెద్దా ఉద్యమపథాన పయనిస్తున్నారు.లోక్‌సభలో, రాజ్యసభ లోనూ సీమాంధ్ర ప్రాంతానికి చెందిన పార్లమెంట్‌ సభ్యులు పెద్ద ఎత్తున గలాభా సృష్టిస్తున్నారు. ఈ గందరగోళం అంతటికీ కాంగ్రెస్‌ పార్టీ అని బిజెపి నిందిస్తోందఇంతేకాకండా విభజనకు మద్దతు ఇవ్వడం ద్వారా తెలంగాణ ప్రాంతంలో గణనీయమైన సంఖ్యలో లోక్‌సభ సీట్లు సాధించాలని భారతీయ జనతా పార్టీ నాయకత్వం వ్యూహరచన చేసింది కూడా.

కొత్త పల్లవి
శరవేగంగా మారుతున్న పరిస్థితులలో భారతీయ జనతా పార్టీ నాయకత్వం సైతం వ్యూహాన్ని మార్చుకోవలసి వస్తోంది. ఒక జాతీయ పార్టీగా దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజల మనోభావాలను తాము గౌరవించాల్సి వుంటుందనే రీతిలో ఆ పార్టీ నాయకులు వ్యాఖ్యానిస్తుండటం తాజా పరి ణామం. తాము ఇప్పటికీ తెలంగాణకు వ్యతిరేకం కాకపో యిన ప్పటికీ కాంగ్రెస్‌పార్టీకీ విభజన ప్రక్రియను సాఫీగా కొనసాగించడం చేతకాలేదని, ఫలితంగానే ఈ అనర్థాలు ఏర్పడ్డాయనే అభిప్రాయం పార్టీ జాతీయ, స్థానిక నాయకులలో ఏర్పడటం విశేషం. రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాలలోనూ బిజెపికి గణనీయమైన ఆదరణ వున్న వాస్తవాన్ని బిజెపి నాయకత్వం గమనించడం ప్రారంభిం చింది. కాకినాడ ఒప్పం దం ప్రకారం ఒక ఓటు రెండు రాష్ట్రాలు అన్న నినాదానికి ఇప్పటికీ కట్టుబడి వున్నామని చెబుతున్న నాయకత్వం సమీప భవిష్యత్తులో తెలంగా ణలో తిరుగు లేని ఆధిపత్యాన్ని చలాయించాలనే ఆలోచ నలో వుంది.

బ్రహ్మాస్త్రం ఎవరు?
ఇదిలా వుండగా ఇటీవలి కాలంలో పార్లెమెంట్‌లో తెలంగాణ బిల్లు పాస్‌ కాకుండా తాము బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తామని సీమాంధ్ర ఎం.పి.లు ప్రకటిస్తూ వస్తున్నారు. రాష్ట్రం సమైక్యంగా వుండాలంటే తెలంగాణ బిల్లుకు బ్రేకులు వేయడం మినహా మరో మార్గం లేదని సీమాంధ్ర పార్లమెంట్‌ సభ్యులు ఒక నిశ్చితాభిప్రాయానికి రావడం జరిగింది. విభజన అనివార్యమని ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంది, ప్రధానమంత్రి మన్‌మో హన్‌సింగ్‌, రాష్ట్ర కాంగెరస్‌ వ్యవహారాల ఇంచార్జి
దిగ్విజయ్‌సింగ్‌ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో హైకమాండ్‌ మనసులో ఏముందో తెలుసుకున్న సీమాంధ్ర నాయకుల పార్లమెంట్‌లో బిల్లును ఆపడం మినహా మరో దారి లేకుండా పోయింది. ఈ క్రమంలోనే బిజెపి అగ్రనేత, ఆంధ్ర్రప్రాంతానికి చెందిన ముప్పవరపు వెంకయ్యనా యుడుతో టచ్‌లో వున్నట్టు సమాచారం. వెంకయ్యనా యుడు రూపంలో బ్రహ్మాస్త్రాన్ని సంధించే యోచనలో వున్నారని సమాచారం.

మారిన తాజా పరిణామాల నేపథ్యంలో బిజెపి అనుసరించనున్న వ్యూహం ప్రముఖ పాత్రను పోషించే అవకాశాలు లేకపోలేదు. కాగా బిజిపి అగ్రనేత ఎం.వెంకయ్యనాయుడు మాట్లాడుతూ తాము మూడు రాష్ట్రాలను పదమూడు సంవత్సరాల క్రితం ఇచ్చినప్పుడు ఏమైనా ఉద్యమాలు జరిగాయా అని ప్రశ్నించారు.తాము తెలంగాణకు వ్యతిరేకం కాదని స్పష్టం చెశారు. 2000 సంవత్సరంలో తాము రాష్ట్రాలను పరిపాలనా సౌలభ్యం కోసం విభజిస్తే ఇరు ప్రాంతాలకు చెందిన ప్రజలు స్వీట్లు పంచుకున్నారని, ఇప్పుడు కేవలం కాంగ్రెస్‌ పార్టీ వల్లనే ఇరు ప్రాంతాలలో ఉద్యమాలు పెచ్చరిల్లాయని, పలువురు ప్రాణాలు కోల్పోయారని, అస్థిరత ఏర్పడిందని, జనజీవనం అతలాకుతలం అయిందని వ్యాఖ్యానించారు. విభజనలో రాజకీయం ఏమిటని ఆయన సూటిగా ప్రశ్నించారు.
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Methhanithodugu
Megastar
Username: Methhanithodugu

Post Number: 27553
Registered: 12-2008
Posted From: 117.195.220.125

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Friday, August 30, 2013 - 10:29 am:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)

part 1 టీ బిల్లుకు చిల్లులు?
హైదరాబాద్‌, (సూర్య ప్రధాన ప్రతినిధి): తెలంగాణ బిల్లుకు మద్దతు ఇచ్చే విషయంలో లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ పునరాలోచనలో పడిందా? రాష్ట్ర విభజనను రాజకీయ కోణంలో కాంగ్రెస్‌ పార్టీ అధినాయకత్వం స్పృశిస్తోందన్న ఏపగింపు బిజెపిలో ఏర్పడిందా? 2000లో ఎన్డీఏ ప్రభు త్వం మాదిరిగా సుహృద్బావ వాతావరణంలో విభజన చేయలేని అచేతనమైన స్థితిలో కాంగ్రెస్‌ వుందనే అభిప్రాయంతో బిజెపి వుందా? సీమాంధ్ర ప్రజల గుండెకు అయిన గాయం మానడానికి కాంగ్రెస్‌ నాయ కత్వం వద్ద వున్న తరుణోపాయం ఏమిటి? ఇత్యాది సందే హాల నేపథ్యంలో పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లుకు స్వచ్చందంగా మద్దతు ఇచ్చేందుకు ముందుకు వచ్చిన బిజెపి మారిన తాజా పరిణామాల నేపథ్యంలో వెనకడుగు వేస్తున్నట్టు సమాచారం. ఇటీవల సంభవించిన పలు సంఘటనలను బట్టి ఈ వాదనకు బలం చేకూరుతోందని ఢిల్లీ వర్గాల బోగట్టా. తె లిసిన వివరాల ప్రకారం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ప్రతిపాదనకు పార్లమెంట్‌లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ మొదటి నుంచీ బేషరతుగా మద్దతునిస్తామని ప్రకటిస్తూ వస్తోంది.

ఇటీవల తాము తెలంగాణ రాష్ట్రం ఇస్తున్నట్టు కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ ప్రకటించినప్పటి నుంచి తొలుత టి.బిల్లుకు సంపూర్ణ మద్దతునిస్తామని ప్రకటించింది కూడా. అయితే అదే సమయంలో సీమాంధ్ర ప్రాంతంలో సమైక్య ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడటం, ఏక పక్షంగా రాష్ట్ర విభజనను కాంగ్రెస్‌ ప్రకటించడంతో బిజెపి పునరా లోచనలో పడినట్టు తెలుస్తోంది. సున్నితమైన అంశమైన రాష్ట్ర విభజనను సొంత పార్టీ కార్యక్రమంలాగా పరిగ ణించడం పట్ల బిజెపి అభ్యంతరం వ్యక్తం చేసింది. రాజకీయ అవసరాలకు అనుగుణంగా తెలంగాన ప్రక్రియను ఆలస్యం చేయడం బిజెపికి రుచించడం లేదు. ఈ నేపథ్యంలోనే విభజనపై మనసు మార్చుకున్న బిజెపి పార్లమెంట్‌లో సీమాంధ్ర సభ్యుల ఆందోళన పట్ల సాను భూతి చూపడం జరిగింది. ఈ హఠాత్పరిణామంతో కంగు తిన్న కాంగ్రెస్‌ పార్టీ సభ్యుల సస్పెన్షన్‌ను ఉపసం హరించుకోక తప్పలేదు. కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వం రాజకీయ కోణంలో ఆలోచిస్తున్నప్పుడు తామెందుకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలనే యోచనలో బిజెపి జాతీయ నాయకత్వం వున్నట్టు తెలుస్తోంది.

మోడీ పర్యటనతో మారిన్‌ సీన్‌
ఇదిలా వుండగా తెలంగాణ బిల్లుకు సంబంధించి బిజెపి మనసు మార్చుకోవడానికి పలు కారణాలు వున్నట్టు తెలుస్తోంది. బిజెపి ప్రచార కమిటీ సారధి, గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి హైదరాబాద్‌ పర్యటన ముగిసిన అనంతరం కమలనాధుల మనసు మారిందని తెలుస్తోంది. తెలంగాణ ప్రకటించిన నేపథ్యంలో రానున్న సాధారణ ఎన్నికలలో పార్టీల సరళి ఎలా వుండ బోతుందని మోడీ ఆరా తీశారు. కాంగ్రెస్‌ పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి జత కలిస్తే ఎన్నికలలో మెజారీటి సీట్లు ఆ రెండు పార్టీలకే లభిస్తాయని మోడికి ఉప్పందింది. మొదటినుంచి తెలంగాణ కోసం తాము పోరాడు తున్నామని, అయితే ఫలితం మాత్రం ఎన్గీడే కు దక్కరాదనే ఆలోకన కమలనాధులకు మెదిలింది. అంతే కాకుండా తెలంగాణపై తాము తీసుకున్న నిర్ణయంపై తొందరపడరాదనే నిర్ణయానికి ఆ పార్టీ నాయకత్వం రావడం జరిగింది. కాంగ్రెస్‌ పార్టీ తీసుకున్న సంకుచిత నిర్ణయం వల్ల సీమాంధ్ర ప్రాంత ప్రజల గుండెకు గాయమైందని, అక్కడ పరిస్థితిని చక్కదిద్దడం ఎవరితరం అనే డోలాయమా నంలో బిజెపి నేతలు పడ్డారు.
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Methhanithodugu
Megastar
Username: Methhanithodugu

Post Number: 27552
Registered: 12-2008
Posted From: 117.195.220.125

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Friday, August 30, 2013 - 10:23 am:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)

ani godugu anlaysis ... ide jarigithe inka congress emi feekina emi kaadu ...

Add Your Message Here
Post:
Bold text Italics Underline Create a hyperlink Insert a clipart image HASH(0x86ee1f4){Movie Clipart}
Show / hide regular icons selection options

Click on following links to open cliparts by Alphabetical Order

 A   B   C   D   E   F   G   H   I   J   K   L   M  

 N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z  

Show / Hide Filmy icons selection options

Click on following links to open cliparts by Alphabetical Order

 A   B   C   D   E   F   G   H   I   J   K   L   M  

 N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z  

Username: Posting Information:
This is a public posting area. Enter your username and password if you have an account. Otherwise, enter your full name as your username and leave the password blank. Your e-mail address is optional.
Password:
E-mail:
Options: Enable HTML code in message
Automatically activate URLs in message
Action: