Topics | Search Log Out | Register | Edit Profile
Hide Clipart | Banned/Unbanned User Log | Moderator Login History | Thread Delete/Move Log | Last 30 mins | 1 | 2
BJP and Vijayamma Rahasya Meeting

Chalanachithram.com DB » TF Industry related » Archive through June 04, 2013 » BJP and Vijayamma Rahasya Meeting « Previous Next »
Author Message
 

Methhanithodugu
Megastar
Username: Methhanithodugu

Post Number: 25152
Registered: 12-2008
Posted From: 117.195.222.187

Rating: 
Votes: 1 (Vote!)

Posted on Monday, June 03, 2013 - 10:35 am:       

Genuine Info endukante idi CM Intelligence Source
మాజీ టిడిపి ఎంపీలు ఇద్దరు ఈ విషయంలో అంటే ఎన్నికల అనంతరం భాజపాతో మోడీ ప్రధాని అభ్యర్థి అయ్యే పక్షంలో దోస్తీకి వైసీపీ అధినాయకత్వాన్ని అనుకూలంగా ప్రభావితం చేశారని తెలుస్తున్నది. మోడీ దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టుకునే విషయం ఎలా వున్నా, రాష్ర్టంలో వైసీపీ తో రహస్య ఒప్పందం చేసుకున్న విషయమై రాష్ర్ట శాఖకు కనీస సమాచారం లేదని తెలుస్తోంది. ఆ మాటకొస్తే బిజెపి జాతీయ నాయకత్వానికి కూడా ఈ తరహా సమాచారం లేదని వినికిడి. తెలుగుదేశంపార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇటీవల భాజపాతో జతకట్టే ప్రసేక్త లేదని విస్పష్టం చేసిన నేపథ్యంలో మరో ప్రధాన ప్రాంతీయ పార్టీ అయిన వైసీపీపై మోడీ గురిపెట్టినట్టు సమాచారం. అయితే రాష్ర్టంలో వైసీపీ తో పొత్తుకు చేసిన ప్రయత్నాలు ముందస్తుగా తెలిపితే ఇక్కడ వైసీపీ అంటే అవినీతి పార్టీ అని ఎండగడుతున్న బిజెపి జాతీయ నాయకుడు వెంకయ్య నాయుడు అడ్డుకుంటారనే గోప్యంగా వుంచారని తెలుస్తోంది. వాస్తవానికి భాజపాకు టిడిపిని దగ్గర చేయాలన్నది వెంకయ్యనా యుడు యోచనగా చెబుతుంటారు. గతంలో ఎన్డీయేకి టిడిపిని దగ్గర చేసిన ఓ ప్రముఖ పత్రికాధిపతి కూడా భాజపాతో వైసీపీ దోస్తానాను వ్యతిరేకిస్తారని భావనతోనే రహస్యంగా ఈతతంగాన్ని నడిపించారని చెప్పవచ్చు. వెంకయ్యనాయుడు, ఆ ప్రముఖ పత్రికాథిపతి కలిసి జాతీయ భాజపా నాయక త్వాన్ని ఆ దోస్తానాకు వ్యతిరేకంగా ప్రభావితం చేస్తారనే భావనతోనే మోడీ ఒంటరిగా ఈ వ్యవహారాన్ని నడిపించి ఒడంబడికను చేసుకున్నట్టు తెలుస్తున్నది. మోడీ మిస్టర్ క్లీన్ సీఎంగా పేరుతెచ్చుకున్నారు. ఇంత వరకు ఆయనకు అవినీతి మరక అంటలేదు. సుపరిపాలన, అవినీతి రహిత పాలన అందిస్తానని ఆయన కేంద్రంలో ప్రధాని పదవిని లక్ష్యంగా పెట్టుకుని వాగ్దానాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అవినీతి పార్టీ అని, కమీషన్లు దండుగోవడం తప్ప, ఆ పార్టీకి మిషన్ లేదని, దేశాన్ని ఆ పార్టీ కుంభకోణాల మయం చేసింద ని నిప్పులుచెరిగే మోడీ... రాష్ర్టంలో వేలకోట్లు ప్రజాధ నాన్ని దండుకున్న జైలు పార్టీగా అపప్రద మూటకట్టు కున్న వైసీపీతో దోస్తానాకు రహస్య ఒప్పందం చేసుకోవ డం ఎంతవరకు సబబు. ప్రధాని పదవి కోసం ఆయన ఏదైతే అవినీతికి వ్యతిరేకంగా పోరాడతానని చెబుతు న్నారో, అదే సిద్ధాంతానికి వైసీపీతో రహస్య ఒప్పందం ద్వారా తూట్లు పొడుస్తున్నారా అనే అనుమానం కలుగక మానదు. వైసీపీతో నరేంద్రమోడీకి పరోక్షంగా కుదిరిన రహస్య ఒప్పంద గురించి రాష్ర్టంలో భాజపాకు చెందిన కొందరికి సంకేతాలున్నాయా అనే అనుమానం కలుగుతోంది. మొన్నటి వరకు షర్మిళ, బ్రదర్ అనిల్‌ల అవినీతిపై తీవ్రస్థాయిలో రాష్ర్ట భాజపా ప్రతినిధి ప్రభాకర్ విరుచుకుపడిన విషయం తెలిసిందే. గత కొద్ది రోజులుగా ఆయన కానీ, భాజపా కానీ పెద్దగా వైసీపీపై అవినీతి ఆరోపణలు చేయడం లేదు. పై ఒప్పంద ప్రభావమే భాజపా నాయకుల మౌనానికి దారి తీసిందా అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. భాజపా జాతీయ స్థాయి లోని కొందరి నుంచి వైసీపీని లక్ష్యంగా విమర్శలు చేసే విషయంలో సంయమనం పాటించాల్సిందిగా మౌఖిక ఆదేశాలేమైనా వచ్చాయా అనే అనుమానం కలగక మానదు.

DB is for leg pulling,info share,timepass dont take all posts to heart/dil pe ..DB is Pressure Release
 

Methhanithodugu
Megastar
Username: Methhanithodugu

Post Number: 25151
Registered: 12-2008
Posted From: 117.195.222.187

Rating: 
Votes: 1 (Vote!)

Posted on Monday, June 03, 2013 - 10:34 am:       

http://krishnapatrika.com/content_left/content_left_1.html
సాధారణ ఎన్నికల ముం గిట రాజకీయ సమీకరణలు శరవేగంగా మారిపోతు న్నాయి. కొన్ని పార్టీలు బాహాటంగా తమ వైఖరిని కుండబద్దలుకొట్టి ముందుకు వెళ్తుంటే మరికొన్ని పార్టీలు లోగుట్టుగా రహస్యంగా ఒప్పందాలు చేసుకుని పైకిమాత్రం మరోలా నటిస్తున్నాయి. మొన్నటి వరకు భాజపాను మతతత్వ పార్టీగా తెగనాడిన వైసీపీ ఇప్పుడు తన భవిష్యత్తు అవసరాల కోసం అదే పార్టీతో ఎన్నికల అనంతరం సయోధ్యకు అంతర్గతంగా రంగం సిద్ధం చేసుకుంటోందా! ఇప్పటి వరకు వైసీపీకి అండగా ఉన్న ముస్లింలు, దళితులలోని ఒక వర్గం ఓటు బ్యాంకు చేజారి పోతుందనే భయంతో ముందస్తు పొత్తుకు భాజ పాకు నో చెబుతూ ఎన్నికల అనంతరం సై అంటుందా అవుననే అంటున్నాయి విశ్వసనీయ వర్గాలు. భాజపా ప్రధాని అభ్యర్థిగా ప్రచారంలో వున్న గుజరాత్ ముఖ్యమంత్రి మోడీ దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీల మద్దతును కూడగట్టుకునే పనిలో బిజీగా వున్నారు. గుజరాత్ అభివృద్ధి నమోనాను దేశవ్యాప్తంగా అమలు చేస్తామని, వందేళ్ళ పైబడి చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ దేశానికి చేసిందేమీ లేదని, కమీషన్ల పార్టీ అది అని ధ్వజమెత్తుతున్న నరేంద్రమోడీ కాంగ్రెస్ పట్ల వ్యతిరేకతను ప్రజల్లో రెచ్చగొట్టి తాను రాజకీయ లబ్దిపొందేందుకు ఆరాట పడుతున్నారు. అందులో భాగంగా తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వంటి నేతలతో సమాలోచనలు జరుపుతూ అనుకూలంగా మల్చుకునే ప్రయత్నంలో వున్న మోడీ ఆంధ్రప్రదేశ్‌పైనా దృష్టి సారించారు. ఏపీలో వైసీపీ ఆధిక్యతను సాధిస్తుందని తనకందిన సమాచారంతో ఆ పార్టీని మచ్చిక చేసుకోవాలని తలంచారు. అప్పటికే కాంగ్రెస్ తీరుతో గుర్రుగా వున్న వైసీపీ నేతలకు కూడా మోడీ ఆలోచనలను పసిగట్టారు. అంతకు ముందు ఎన్డీయే హయాంలో భాజపా నాయకత్వంతో సన్నిహిత సంబంధాలు కలిగిన నాటి టిడిపి ఎంపీ, ప్రస్తుత వైసీపీలో కీలక స్థానంలో వున్న నేత ఒకరు తనదైన శైలిలో వ్యూహ రచన చేశారు. మోడీ మనస్సు ను గ్రహించిన ఆ మాజీ ఎంపీ ఢిల్లీలోని తన పాత భాజపా స్నేహితుని ద్వారా సమాచారాన్ని గాంధీనగ ర్‌కు చేరవేసి, అక్కడి నుంచి ప్రత్యేక దూతతో హైదరాబాద్‌లోని లోటస్ పాండ్ పెద్దలతో భేటీకి ఏర్పాటు చేశారు. ఇటీవల మోడీ ప్రతినిధిగా ప్రత్యేక దూత ఇటీవల అర్థరాత్రి అక్కడ వారితో సమావేశమ య్యారు. వైసీపీ తరఫున వైఎస్ విజయమ్మ, వైఎస్ కుటుంబానికి సమీప బంధువు అయిన వైవీ సుబ్బారెడ్డి ఆ చర్చల్లో పాల్గొనగా, టిడిపిలో ఎంపీలుగా పనిచేసిన ఇద్దరు చర్చల్లో పాలుపంచుకున్నారు. మోడీ దూతగా హాజరైన ఆ ప్రతినిధి ఆయన తరఫున ప్రతిపాద నలను రహస్య భేటీలో ముందుం చారు. ‘పీయం అభ్యర్థిగా భాజపా తరఫున మోడీ వుండబోతున్నారు. మోడీ ప్రధాని అయ్యేది ఖాయం. ఆయన నాయకత్వాన్ని బలపర్చండి, ఎన్నికల అనంతరం మాతో కలవండి, మీకు చేయాల్సిన సాయం చేస్తాం, జగన్ కేసుల విషయం లో సాయంపై కాంగ్రెస్‌ను నమ్ముకోవద్దు, ఎట్టి పరిస్థితి లోనూ కాంగ్రెస్ పార్టీ జగన్‌కు మేలుచేసే పనులు చేయదు, మా మాట నమ్మండి, అవుట్ రైట్‌గా మోడీ హెల్ప్ చేస్తారు అని ఆయన వైసీపీ నేతలకు మాట ఇచ్చారు. మోడీ దూత అభిప్రాయాలతో వైసీపీ నేతలు దాదాపుగా ఏకీభవించారు. అప్పటికే కాంగ్రెస్ తీరుపై కోపంగా వున్న వైసీపీ నేతలు ఎదుర్కొన్న ఇబ్బందులను వివరించారు. కేసు తీవ్రతను తగ్గించుకోడానికి యూపీఏ సహకరిస్తుందనే ఉద్దేశంతోనే ఎన్నికల అనంతరం యూపీఏతో కలిసి వెళ్తామని సంకేతాలిచ్చాం. అయినా కాంగ్రెస్‌కు ఏ మాత్రం దయా, జాలీ మాపై కలగలేదు, రోజురోజుకి ఏదో విధంగా ఇబ్బందుల పాల్చేయడా నికే కేసును మరింత జటిలం చేసి, రాజకీయంగా దెబ్బతీయాలనే ధోరణితోనే కాంగ్రెస్ వుందని నిశ్చితాభిప్రాయంతో వున్న వైసీపీ నేతలు ఎన్నికల అనంతరం భాజపాతో ముఖ్యంగా నరేంద్రమోడీ ప్రధాని అయ్యే పక్షంలో కలవాలనే ఒడంబడికకు సై అన్నారు. అయితే ఎన్నికల ముందస్తు పొత్తుపై మోడీ దూత నుంచిగానీ, వైసీపీ తరఫున గానీ ఎటువంటి ప్రతిపాదన చర్చలో తారసపడలేదు. కాంగ్రెస్‌పై లోలోపల విపరీతమైన కసితో వున్న వైసీపీ నేతలు, }
DB is for leg pulling,info share,timepass dont take all posts to heart/dil pe ..DB is Pressure Release
 

Methhanithodugu
Megastar
Username: Methhanithodugu

Post Number: 25150
Registered: 12-2008
Posted From: 117.195.222.187

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Monday, June 03, 2013 - 10:30 am:       

wrong content just a minute ... sorry
DB is for leg pulling,info share,timepass dont take all posts to heart/dil pe ..DB is Pressure Release
 

Methhanithodugu
Megastar
Username: Methhanithodugu

Post Number: 25148
Registered: 12-2008
Posted From: 117.195.222.187

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Monday, June 03, 2013 - 10:26 am:       

http://www.krishnapatrika.com/content_middle/content_middle_ 1.html
ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి గత కొంత కాలంగా కొరకరాని కొయ్యగా మారిన కడప జిల్లా సీనియర్ నాయకుడు డీఎల్ రవీంద్రారెడ్డిని బర్తరఫ్ చేస్తూ ముఖ్యమంత్రి గవర్నర్‌కు సిఫారసు చేశారు. ముఖ్యమంత్రి చేసిన సిఫారసును ఆమోదిస్తూ గవర్నర్ డిఎల్‌ను మంత్రి పదవి నుంచి తొలగిస్తూ ఆదేశాలిచ్చారు. కాగా డిఎల్ రవీంద్రారెడ్డి నిర్వహిస్తున్న వైద్య ఆరోగ్య శాఖను వైద్య విద్యశాఖ మంత్రి కొండ్రు మురళికి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఆదేశాలిచ్చారు. కాగా బర్తరఫ్‌కు గురైన మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్నారు. ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి క్యాబినెట్‌లో వైద్యఆరోగ్య శాఖ మంత్రిగా పని చేస్తున్నారు. రాజశేఖరరెడ్డి మంత్రి వర్గంలో డీఎల్‌కు అవకాశం రాలేదు. కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రి కాగానే కడపజిల్లా నుండి డీఎల్‌కు మంత్రిగా అవకాశం ఇవ్వడమేకాకుండా అతను వైద్యుడు కావడంతో కీలకమైన ఆరోగ్యశాఖను అప్పగించారు. అయితే అతను మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మొదట్లోనే కడప పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నికలు రావడంతో కాంగ్రెస్ పార్టీ నుండి డీఎల్ రవీంద్రారెడ్డిని అభ్యర్థిగా సీఎం నిలబెట్టారు. వైసీపీ నుండి జగన్ పోటి చేయడంతో అప్పటికే వైసీపీ బలంగా ఉండడం, వైఎస్ మరణంతో సానుభూతి ఉండడంతో కాంగ్రెస్ కడపలో ఘోర పరాజయం పాలైంది. చివరకు డీఎల్ సొంత నియోజక వర్గం మైదుకూరులో డిపాడిట్ కోల్పోయింది. దీంతో ముఖ్యమంత్రి పోటి చేయమని ఒత్తిడి చేయడం వల్లనే తనకు అవమానం జరిగిందని భావించి ఆయనపై ఉప ఎన్నికల తర్వాత అసంతృప్తితో అసమ్మతి గళాన్ని వినిపిస్తూ.. సొంత పథకాలు, ఆరోగ్యశాఖలో నెలకొన్న సమస్యలపై బహిరంగంగా అటూ ప్రభుత్వంపై ఇటూ ముఖ్యమంత్రిపైనా తీవ్రమైన విమర్శలకు దిగారు. దీంతో డీఎల్ వల్ల పార్టీకి, ప్రభుత్వానికి నష్టం వాటిళ్లుతుందని భావించిన ముఖ్యమంత్రి ఆయనను మంత్రి వర్గం నుండి తప్పించేందుకు అధిష్టానం వద్ద అనుమతి కోసం చాలా కాలంగా ప్రయత్నం చేస్తూ ఇపడు సఫలమయ్యారు. ఇకపోతే గతంలో శంకర్రావు విషయంలో కూడా ముఖ్యమంత్రి ఇదే రకంగా ఆయనను తప్పించి.. తన మాట నిలబెట్టుకున్నారు. ఇక ప్రభుత్వంలో ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా కడప జిల్లాకు చెందిన మరో మంత్రి సి.రామచంద్రయ్య గత కొంత కాలంగా బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు. పీఆర్పీ నుంచి వచ్చిన రామచంద్రయ్యతో చిరంజీవి వత్తిడితో మంత్రి పదవి ఇచ్చారు. అయితే ఆయనకు దేవాదాయ శాఖ ఇవ్వడం పట్ల అసంతృప్తిగా ఉన్న ఆయన ముఖ్యమంత్రిపైన పరోక్ష విమర్శలు చేయడమేకాకుండా చిరంజీవిని ముఖ్యమంత్రి చెయ్యాలని కాంగ్రెస్‌లో ప్రజాకర్షణ ఉన్న నాయకుడు అతనే నంటూ అనేక సందర్భాలలో మాట్లాడారు. ఇది ముఖ్యమంత్రికి వ్యక్తిగతంగా, ఇబ్బందిగా ఉన్నా.. ఆయన ఎక్కడ ఎపడూ మాట్లాడలేదు. శంకర్రావు, డీఎల్‌ల భర్తరఫ్ వ్యవహారంతో ఇక సి.ఆర్. పని కూడా అయిపోయినట్లేనని ప్రచారం జరుగుతోంది. ఇకపోతే తెలంగాణ నుండి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న దామోదర రాజనర్సింహకు ముఖ్యమంత్రికి మధ్యన సయోధ్య లేదు. అనేక సందర్భాలలో ఉప ముఖ్యమంత్రి సీఎంకు వ్యతిరేకంగా రాజకీయాలు నడిపినట్లు అధిష్టానం వద్ద సీఎంపై ఫిర్యాదులు చేసినట్లు ప్రచారం జరిగింది. మెదక్ జిల్లాలో ప్రతిష్టాత్మకంగా బంగారుతల్లి పథకాన్ని ప్రారంభించే సమయంలో కూడా డిప్యూటీ సీఎం హాజరు కాకపోడం, వారి మధ్యన విభేదాలకు పరాకాష్టగా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో డిప్యూటీకి వార్నింగ్ ఇచ్చేందుకు సీఎం అధిష్టానం నుంచి అనుమతి తీసుకున్నారని అధిష్టానమే డిప్యూటీకి కలిసి పని చేసేలా సూచిస్తుందని తెలిసింది. మొత్తంగా ముఖ్యమంత్రి క్యాబినెట్‌పై పూర్తిస్థాయి పట్టు సాధించినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్నికల ఏడాదిలో ఇక ఎవరు కూడా ముఖ్యమంత్రిపై అసంతృప్తి రాజకీయాలు చేసేందుకు ఆస్కారం లేకుండా డీఎల్ వ్యవహరం ఒక సూచనగా ఉంటుందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

DB is for leg pulling,info share,timepass dont take all posts to heart/dil pe ..DB is Pressure Release
 

Methhanithodugu
Megastar
Username: Methhanithodugu

Post Number: 25147
Registered: 12-2008
Posted From: 117.195.222.187

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Monday, June 03, 2013 - 10:25 am:       


DB is for leg pulling,info share,timepass dont take all posts to heart/dil pe ..DB is Pressure Release

Add Your Message Here
Post:
Bold text Italics Underline Create a hyperlink Insert a clipart image HASH(0x1b69ef8){Movie Clipart}
Show / hide regular icons selection options

Click on following links to open cliparts by Alphabetical Order

 A   B   C   D   E   F   G   H   I   J   K   L   M  

N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z  

Show / Hide Filmy icons selection options

Click on following links to open cliparts by Alphabetical Order

  A   B   C   D   E   F   G   H   I   J   K   L   M  

N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z  

Username: Posting Information:
This is a public posting area. Enter your username and password if you have an account. Otherwise, enter your full name as your username and leave the password blank. Your e-mail address is optional.
Password:
E-mail:
Options: Enable HTML code in message
Automatically activate URLs in message
Action: