Topics | Search Log Out | Register | Edit Profile
Hide Clipart | Banned/Unbanned User Log | Moderator Login History | Thread Delete/Move Log | Last 30 mins | 1 | 2
కాపుల ఆదరణ ఈసారి ఎవరికి! ???...

Chalanachithram.com DB » Caste Related Discussions » కాపుల ఆదరణ ఈసారి ఎవరికి! ??? « Previous Next »
Author Message
 

Methhanithodugu
Megastar
Username: Methhanithodugu

Post Number: 23719
Registered: 12-2008
Posted From: 117.195.195.215

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Tuesday, April 09, 2013 - 02:42 pm:       

రాష్ట్రంలో ఈసారి కాపు సామాజికవర్గం ఎటు వైపు వెళుతుంది?మెగాస్టార్ ,కేంద్ర మంత్రి చిరంజీవి నాయకత్వానికి మద్దతు ఇస్తుందా? లేక టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు చేసిన కొత్త వాగ్దానానికి ఆకర్షితులై ఆ పార్టీకి అనుకూలం అవుతుందా?లేక గతంలో వై.ఎస్.రాజశేఖరరెడ్డితో ఉన్న అనుబందం పనిచేసి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పైపు వెళుతుందా అన్నది ఆసక్తికరంగా ఉంది.కాపు సామాజికవర్గం బలిజ,ఒంటరి, తూర్పు కాపు, ఇలా వివిధ పేర్లతో రాష్ట్రంలో గణనీయంగా ఉంది.తూర్పు కాపు, మున్నూరు కాపు వర్గాలు బిసి వర్గానికి చెందిన సామాజిక స్థాయిలో కాపు వర్గం కింద పరిగణనలో ఉన్నాయి.ప్రత్యేకించి కోస్తాలో అత్యధిక సంఖ్యలో ఈ సామాజికవర్గం జనాభా ఉంది.తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత కృష్ణ,గుంటూరు జిల్లాలలో ఈ వర్గం ఎక్కువగా కాంగ్రెస్ లోనే ఉన్నా, తూర్పు, పశ్చిమగోదావరి , అలాగే ఉత్తరాంద్ర జిల్లాలలో ఎక్కువ భాగం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటూ వచ్చింది.అనేక మంది ప్రముఖ నాయకులు ఆ వర్గానికి చెందినవారు టిడిపిలో రాణించారు.రెండువేల నాలుగులో వై.ఎస్.రాజశేఖరరెడ్డి వ్యూహాత్మకంగా కాపు, రెడ్డి కాంబినేషన్ ను విజయవంతంగా నడిపి ప్రభుత్వంలోకి వచ్చారు. ఆ తర్వాత 2009 లో మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించి కాపులను అత్యధికంగా తన వైపు ఆకర్షించుకోగలిగారు. కాని పూర్తి స్థాయి విజయం సాధించలేకపోవడంతో ఆ వర్గ నాయకత్వం డీలాపడింది. అయినప్పట్టికీ చిరంజీవి కాంగ్రెస్ లో క్రియాశీల పాత్ర పోషించే పరిస్థితిలో ఉండడం వారిలో చాలామందికి సంతోషం కలిగించే అంశంగా ఉంటుంది.ముఖ్యమంత్రి గా తమ వర్గానికి చెందిన చిరంజీవి కావాలని వారు బలీయంగా కోరుకున్నా పరిస్థితులు కలిసి రాలేదు. కాని ఇటీవలి కాలంలో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ఆవిర్భావం తర్వాత రెడ్డి సామాజికవర్గం ఆ పార్టీవైపు వెళ్లడంతో కాంగ్రెస్ ను కాపు సామాజికవర్గం తమదిగా భావించడం ఆరంభమైంది.దానికి తోడు చిరంజీవి నాయకత్వం ఉండడం కూడా ఉపయోగపడుతోంది. ఈ నేపధ్యంలో టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు కాపులను ఆకట్టుకోవడానికి వివిధ పధకాలను ప్రకటించారు. ప్రత్యేకించి కాపులకు వెయ్యి కోట్లు సంవత్సరానికి ఇస్తామని ప్రకటించడం వాటిలో ఒకటి.అలాగే రిజర్వేషన్ల గురించి కూడా యోచిస్తామని ఆయన చెప్పారు. తిరిగి తన పార్టీలోకి వచ్చేయాలని ఆయన కోరారు.దీనికి ఎంతవరకు ఆకర్షితులవుతారన్నది అప్పుడే చెప్పజాలం. గుంటూరు, కృష్ణ జిల్లాలలో కమ్మ సామాజికవర్గం ఎక్కువగా టిడిపిలో ఉండడంతో ఆ జిల్లాలలోని కాపులు అదిక భాగం కాంగ్రెస్ లో ఉంటారన్న అభిప్రాయం ఉంది. అయితే వీరిలో పలువురికి రాజశేఖరరెడ్డి పట్ల ప్రత్యేక అనుబంధం ఉండేది. అనూహ్య పరిణామాలలో జగన్ పార్టీ పెట్టడంతో కొందరు ఆ వైపు నకు మొగ్గు చూపుతున్నారు. వంగవీటి రాధ, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, అంబటి రాంబాబు వంటి నేతలు ఈ పార్టీలో ఉన్నారు.కాని మంత్రి కన్నా లక్ష్మీనారాయణ వంటి బలమైన కాపు నేతలు కాంగ్రెస్ లోనే ఉన్నారు. ఈ నేపధ్యంలో ఈ రెండు జిల్లాలలో ఈ ఓట్లలో చీలిక వచ్చే అవకాశం కనిపిస్తోంది.కాగా ఉత్తరాంద్ర జిల్లాలలో కాపు వర్గం నాయకులు ప్రధానంగా టిడిపిలో ఎక్కువగా ఉన్నారు. అందువల్ల కాంగ్రెస్ వైపు పెద్దగా వెళ్లే అవకాశం లేదు.కాకపోతే జగన్ సానుభూతి కనుక ఎక్కువగా ఉంటే వీరు అటు మొగ్గు చూపవచ్చు.ఇక తూర్పు,గోదావరి,పశ్చిమగోదావరి జిల్లాలో మాత్రం కాంగ్రెస్ వైపే ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఈ నేపధ్యంలోనే కాపులను తమవైపు పూర్తిగా తిప్పుకోవాలని చిరంజీవి, తిరిగి వెనక్కి తెచ్చుకోవాలని చంద్రబాబు నాయుడు, కాపుల ఆదరణను వై.ఎస్.అనుబంధం ద్వారా పొందాలని జగన్ ప్రయత్నిస్తున్నారు. ఎవరి ఫ్రయత్నాలు సఫలం అవుతాయో చూడాలి.

DB is for leg pulling,info shr,timepass dont take all posts to dil pe /heart..

Add Your Message Here
Post:
Bold text Italics Underline Create a hyperlink Insert a clipart image HASH(0x1826ef8){Movie Clipart}
Show / hide regular icons selection options

Click on following links to open cliparts by Alphabetical Order

 A   B   C   D   E   F   G   H   I   J   K   L   M  

N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z  

Show / Hide Filmy icons selection options

Click on following links to open cliparts by Alphabetical Order

  A   B   C   D   E   F   G   H   I   J   K   L   M  

N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z  

Username: Posting Information:
This is a private posting area. Only registered users and moderators may post messages here.
Password:
Options: Enable HTML code in message
Automatically activate URLs in message
Action: