| Author |
Message |
![]() ![]() ![]() ![]()
Methhanithodugu
Side Hero Username: Methhanithodugu
Post Number: 5593 Registered: 12-2008 Posted From: 59.93.54.132
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Saturday, August 07, 2010 - 05:33 pm: |
![]() ![]() ![]() ![]() ![]() |
అదనపు ఆదాయ మార్గాలు ( రూ. కోట్లలో) 1. ఎకై్సజ్ వేలం, ఇతర ఆదాయం: రూ. 7,000 2. భూముల మార్కెట్ విలువ పెంపు: రూ.1,000 3. కేంద్ర సాయం అదనంగా: రూ.10,000 4. గనులు, రవాణా పన్నులు పెంపు: రూ. 1000 5. పెట్రోల్, డీజిల్ ధరలతో అదనపు వ్యాట్: రూ. 400 6. విద్యుత్ ఛార్జీల పెంపు ద్వారా: రూ. 2000 కోత విధించిన సంక్షేమ పద్దుల వివరాలు (రూ. కోట్లలో) 1. ఫీజురీయంబర్స్‌మెంట్ నిబంధనలతో : రూ. 700 2. బోగస్ రేషన్ కార్డుల కోత(ఒక బియ్యంపైనే): 500 3 అభయహస్తం, ఇతర ఫించన్ల ద్వారా రూ. 1000 4. వివిధ సంక్షేమ పథకాల బకాయిలు : రూ. 10,0000 5 జలయజ్ఞం బకాయిలు : రూ.2,200
 Chiranjeevi Raajakeeya Zero
|
![]() ![]() ![]() ![]()
Methhanithodugu
Side Hero Username: Methhanithodugu
Post Number: 5592 Registered: 12-2008 Posted From: 59.93.54.132
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Saturday, August 07, 2010 - 05:31 pm: |
![]() ![]() ![]() ![]() ![]() |
పథకం ప్రారంభ సంవత్సరంలో బడ్జెట్‌లో రూ. నాలుగు వేల కోట్లు కేటాయిస్తే... ఈ ఆర్థిక సంవత్స రం పది లక్షల ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణానికి బడ్జెట్‌లో కేటాయించిన నిధులు రూ.1800 కోట్లు ఎంత మాత్రం చాలవని,ఈ నిధులతో ఆరు లక్షల ఇళ్ళు మాత్రమే పూర్తవుతాయని అధికారులు భావిస్తు న్నారు. మిగతా లక్ష్యం పూర్తి చేయాలంటే మరింత జాప్యం తప్పదని ప్రభుత్వ వర్గాలే బహిరంగంగా పెదవి విరుస్తున్నాయి. అదే విధంగా, రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య శ్రీ పథకాన్ని ఎంతో గొప్పగా పేర్కొంటున్న ప్పటికీ సామాన్య పేదలకు ఏమాత్రం సకాలంలో వైద్యం అందడం లేదు. ఆరోగ్య శ్రీ పథకానికి మాత్రమే సర్కార్ నిధులు సమకూర్చ డంతో... ప్రభుత్వ దావఖానాలు పూర్తిగా నీరుగారే పరిస్థితులు చోటుచేసుకున్నాయి. జాతీయ ఆరోగ్య మిషన్ కింద కేంద్రం అమలు చేస్తున్న పథకం పట్ల రాష్ర్ట సర్కార్ నిర్లక్ష్యంగానే వ్యవహరించింది. దీంతో ఈ పథకం కింద కేంద్రం కేటాయించిన నిధులు రూ. 600 కోట్లకుపైనే ఖర్చు చేయకపోవడంతో... గత ఏడాది పెద్ద ఎత్తున నిధులు మురిగిపోయిన విషయం తెలిసిందే. గిరిజన ప్రజలు విష జ్వరాలు, సై్వన్‌ప్లూ వంటి ప్రాణాంతక వ్యాధుల తో తీవ్ర ఇబ్బందులు పడుతుంటే... వారికి సకాలంలో వైద్యం అందే పరిస్థితులు కనుచూపుమేరలో కనబడడంలేదు. ఈ ప్రాంతాల్లో సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడంతో గిరిజన ప్రజలు వైద్యం కోసం వందల కిలోమీటర్లు ప్రయాణించాల్సిన పరిస్థితులు చోటుచేసుకున్నాయి. దీంతో పెద్ద సంఖ్యలో పేదలు సరైన వైద్యం సకాలంలో అందక మృత్యవాతకు గురవుతూనే ఉన్నారు.. మరోవైపు భారీ వర్షాలు రాష్ట్రాన్ని ముంచెత్తడంతో లోతట్టు ప్రాంత ప్రజలు తీవ్ర అంటు వ్యాధులతో పడరాని పాట్లు పడుతున్న విషయం తెలిసిందే. కాగా. జలయజ్ఞం పనులూ నత్త నడకన నడుస్తున్నాయి. సర్కారు పాత బకాయిల చెల్లింపులకే నిధులు కేటాయించడం గమనార్హం. గతంలో జలయజ్ఞం పద్దకు బడ్జెట్‌లో సింహాభాగం నిధులు కేటాయిస్తే.. 2010-11 బడ్జెట్‌లో ఇది రూ.15 వేల కోట్లుగా పేర్కొనడం జరిగిం ది. అదనపు ఆదాయ మార్గాలు ( రూ. కోట్లలో) 1. ఎకై్సజ్ వేలం, ఇతర ఆదాయం: రూ. 7,000 2. భూముల మార్కెట్ విలువ పెంపు: రూ.1,000 3. కేంద్ర సాయం అదనంగా: రూ.10,000 4. గనులు, రవాణా పన్నులు పెంపు: రూ. 1000 5. పెట్రోల్, డీజిల్ ధరలతో అదనపు వ్యాట్: రూ. 400 6. విద్యుత్ ఛార్జీల పెంపు ద్వారా: రూ. 2000 కోత విధించిన సంక్షేమ పద్దుల వివరాలు (రూ. కోట్లలో) 1. ఫీజురీయంబర్స్‌మెంట్ నిబంధనలతో : రూ. 700 2. బోగస్ రేషన్ కార్డుల కోత(ఒక బియ్యంపైనే): 500 3 అభయహస్తం, ఇతర ఫించన్ల ద్వారా రూ. 1000 4. వివిధ సంక్షేమ పథకాల బకాయిలు : రూ. 10,0000 5 జలయజ్ఞం బకాయిలు : రూ.2,200 Chiranjeevi Raajakeeya Zero
|
![]() ![]() ![]() ![]()
Methhanithodugu
Side Hero Username: Methhanithodugu
Post Number: 5591 Registered: 12-2008 Posted From: 59.93.54.132
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Saturday, August 07, 2010 - 05:30 pm: |
![]() ![]() ![]() ![]() ![]() |
ఖజానా ఫుల్... ఖర్చులు నహైదరాబాద్, మేజర్‌న్యూస్: ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమంపై కన్నెర్ర చేస్తూనే... మరోవైపు వరుస పన్నుల వడ్డనతో సామాన్యుడి రక్తం పీల్చే విధంగా సర్కార్ వ్యవ హరిస్తున్నది. ఎకై్సజ్ పన్నులు, విక్రయాల ద్వారా ఈ ఏడాది రూ. 15 వేల కోట్లకుపైనే ఆదాయం సమకూరుతున్నది. అదే విధంగా పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో వాణిజ్య పన్నుల ద్వారా అదనంగా రూ.400 కోట్ల వరకూ ఖజానాకు చేరునున్నది. అదే విధంగా భూముల మార్కెట్ విలువ పెంపుతో రూ. వెయ్యి కోట్ల వరకూ అదనపు ఆదాయాన్ని సమకూర్చాలని ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుంది. పరిశ్రమలు, వాణిజ్య సంస్థల విద్యుత్ ఛార్జీల పెంపుతో రాష్ట్ర ఖజానాకు రూ. రెండు వేల కోట్లకుగాపై ఆదాయం సమకూరనున్నది. గనుల పన్ను, రవాణా ఛార్జీల మోతతో మొత్తంగా ఈ ఏడాది ప్రభుత్వ సొంత పన్నుల ఆదాయ లక్ష్యం బడ్జెట్‌లో రూ. 47 వేల కోట్లుగా నిర్ణయిస్తే... తాజా పన్నులు ఇతరత్రా వడ్డనలతో ఇది మరో రూ. పది వేల కోట్లకుపైనే అదనంగా ఖజానాకు సమకూరుతుందని ప్రభుత్వ అంచనా. ఇదేనా...రోశయ్య మార్క్ పాలన..! 2010-11లో రూ. లక్షా 13 వేల కోట్ల భారీ బడ్జెట్‌ను ప్రకటించి నప్పటకీ.. ప్రారంభంలో నిధుల సర్థుబాటు కోసం సర్కార్ తీవ్ర ఇక్కట్లను చవిచూసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ సొంత పన్నుల ఆదాయంతోపాటు కేంద్రం నుంచి గ్రాంట్లు, ఇతరత్రా నిధులు రూ. 20 వేల కోట్లుకుపైనే వచ్చిపడుతున్నపటికీ... రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను అనర్హత పేరుతో అటకెక్కించే ప్రయత్నాలను ముమ్మరంగా చేయడం గమనార్హం. అభయ హస్తం, ఇందిరమ్మ ఇళ్ళు, కిలో రూ.2 బియ్యంపథకం, పావలా వడ్డీ రుణాలు తదితర సంక్షేమ పథకాలకు అంటకత్తిర వేస్తూనే... నిబంధనల పేరుతో ఫీజు రీయంబర్స్‌మెంట్‌తోపాటు ఇతర ఉపకార వేతనాల చెల్లింపులకు సర్కార్ ఎగనామం పెట్టడం గమనార్హం. తాజా నిబంధనలు అమలుతో ఒక ఫీజు రీయం బర్స్‌మెంట్ ద్వారానే రాష్ట్ర ఖజానాకు రూ. 700 కోట్లుమిగులుతుందని అధికారులు భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో సంక్షేమ పథకాలను ఆకర్షణీయంగా ప్రకటించినప్ప టికీ...వీటి ఖర్చు అంతంత మాత్రంగానే ఉంది. దీంతో రోశయ్య మార్క్ పాలన ఎవరి కోసం..? అనే సందే హన్ని రాష్ట్ర ప్రజల్లో సర్వ త్రా వ్యక్తం అవుతోంది. బియ్యంపైనే రూ. 500 కోట్లు మిగులు... మరో వైపు రాష్ట్ర ఖజానాను నింపుకునే భాగంగా మద్యం ప్రవా హం పెంచడంతోపాటు.. ప్రస్తుతం ఉన్న బార్ల సంఖ్యను జనా భా ప్రాతిపదికన ఏర్పాటు చేయడానికి నిర్ణయించడం విశేషం. రాష్ట్ర ప్రభుత్వం ఫీజురీయంబర్స్‌మెంట్ పథకాన్ని శతవిధాల అడ్డుకునే విధంగా నిబంధనలను రూపొందించడంతోపాటు, మరోవైపు విద్యా ర్థులు చెల్లించాల్సిన అన్ని రకాల ఫీజులను రికార్డ్ స్థాయిలో పెంచి... విద్యార్థులను విద్యకు దూరం చేసి, వారి జీవితాలతో చెలగాట మాడుతున్నదనే ఆరోపణలు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆహార భధ్రత చట్టం పటిష్టంగా అమలు చేయాలని వేగంగా పావులు కదుపుతుంటే, మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం బోగస్ కార్డులతో పేరుతో పేదల చేతిలో ఉన్న 20 లక్షల తెల్లకార్డులకు కోతలు పెట్టడం విశేషం. దీంతో ఒక్క బియ్యంపైనే రాష్ట్ర ఖజానాకు రూ. 500 కోట్ల ఆదాయం మిగులుతుందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు బహిరంగ మార్కెట్లో నిత్యవసరాల ధరలు భగ్గున మండిపడుతుంటే.. రాష్ట్ర ప్రభుత్వం రేషన్‌కార్డులను కోత విధించడం ఎంత వరకూ సబబు అని ప్రతిపక్షాలుసైతం గగ్గోలెడుతున్నాయి. అదే విధంగా దివంగత ముఖ్యమంత్రి ఎంతో అట్టహాసంగా ప్రారంభించిన అభయ హస్తం పథకానికి...రోశయ్య సర్కార్ రిక్తహస్తం చూపించిందనే ఆరోపణలు వెల్లువలా వస్తున్నాయి. దాదాపు ఈ బకాయిలే రూ. వెయ్యి కోట్ల వరకూ ఉంటాయని తెలుస్తున్నది. దీంతోపాటు ఇతర సామాజిక ఫించన్ల అమలు కూడా నత్తనడకన నడస్తున్నాయనే విమర్శలు వస్తున్నాయి. ఎయిడ్స్‌తో చనిపోయిన బాధిత కుటుంబాలకు గతంలో ప్రభుత్వం అందచేసిన రూ.ఐదు వేలు ఆర్థికసాయం కూడా తమకు చేరడంలే దని బాధిత కుటుంబాలు వాపోతున్నాయి. ప్రతి మండలంలోనూ వందల సంఖ్యలో సర్కార్ సాయం కోసం ఎయిడ్స్ బాధిత కుటుంబా లు ఎదురు చూస్తున్నాయి. ఏళ్ళు గడుస్తున్న తమకు ప్రభుత్వ సా యం అందడంలేదని ఎయిడ్స్ బాధిత కుటుంబాలు వాపోతున్నాయి. నీరుగారిన ఇందిరమ్మ ఇళ్ళు... దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖ రెడ్డి ఎంతో ఆర్భాటంగా అమలు చేసిన ఇందిరమ్మ ఇళ్ళ పథకానికిసైతం సర్కార్ సీతకన్ను వైఖరి ప్రదర్శిస్తున్నదనే విమర్శలు పోటెత్తుతున్నాయి. రాష్ట్రంలో 64 లక్షల ఇందిరమ్మ ఇళ్ళు నిర్మాణ లక్ష్యంలో, ఇప్పటి వరకూ 34 లక్షల ఇళ్ళను మాత్రమే పూర్తిచేసినట్లు సర్కా ర్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
Chiranjeevi Raajakeeya Zero
|
|